Footwear Capital: చెప్పుల తయారీలో దేశంలోనే నంబర్ వన్ నగరం.. రోజుకు లక్షల జతల తయారీ!

Published : Nov 25, 2026, 02:22 PM IST

Footwear Capital: మన దేశంలో ఒక్కో సిటీకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొన్ని నగరాలు బంగారు నగలకు ప్రసిద్ధి చెందితే, మరికొన్ని వస్త్రాలు, హస్తకళలకు పెట్టింది పేరు. మరి మనం రోజూ వాడే చెప్పుల తయారీలో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన నగరం ఏదో మీకు తెలుసా?

PREV
15
మన దేశంలో చెప్పుల తయారీకి ఫేమస్ నగరం

మన దేశంలో చెప్పుల తయారీకి ప్రసిద్ధి చెందిన నగరం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నగరం. తాజ్‌మహల్‌కు నిలయమైన ఈ నగరం పర్యాటక ప్రాంతంగానే కాకుండా ఫుట్‌వేర్ తయారీకి కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందుకే దీన్ని భారత దేశపు ఫుట్‌వేర్ క్యాపిటల్ అని పిలుస్తారు. అసలు ఆగ్రా నగరానికి ఈ పేరు ఎలా వచ్చింది? ఇక్కడ ఎలాంటి చెప్పులు తయారవుతాయో తెలుసుకుందాం.

25
ఆగ్రాకు ఫుట్‌వేర్ క్యాపిటల్ అనే పేరు ఎలా వచ్చింది?

ఆగ్రా నగరం చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా తోలుతో వస్తువులు తయారు చేసే నైపుణ్యం ఇక్కడి ప్రజల్లో తరతరాలుగా కొనసాగుతోంది. మొదట్లో ఇక్కడ చిన్న యూనిట్లతో ప్రారంభమైన చెప్పుల తయారీ.. ఇప్పుడు యంత్రాల సహాయంతో పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంది. అందువల్లే ఆగ్రా మన దేశంలోనే ప్రముఖ చెప్పుల తయారీ కేంద్రంగా గుర్తింపు పొందింది.

35
రోజుకు లక్షల జతల చెప్పుల తయారీ

ఆగ్రా లో చిన్న పరిశ్రమల నుంచి ఆధునిక తయారీ యూనిట్ల వరకు అనేక సంస్థలు చెప్పుల తయారీలో నిమగ్నమై ఉన్నాయి. ఆగ్రా ఫుట్‌వేర్ క్లస్టర్‌తో పాటు సమీపంలోని మథుర ప్రాంతంలో రోజుకు సుమారు 1.5 లక్షల జతల చెప్పులు తయారవుతున్నాయి. అంతేకాదు, భారత దేశపు మొత్తం ఫుట్‌వేర్ ఎగుమతుల్లో ఈ క్లస్టర్ వాటా దాదాపు 28 శాతంగా ఉంది. ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులు దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లకు కూడా చేరుతున్నాయి.

45
ఎలాంటి చెప్పులు తయారు చేస్తారు?

ఆగ్రాలో అనేక రకాల ఫుట్‌వేర్ ఉత్పత్తులు తయారవుతాయి. ముఖ్యంగా లెదర్ షూస్, ఫార్మల్ షూస్, క్యాజువల్ షూస్, సాండల్స్, స్లిప్పర్స్, మహిళల ఫ్యాషన్ ఫుట్‌వేర్ వంటి వివిధ రకాల డిజైన్లు అందుబాటులో ఉంటాయి. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కొత్త కొత్త మోడళ్లను ఇక్కడ తయారు చేస్తున్నారు. కొన్నిచోట్ల చేతితో ప్రత్యేక డిజైన్లు రూపొందిస్తుండగా, మరికొన్ని పరిశ్రమల్లో ఆధునిక యంత్రాల సహాయంతో భారీగా ఉత్పత్తి చేస్తున్నారు.

55
వేలాది కుటుంబాలకు ఉపాధి

ఈ చెప్పుల పరిశ్రమ ఎంతోమంది కుటుంబాలకు జీవనాధారంగా మారింది. చెప్పుల తయారీకి ప్రతి దశలో ప్రత్యేక నైపుణ్యం కలిగిన కార్మికుల అవసరం ఉంటుంది. ముఖ్యంగా స్థానిక యువతకు, చేతివృత్తులపై అనుభవం ఉన్నవారికి ఈ పరిశ్రమ మంచి అవకాశాలను అందిస్తోంది.

మరో ఫుట్‌వేర్ కేంద్రం

చెప్పుల తయారీలో ఆగ్రా ముందున్నప్పటికీ.. ఇతర నగరాలు కూడా ఈ పరిశ్రమలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరం లెదర్ పరిశ్రమకు ప్రసిద్ధి. తమిళనాడులోని చెన్నై, రాణిపేట్, అంబూర్ ప్రాంతాలు కూడా ఫుట్‌వేర్ తయారీకి ప్రసిద్ధి చెందాయి. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా కూడా ప్రముఖ తయారీ కేంద్రంగా ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories