ప్రపంచంలో మొబైల్ ఫోన్‌ల గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
* ప్రస్తుతం ప్రపంచంలో మనుషుల కంటే మొబైల్ ఫోన్‌ల సంఖ్య ఎక్కువగా ఉంది.
* ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫోన్ ఫాల్కన్ సూపర్‌నోవా పింక్ డైమండ్ ఐఫోన్ 6. దీని ధర సుమారు 95.5 మిలియన్ డాలర్లు.
* పరిశోధనల ప్రకారం మొబైల్ ఫోన్ స్క్రీన్‌పై టాయిలెట్ ఫ్లష్ కంటే 20–30 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటాయి.
* బ్లూటూత్ అనే పేరు 10వ శతాబ్దానికి చెందిన డెన్మార్క్ రాజు హరాల్డ్ బ్లూటూత్ పేరునుంచి వచ్చింది.
* ఫిన్‌లాండ్‌లో మొబైల్ ఫోన్ విసిరే పోటీ కూడా నిర్వహిస్తారు.
* 2013లో గూగుల్ నెక్సస్ ఫోన్‌ను అంతరిక్షంలోకి పంపి ప్రయోగం కూడా చేశారు.