Human Brain: మనిషి శరీరంలో మెదడు ఎంతో ముఖ్యమైనది. మెదడు చెప్పినట్టే శరీరం వింటుంది. మెదడు నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటుంది. ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉంటుంది. మెదడు గురించి కొన్ని షాకింగ్ విషయాలను ఇక్కడ ఇచ్చాము.
మానవ శరీరంలోని మెదడు అత్యంత ముఖ్యమైనది. అదే సమయంలో అత్యంత శక్తివంతమైనది మెదడు. మనం మాట్లాడటం, ఆలోచించడం, గుర్తుంచుకోవడం, కలలు కనడం.. ఇలా అన్నీ ఈ బ్రెయిన్ కంట్రోల్‌లోనే ఉంటాయి. దీని గురించి చాలామందికి తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. మెదడు గురించి తెలిస్తే ఎవరికైరా వారెవ్వా అనాలినిపిస్తుంది.
24
ఒక్కరోజులో ఎన్నో ఆలోచనలు
ఒకరోజులో మీ మెదడు ఎన్ని ఆలోచనలు చేస్తుందో తెలుసా? అధ్యయనాల ప్రకారం, మనిషి మెదడు ప్రతిరోజూ వేలాది ఆలోచనలను సృష్టిస్తుంది. మనకు తెలియకుండానే బ్రెయిన్ ఎంతో సమాచారాన్ని ప్రాసెస్ చేస్తూనే ఉంటుంది. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మెదడు ఎప్పుడూ పూర్తిగా విశ్రాంతి తీసుకోదు.
చాలామంది నిద్రపోతున్నప్పుడు మెదడు కూడా రెస్ట్ తీసుకుంటుందని అనుకుంటారు. కానీ నిజానికి, నిద్రలోనే మెదడు చాలా ముఖ్యమైన పనులు చేస్తుంది. రోజంతా సేకరించిన సమాచారాన్ని క్రమబద్ధీకరించి మెమరీలో సేవ్ చేయడం, అనవసరమైన సమాచారాన్ని తొలగించడం, మరుసటి రోజుకు శరీరాన్ని సిద్ధం చేయడం వంటి పనులన్నీ ఆ సమయంలోనే జరుగుతాయి.
34
మెదడుకు నొప్పి తెలియదు!
శరీరంలోని అన్ని భాగాలకు నొప్పి సంకేతాలను పంపే మెదడుకే నొప్పిని గ్రహించే నరాలు (receptors) ఉండవు. అందుకే కొన్ని ప్రత్యేకమైన బ్రెయిన్ సర్జరీలు రోగి మెలకువగా ఉన్నప్పుడే చేస్తారు. మెదడులోని బిలియన్ల కొద్దీ నరాల కణాలు నిరంతరం సమాచారాన్ని మార్పిడి చేసుకుంటాయి. ఈ ప్రక్రియలో చిన్న మొత్తంలో విద్యుత్ తరంగాలు పుడతాయి. అందుకే EEG వంటి పరికరాలతో మెదడు పనితీరును రికార్డ్ చేయగలుగుతారు.
ప్రస్తుత ప్రపంచంలోని అత్యాధునిక కంప్యూటర్లు కూడా ఇంకా మనిషి మెదడుకున్న పూర్తి సామర్థ్యాన్ని అందుకోలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్ఞాపకశక్తి, నేర్చుకునే నైపుణ్యం, సమస్యలను పరిష్కరించే తీరు, భావోద్వేగాలను అర్థం చేసుకునే సామర్థ్యం వంటి అనేక విషయాల్లో మనిషి మెదడు ఇప్పటికీ ప్రత్యేకమైనదే. మనం మనస్ఫూర్తిగా నవ్వినప్పుడు, మెదడులోని చాలా భాగాలు ఒకేసారి పనిచేస్తాయి. దీనివల్ల ఒత్తిడి తగ్గి, ఆనందాన్ని కలిగించే హార్మోన్లు పెరుగుతాయి. అందుకే వైద్యులు కూడా ప్రతిరోజూ నవ్వాలని సూచిస్తుంటారు.