Dogs Behavior: కుక్కలు నిజంగా మనుషుల ఫీలింగ్స్‌ని అర్థం చేసుకుంటాయా? సైన్స్ ఏం చెబుతోంది?

Published : Oct 13, 2026, 11:45 AM IST

Dogs Behavior: చాలామంది వాళ్లు పెంచుకునే కుక్కులను విపరీతంగా ప్రేమిస్తుంటారు. అవి కూడా వారిని అంతే ఇష్టపడతాయని, వారి ఫీలింగ్స్ ని అర్థం చేసుకుంటాయి అని చెబుతుంటారు. కానీ నిజంగా కుక్కలు, మనుషుల ఫీలింగ్స్ ని అర్థం చేసుకుంటాయా? సైన్స్ ఏం చెబుతోంది?

PREV
16
కుక్కల ప్రవర్తన గురించి ఆసక్తికరమైన విషయాలు

సాధారణంగా మనం పెంచుకునే కుక్కలు మనం బాధగా ఉన్నప్పుడు మౌనంగా వచ్చి పక్కన కూర్చోవడం, సంతోషంగా ఉన్నప్పుడు అవి కూడా ఉత్సాహంగా గంతులు వేయడం, కోపంగా ఉన్నప్పుడు కాస్త దూరంగా వెళ్లడం మనం చూసే ఉంటాం. అయితే కుక్కలు మన మాటలను మాత్రమే కాదు, మన ముఖ కవళికలు, స్వరం, శరీర భాషలో వచ్చే చిన్న చిన్న మార్పులను కూడా గమనించగలవని పరిశోధనలు చెబుతున్నాయి. మరి కుక్కలు నిజంగానే మన భావాలను అర్థం చేసుకుంటాయా? మనం బాధలో ఉన్నప్పుడు వాటికి ఎలా తెలుస్తుంది? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన సైన్స్ ఏంటో తెలుసుకుందాం.

26
కుక్కలు మనుషుల ఫీలింగ్స్ ని అర్థం చేసుకుంటాయా?

పరిశోధనల ప్రకారం.. కుక్కలకు మనుషుల భావోద్వేగాలను గుర్తించే సామర్థ్యం ఏర్పడటానికి వాటికి మనుషులతో ఉన్న దీర్ఘకాల అనుబంధం ముఖ్యమైన కారణం. వేల సంవత్సరాలుగా మనుషులతో కలిసి జీవిస్తూ వచ్చిన కుక్కలు, మనుషుల ప్రవర్తనలోని చిన్న చిన్న సంకేతాలను గమనించడం నేర్చుకున్నాయి. మనం సంతోషంగా ఉన్నప్పుడు గొంతులో ఉత్సాహం కనిపించవచ్చు, ముఖంలో చిరునవ్వు ఉంటుంది, శరీర భాష కూడా రిలాక్స్‌గా ఉంటుంది. అదే కోపంగా లేదా బాధగా ఉన్నప్పుడు మన గొంతు, ముఖ కవళికలు, కదలికలు మారిపోతాయి. ఈ మార్పులను కుక్కలు గుర్తించి మన ప్రవర్తనను అంచనా వేసే అవకాశం ఉంటుంది.

36
ఇవే వాటికి సంకేతం

మనిషి స్వరం కూడా కుక్కలకు చాలా ముఖ్యమైన సంకేతం. మనం ఏ పదాలు మాట్లాడుతున్నామన్నదే కాకుండా, వాటిని ఎలా మాట్లాడుతున్నామో కూడా కుక్కలు గమనిస్తాయి. ప్రేమగా, మృదువుగా మాట్లాడితే అవి సానుకూలంగా స్పందించవచ్చు. గట్టిగా లేదా కోపంగా మాట్లాడితే వెనక్కి తగ్గడం, చెవులను వెనక్కి పెట్టడం, తోకను కిందకు ఉంచడం లేదా అక్కడి నుంచి దూరంగా వెళ్లడం వంటివి చేయవచ్చు.

ముఖ కవళికలను కూడా కుక్కలు గమనిస్తాయి. మన ముఖాన్ని చూసి మనం సంతోషంగా ఉన్నామా, ఆందోళనగా ఉన్నామా అనే విషయాన్ని కొంతవరకు అంచనా వేయగలవని పరిశోధనలు సూచిస్తున్నాయి. మనిషి ముఖంలో మార్పులు వచ్చినప్పుడు కుక్క తన చూపు, శరీర భాష లేదా దగ్గరకు వచ్చే విధానాన్ని మార్చుకోవచ్చు.

46
వాసన కూడా సంకేతమే..

మనం భయపడినప్పుడు లేదా ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో కొన్ని జీవరసాయన మార్పులు జరుగుతాయి. వాటి వల్ల శరీర వాసనలో కూడా మార్పులు రావచ్చు. కుక్కల ముక్కు మనుషుల కంటే ఎంతో సున్నితంగా ఉండటం వల్ల ఇలాంటి మార్పులను అవి గుర్తించే అవకాశం ఉంది. అందుకే మనం టెన్షన్‌లో ఉన్నప్పుడు లేదా భయపడుతున్నప్పుడు కుక్క మన ప్రవర్తనలో మార్పులతో పాటు వాసనకు సంబంధించిన సంకేతాలను కూడా గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

56
బాడీ లాంగ్వేజ్

మనిషి ఏడుస్తున్నప్పుడు అతని గొంతు, ముఖ కవళికలు, బాడీ లాంగ్వేజ్ సాధారణంగా ఉండవు. కుక్క ఆ మార్పులను గమనించి దగ్గరకు రావచ్చు. అంతేకాదు, గత అనుభవం కూడా దీనికి కారణం కావచ్చు. యజమాని బాధగా ఉన్నప్పుడు దగ్గరకు వస్తే అతనికి ప్రేమ, శ్రద్ధ లభించిందని కుక్క నేర్చుకుని ఉండవచ్చు. మరోసారి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అదే ప్రవర్తనను మళ్లీ చూపించే అవకాశం ఉంటుంది.

66
మనుషుల ఫీలింగ్స్ కి అనుగుణంగా స్పందించడం

కుక్కలు మనుషుల ఆనందాన్ని కూడా గుర్తించగలవు. యజమాని ఉత్సాహంగా మాట్లాడటం, నవ్వడం, ఆడుకోవడం లేదా బయటకు వెళ్లడానికి సిద్ధం కావడం వంటి సంకేతాలను చూసి కుక్క కూడా ఉత్సాహంగా మారవచ్చు. కొన్నిసార్లు యజమాని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కుక్క చూపించే ఆనందం దీనికి మంచి ఉదాహరణ. మన గొంతు, బాడీ లాంగ్వేజ్, కదలికల ద్వారా మన ఫీలింగ్స్ ని గుర్తించి దానికి అనుగుణంగా స్పందించడం కుక్కల సామాజిక తెలివితేటల్లో ఒక భాగంగా చూడవచ్చు.

అయితే ప్రతి కుక్క ఒకే విధంగా స్పందించదు. కుక్క జాతి, వయసు, వ్యక్తిత్వం, మనుషులతో పెరిగిన విధానం, గత అనుభవాలు వంటి అంశాలు దాని ప్రవర్తనపై ప్రభావం చూపుతాయి. కొన్ని కుక్కలు మనుషుల భావోద్వేగ మార్పులకు చాలా సున్నితంగా స్పందిస్తే, మరికొన్ని అంతగా పట్టించుకోకపోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories