Car Colour: కారు కొనాలనుకుంటున్నారా? అయితే ఏ రంగు పడితే ఆ రంగు తీసుకోకూడదు. కొన్ని రంగుల కార్లకు యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఏ రంగు కారు కొనకూడదో తెలుసుకోండి.
కారు కొనేటప్పుడు చాలామంది ఆ కారు మైలేజ్, ధర, ఫీచర్లు మాత్రమే చూస్తారు. కారు రంగుకు పెద్ద ప్రాధాన్యం ఇవ్వరు. కానీ రంగు కూడా మన భద్రతపై ప్రభావం చూపుతుంది. మీరు ఏ రంగు కారు తీసుకున్న ఫర్వాలేదు కానీ నల్ల రంగు కార్లతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈ నల్లరంగు కార్లకు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని కొన్ని పరిశోధనలు తేల్చాయి.
24
నల్ల కార్లు ఎందుకు అంత ప్రమాదకరం?
నలుపు రంగు కాంతిని గ్రహిస్తుంది. అందుకే రాత్రి, వర్షం, పొగమంచు వంటి సమయాల్లో నల్ల కార్లు సరిగ్గా కనిపించవు. రోడ్డు, చెట్ల నీడలతో కలిసిపోయి డ్రైవర్లకు దూరాన్ని, వేగాన్ని అంచనా వేయడం కష్టమవుతుంది. కొన్ని అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం నల్ల కార్లకు ప్రమాదం జరిగే రిస్క్ 10 నుంచి 20 శాతం ఎక్కువ.
34
ఈ రంగు కార్లు కొంటే మంచిది
తెలుపు, సిల్వర్, పసుపు, లేత గ్రే రంగు కార్లను కొనుక్కోవడం సురక్షితం. ఎందుకంటే ఈ రంగులు పగలు, రాత్రి తేడా లేకుండా సులభంగా కనిపిస్తాయి. మరో సమస్య ఏంటంటే, నలుపు రంగు వేడిని ఎక్కువగా గ్రహిస్తుంది. దీనివల్ల కారు లోపల ఉష్ణోగ్రత పెరిగి, ఏసీ వాడకం ఎక్కువై ఇంధనం కూడా కొంచెం ఎక్కువ ఖర్చవుతుంది.
కేవలం కారు రంగు మాత్రమే యాక్సిడెం్టలకు కారణమని చెప్పలేము. అతివేగం, డ్రైవింగ్‌లో మొబైల్ వాడకం, తాగి నడపడం, వాతావరణం సరిగా లేకపోవడం వంటివే ప్రమాదాలకు ముఖ్య కారణాలని వారు చెబుతున్నారు. నల్ల కారు ఉన్నవాళ్లు రాత్రిపూట హెడ్‌లైట్లు, టెయిల్‌లైట్లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూసుకోవాలి. అలాగే, ఇతర వాహనాలకు, మీకు మధ్య సురక్షితమైన దూరం పాటిస్తూ నడపడం చాలా ముఖ్యం.