Published : Aug 08, 2026, 11:25 AM ISTUpdated : Aug 08, 2026, 11:49 AM IST
సాంప్రదాయ వ్యవసాయంలోని సవాళ్లను అధిగమించడానికి తక్కువ సమయంలో, అతి తక్కువ ఖర్చుతో, ఎక్కువ లాభం తెచ్చిపెట్టే 5 ముఖ్యమైన పంటల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
Smart Farming : ఈ రోజుల్లో వ్యవసాయం చేయడం ఒక సవాల్‌గా మారింది. ఎరువులు, విత్తనాల ధరలు పెరగడం, వాతావరణ మార్పుల వల్ల సంప్రదాయ పంటలు పండించే రైతులు నష్టపోతున్నారు. కానీ తెలివిగా వ్యవసాయం చేసే రైతులకు ఎప్పుడూ ఓటమి ఉండదు.
తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో పండించి, మంచి ఆదాయం తెచ్చిపెట్టే కొన్ని పంటలు ఉన్నాయి… వీటిని పండించి రైతులు లాభాలు పొందవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి టాప్ 5 పంటలు ఏవి? వాటిని ఎలా పండించాలి? ఎక్కడ అమ్మవచ్చు? ఎంత లాభం వస్తుంది? అనే పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
26
కొత్తిమీర
ప్రతి ఇంటి వంటగదిలో కొత్తిమీరకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది… తెలుగువారి వంటల్లో దీన్ని మరింత ఎక్కువగా వాడుతుంటారు. వెజ్ అయినా, నాన్ వెెజ్ అయినా చివర్లో కొత్తిమీర వేయాల్సిందే. అయితే దీన్ని పండించడానికి ఎక్కువ స్థలం అవసరం లేదు, అంతర పంటగా కూడా పండించవచ్చు.
పంట కాలం : 30 నుంచి 45 రోజులు మాత్రమే. అంటే నెల రోజుల్లో పంట చేతికి వస్తుంది. దీన్ని అమ్ముకోవడం కూడా చాలా ఈజీ.. రోడ్డుపక్కన పెట్టుకుని రైతులే నేరుగా విక్రయించవచ్చు.
లాభం : హోటళ్లు, రెస్టారెంట్లు, స్థానిక మార్కెట్లకు నేరుగా సరఫరా చేసి వెంటనే డబ్బు సంపాదించవచ్చు.
36
మెంతికూర
ఆరోగ్యపరంగా మెంతికూర చాలా మంచిది… అందుకే మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. దీన్ని పండించేందుకు నీళ్లు కూడా చాలా తక్కువ అవసరం. పురుగుల బెడద కూడా తక్కువగానే ఉంటుంది… అంటే పెట్టుబడి తక్కువే అన్నమాట. లాభాలు మాత్రం బాగానే ఉంటాయి.
మార్కెట్ : ఆర్గానిక్ షాపులు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో దీనికి మంచి ధర లభిస్తుంది. సహజ వ్యవసాయం చేసేవారికి ఇది సరైన పంట. సాధారణంగా పండించినా వారాంతం సంతలు, కూరగాయల మార్కెట్ప్ లో అమ్ముకోవచ్చు.
మనం తులసి మొక్కను పూజలకు మాత్రమే వాడతాం… కానీ దీన్ని పండించి లాభాలు కూడా పొందవచ్చని చాలామందికి తెలియదు. హెర్బల్, ఆయుర్వేద ఉత్పత్తుల తయారీలో తులసిని విస్తృతంగా వాడతారు. ఈ మొక్కలు నాటిన 3-4 నెలల తర్వాత దిగుబడి మొదలవుతుంది. దీని నిర్వహణ ఖర్చు చాలా తక్కువ.
ఒప్పంద వ్యవసాయం : చాలా ఆయుర్వేద కంపెనీలు రైతులతో నేరుగా ఒప్పందం చేసుకుని తులసిని కొంటాయి. దీనివల్ల రైతులకు అమ్మకం గురించి చింత ఉండదు. మంచి లాభాలు తెచ్చిపెట్టే పంట ఇది.
56
బంతిపూల తోట
గుళ్లు, పెళ్లిళ్లు, పండగ రోజుల్లో బంతి పువ్వులకు భారీ డిమాండ్ ఉంటుంది. మరీముఖ్యంగా దీపావళి వంటి పండగల సమయంలో ఈ పూలను రోడ్ల పక్కన కుప్పలుగా పోసి అమ్మడం చూస్తుంటాం. కాబట్టి ఇలా పండగల సమయంలో బంతిపూలు చేతికి వచ్చేలా ప్లాన్ చేసుకుంటే సాధారణ రోజుల్్లో కంటే మరింత ఎక్కువ లాభాలు పొందవచ్చు.
లాభం : ప్రతి వారం బంతిపువ్వులు కోసి అమ్మడం ద్వారా నిరంతర ఆదాయం పొందవచ్చు. పండగల సమయంలో మరింత ఎక్కువ లాభాలుంటాయి.
సీజన్ : దసరా, దీపావళి, సంక్రాంతి సమయంలో ధరలు ఆకాశాన్నంటుతాయి. వెడ్డింగ్ ప్లానర్లు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలతో టచ్‌లో ఉంటే ఎక్కువ లాభం గ్యారెంటీ.
66
మిరప పంట
భారతదేశంలో మిరప అనేది ఒక ముఖ్యమైన వాణిజ్య పంట. ఇది దీర్ఘకాలంలో మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. ఇండియాలో పండే మిరపకు స్వదేశంలోనే కాదు విదేశీ మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. పచ్చి మిరపకాయ లేదా ఎండు మిరపకాయగా రెండు రూపాల్లోనూ అమ్మవచ్చు. చాలా మసాలా కంపెనీలు రైతుల నుంచి నేరుగా మిరప పంటను కొనుగోలు చేస్తాయి.
ఇలా మంచి లాభాలు తెచ్చిపెట్టే పంటలపై రైతులు ఫోకస్ పెట్టాలి. అయితే ఈ పంటలకు రోగాలు రాకముందే ముందుజాగ్రత్తలు తీసుకుంటే మందుల ఖర్చు ఆదా చేయవచ్చు. పంట వేయడానికి ముందే మార్కెట్లో డిమాండ్ తెలుసుకోండి. మధ్యవర్తులను తప్పించి, వినియోగదారులకు నేరుగా అమ్మడానికి ప్రయత్నించండి. ఇలా చిన్నచిన్న ట్రిక్స్ పాటిస్తే రైతులకు ఖర్చు తగ్గి లాభాలు పెరుగుుతాయి. తెలివిగా చేస్తే వ్యవసాయం దండగ కాదు పండగ అవుతుంది.