Inspiring Story: 2026 కామన్వెల్త్ క్రీడల్లో భారత్ బోణీ కొట్టింది. కష్టాలను ఎదిరించి, పట్టుదలతో పోరాడిన భారత పారా పవర్‌లిఫ్టర్ ఝండు కుమార్ అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుని దేశానికి తొలి పతకాన్ని అందించాడు.
పురుషుల హెవీవెయిట్ పారా పవర్‌లిఫ్టింగ్ విభాగంలో పోటీపడిన 29 ఏళ్ల ఝండు కుమార్, 190 కిలోల బరువును విజయవంతంగా ఎత్తి మొత్తం 130.9 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.
ఆయన అసలు పేరు అవినాష్ కుమార్. ఝండు కుమార్…తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. బీహార్‌లోని నలందా జిల్లా హర్నాట్ గ్రామంలో జన్మించిన ఆయన..పుట్టుకతోనే పోలియో బారిన పడి కాళ్లు చచ్చుబడిపోయాయి. కుటుంబానికి భారం అయ్యాడంటూ బంధువులు అవమానించేవారట. అలా ఝండూ అనే పేరు వచ్చింది. ఝండు అంటే మూర్ఖుడు అని అర్థం. అదే పేరు స్థిరపడిపోయింది. కటిక పేదరికం అనుభవించిన ఆయన కుటుంబానికి చేయూతగా నిలిచేందుకు తండ్రితో కలిసి రోడ్డు పక్కన బంగాళాదుంపలు, ఉల్లిపాయలు అమ్మేవారు. 10 ఏళ్ల వయసు నుంచే ట్రై సైకిల్ పై 20 కిలోమీటర్లు ప్రయాణించి కూరగాయలు అమ్మేవాడు. అదే ఇ-రిక్షా. జీవితం విసిరిన సవాళ్లకు లొంగిపోకుండా, పవర్ లిఫ్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుని కష్టపడి శిక్షణ పొందారు.
24
ఉత్కంఠభరితమైన పోటీ నడుమ
పోటీలో ఝండు కుమార్ తన రెండవ ప్రయత్నంలో 190 కిలోల బరువును ఎత్తి 130.9 పాయింట్లతో అగ్రస్థానానికి చేరి పోటీదారులపై ఒత్తిడి పెంచారు. మూడో ప్రయత్నంలో 196 కిలోల బరువు ఎత్తే క్రమంలో బార్‌బెల్ రాక్‌కు తగలడంతో కొద్దిలో రికార్డును చేజార్చుకున్నారు. అయినప్పటికీ, ఆయన సాధించిన 130.9 పాయింట్లు పతకాన్ని ఖాయం చేశాయి. నైజీరియాకు చెందిన రిలువాన్ ఇద్రిస్ (132.8 పాయింట్లు) స్వర్ణం గెలవగా, ఇంగ్లాండ్‌కు చెందిన మాథ్యూ హార్డింగ్ (131.0 పాయింట్లు) రజతం సాధించాడు. నైజీరియన్ అథ్లెట్ తన చివరి ప్రయత్నంలో విఫలమవడంతో ఝండు కుమార్‌కు కాంస్యం ఖరారైంది.
34
నా దేశ పతాకాన్ని చూస్తుంటే గర్వంగా ఉంది
పతకం సాధించిన అనంతరం ఝండు కుమార్ భావోద్వేగానికి లోనయ్యారు. తన ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నానని అన్నారు. వేదికపై మన జాతీయ పతాకాన్ని చూస్తుంటే ఎంతో గర్వంగా అనిపించిందని ఝండు కుమార్ చెప్పారు. కష్టాలను జయించి దేశ కీర్తిపతాకాన్ని ఎగురవేసిన ఝండు కుమార్ కథ, ప్రతి ఒక్కరికీ ఆదర్శం. ఈ విజయంతో లభించిన ఆత్మవిశ్వాసంతో, లాస్ ఏంజిల్స్ 2028 పారాలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు.
కష్టాలను జయించి దేశ కీర్తిపతాకాన్ని ఎగురవేసిన ఝండు కుమార్ కథ, ప్రతి ఒక్కరికీ ఆదర్శం. ఈ విజయంతో లభించిన ఆత్మవిశ్వాసంతో, లోస్ ఏంజిల్స్ 2028 పారాలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు.