USA: కారు దిగకుండానే డబ్బులు డ్రా చేసుకోవచ్చు.. అమెరికాలో డ్రైవ్ త్రూ ATM గురించి మీకు తెలుసా?

Published : Aug 25, 2026, 01:39 PM IST

USA: ఒకప్పుడు బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేయాలంటే పెద్ద ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు ఫోన్‌లోనే అన్నీ అయిపోతున్నాయి. మరి రోడ్డు మీదనే మీకు డబ్బుల బాక్సులు కనిపిస్తే..? కారు దిగకుండానే డబ్బులు డ్రా చేసుకునే పద్ధతి మీకు తెలుసా?

PREV
14
కారులోంచి బయటకు దిగకుండానే బ్యాంకింగ్ సేవలు..

సాంకేతికత, సౌకర్యం జతకలిస్తే మానవ జీవితం ఎంత సులభతరమవుతుందో చెప్పడానికి అమెరికాలోని బ్యాంకింగ్ వ్యవస్థ ఒక గొప్ప నిదర్శనం. నిత్య జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందులను తొలగిస్తూ, వినియోగదారుల సమయాన్ని ఆదా చేయడంలో పాశ్చాత్య దేశాలు ఎప్పుడూ ముందుంటాయి. ఈ క్రమంలోనే వెలుగులోకి వచ్చిందే 'డ్రైవ్-త్రూ ATM' (Drive-Through ATM) విధానం. సాధారణంగా మనం షాపింగ్ మాల్స్‌లోనో లేక రెస్టారెంట్లలోనో డ్రైవ్-త్రూ సేవలను చూస్తుంటాం. కానీ కారులోంచి బయటకు దిగకుండానే బ్యాంకింగ్ లావాదేవీలు పూర్తి చేసే ఈ పద్ధతి అక్కడి ప్రజల జీవితాల్లో ఒక భాగమైపోయింది.

24
డ్రైవ్ త్రూ ATM ఎలా పనిచేస్తుంది?

డ్రైవ్ త్రూ ఏటీఎంలు ప్రత్యేకంగా వాహనదారుల సౌకర్యార్థం డిజైన్ చేయబడతాయి. ఒక లేన్ గుండా కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి, నేరుగా ఏటీఎం మిషన్ పక్కన ఆపవచ్చు. కారు విండో (అద్దం) కిందకు దించి, సీట్లో కూర్చునే లావాదేవీలన్నీ పూర్తి చేయవచ్చు. సాధారణ ఏటీఎంలాగే డెబిట్/క్రెడిట్ కార్డును మిషన్‌లో ఉంచి, పిన్ నంబర్ నమోదు చేసి కావాల్సిన నగదును డ్రా (Cash Withdrawal) చేయవచ్చు. అంతేకాదు, కేవలం డబ్బులు తీసుకోవడమే కాకుండా, మన ఖాతాలో డబ్బులు వేయడం, చెక్కులను డిపాజిట్ (Cash & Check Deposit) చేయడం కూడా కారు దిగకుండానే చేసేయవచ్చు. మిషన్ లోపల నోట్లను లేదా చెక్కును ఉంచితే, అది వెంటనే స్కాన్ చేసి ఖాతాలో జమ చేస్తుంది.

34
ఈ విధానం వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు

సమయం ఆదా

బ్యాంకులు, ఏటీఎంలకు వెళ్లి అక్కడ క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. పార్కింగ్ స్థలం కోసం వెతకాల్సిన పనిలేదు. కారు నిలిపి, కిందకు దిగి, లైనులో నిలబడే అవసరం ఉండదు కాబట్టి సమయం చాలా ఆదా అవుతుంది.

వాతావరణ నుంచి రక్షణ

అమెరికాలో తీవ్రమైన చలి, మంచు వర్షం (Snowfall) తో పాటు భారీ వర్షాలు పడే సమయాల్లో కారులోంచి బయటకు రావడం కష్టంతో కూడుకున్న పని. ఇలాంటి సమయాల్లో ఈ డ్రైవ్-త్రూ ఏటీఎంలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

భద్రత - సౌకర్యం

రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు వాహనం దిగి ఏటీఎం వద్దకు వెళ్లడం కంటే, లాక్ చేసిన కారులోనే కూర్చుని లావాదేవీలు నిర్వహించడం ఎంతో సురక్షితం.

వికలాంగులు - వృద్ధులకు ప్రయోజనం

మరీ ముఖ్యంగా దివ్యాంగులకు, వయసు పైబడి నడవలేని వారికి, పసిపిల్లలతో ప్రయాణించే తల్లిదండ్రులకు ఇది ఒక వరం అని చెప్పవచ్చు. ఇలాంటి వారు ఎటువంటి భయం లేకుండా కారులో ఉండే డబ్బులు డ్రా చేసుకోండం, క్రెడిట్ చేసుకోవడం లాంటివి చేసుకోవచ్చు.

44
ఇండియాలో ఇది సాధ్యమేనా..?

ఆధునిక జీవనశైలిలో సమయానికి ఉన్నఇంపార్టెన్స్ ను గుర్తించి రూపుదిద్దుకున్న ఈ డ్రైవ్-త్రూ బ్యాంకింగ్ విధానం వినియోగదారులకు ఎంతో ఉపయోగకరం. డిజిటల్ యుగంలో బ్యాంకింగ్ రంగానికి ఇటువంటి వినూత్న ఆలోచనలు మరింత ఊతాన్ని ఇస్తున్నాయి. భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా రాబోయే రోజుల్లో ఇటువంటి డ్రైవ్-త్రూ సేవల వినియోగం పెరిగితే, ప్రజలకు మరిన్ని సులభతర బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయి. మరి మన దగ్గర ఇది సాధ్యమేనా..?

Read more Photos on
click me!

Recommended Stories