ఆంధ్రప్రదేశ్‌లో చేప ఆకారంలో ఉండే దీవి.. గోదావరి నది మధ్యలో ప్రకృతి సృష్టించిన గొప్ప వింత

Published : Oct 23, 2026, 10:15 AM IST

ఆంధ్రప్రదేశ్ లో అందమైన దీవి ఒకటుంది. నది మధ్యలో ఉండే దీవి చేప ఆకారంలో ఉంటుంది. ఈ దీవి పేరు పల్లం ఐలాండ్. సెలవుల్లో ఒకసారి ఈ దీవిని చూసేందుకు వెళ్లండి. ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.

PREV
13
గోదావరి నదిలో వింత దీవి

గోదావరి నది ఒడిలో దాగి ఉన్న అందాలలో పల్లం ఐలాండ్ ఒకటి. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని ఈ దీవి ప్రకృతి సృష్టించిన గొప్ప వింత ఇది. నది మధ్య ఏర్పడిన ఈ భూభాగం సహజసిద్ధంగా తీర్చిదిద్దిన శిల్పంలా కనిపిస్తుంది. నీలిరంగు గోదావరి పాయలు, చుట్టూ విస్తరించిన పచ్చని కొబ్బరి తోటలు ఈ ప్రాంతాన్ని భూతల స్వర్గంలా కనిపిస్తాయి. సాధారణంగా నేల మీద నుంచి చూస్తే పచ్చటి పల్లెటూరి వాతావరణం, పంట పొలాలు మాత్రమే కనిపిస్తాయి. ప్రశాంతమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి సందర్శకులకు కొత్త ఉత్సాహాన్నిస్తాయి. కోనసీమకే ప్రత్యేకమైన గ్రామీణ సౌందర్యం ఇక్కడ అడుగడుగునా కనిపిస్తూ పర్యాటకులను కట్టిపడేస్తుంది.

23
చేప ఆకారంలో ఉండే దీవి

ఈ దీవి ఎంతో ప్రత్యేకమైనది. డ్రోన్ కెమెరా లేదా ఆకాశ మార్గం ద్వారా చూసినప్పుడు మాత్రమే బయటపడుతుంది. పైనుంచి వీక్షించినప్పుడు ఈ ద్వీపం స్పష్టంగా ఒక పెద్ద చేప ఆకారంలో కనిపిస్తుంది. తల భాగం, తోక, మధ్యలోని శరీర నిర్మాణం అచ్చం నీటిలో ఈదుతున్న చేప రూపాన్ని పోలి ఉండటం ప్రకృతి చేసిన మాయాజాలం. మానవ ప్రమేయం ఏమీ లేకుండా సహజ నదీ ప్రవాహాల కోత, ఒండ్రు మట్టి మేటల వల్ల ఈ ఆకారం ఏర్పడింది. శాటిలైట్ మ్యాపులు, ఏరియల్ దృశ్యాల్లో ఈ చేప రూపాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. అందుకే ప్రకృతి ప్రేమికులు దీనిని ఒక సహజ కళాఖండంగా వర్ణిస్తుంటారు.

33
ఆంధ్రా కేరళ అని పిలుస్తారు

కేరళ బ్యాక్‌వాటర్స్ తరహా అనుభూతిని అందించడం వల్ల సమీపంలోని పోర ఐలాండ్‌తో కలిపి దీనిని అందరూ ముద్దుగా ఆంధ్రా కేరళ అని పిలుస్తారు. పడవ ప్రయాణం చేస్తూ నదీ తీరాలను దర్శించడం ఇక్కడికి వచ్చే వారికి గొప్ప అనుభవాన్ని ఇస్తుంది. స్వచ్ఛమైన గోదావరి నీటి అలలు, పిల్లగాలుల స్పర్శ మనసుకు ఎంతో ప్రశాంతతను చేకూరుస్తాయి. ఫోటోగ్రఫీ, పర్యావరణ పర్యటనలకు ఈ ప్రదేశం చక్కటి వేదికగా మారింది. సామాజిక మాధ్యమాల్లో ఈ వింత ద్వీపం దృశ్యాలు విస్తృతంగా ప్రచారంలోకి రావడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా సందర్శకులు ఇక్కడికి తరలివస్తున్నారు. గోదావరి జిల్లాల పర్యాటక రంగంలో ఈ చేప ఆకారపు దీవి ప్రత్యేక ఆకర్షణగా వెలుగొందుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories