బ్యాంకింగ్ రంగంలో తీసుకున్న కీలక నిర్ణయాలతో ఓ నాలుగు ఇండియన్ బ్యాంకులు హాట్ టాపిక్గా మారాయి.. ప్రజలు ఎక్కువగా వెతకడంతో నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఇంతకీ ఈ బ్యాంకులు వార్తల్లో ఎందుకు నిలిచాయో తెలుసా?
బ్యాంకింగ్ సెక్టార్లో జరుగుతున్న కీలక మార్పులు, నిర్ణయాల వల్ల ఓ నాలుగు బ్యాంకులు వార్తల్లో నిలిచాయి. అక్టోబర్ నెలలో కొత్త సీఈఓ నియామకం, సుప్రీంకోర్టు తీర్పు, వేల కోట్ల రూపాయల ఒప్పందాల వంటివాటితో ఈ బ్యాంకులు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఆ నాలుగు బ్యాంకులు ఏవి? ఎందుకు ట్రెండ్ అవుతున్నాయి? ఇప్పుడు చూద్దాం.
భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో హెచ్డీఎఫ్సీ (HDFC Bank) ఒకటి. ఇక యెస్ బ్యాంక్ (Yes Bank), ఐడీబీఐ బ్యాంక్ (IDBI Bank), యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ బ్యాంకులు ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయాలతో ట్రెండింగ్లోకి వచ్చాయి. దేశ ప్రజలు వీటి గురించే సెర్చ్ ఇంజన్ గూగుల్లో ఎక్కువగా వెతుకుతున్నారు.
25
యెస్ బ్యాంక్ : ₹8,125 కోట్ల బాండ్ల రద్దు
యెస్ బ్యాంక్ ఏటీ-1 (AT-1) బాండ్ల వ్యవహారం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ₹8,125 కోట్ల విలువైన బాండ్లను రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నిర్ణయంతో బ్యాంక్ షేర్లు దాదాపు 15% పడిపోయాయి. బ్యాంక్ ఇప్పుడు తదుపరి న్యాయపోరాటంపై దృష్టి పెట్టింది.
35
యాక్సిస్ బ్యాంక్ డైరెక్టర్ నియామకం
యాక్సిస్ బ్యాంక్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా అనంత్ నారాయణన్ నియమితులయ్యారు. ఆయన పదవీకాలం అక్టోబర్ 19, 2026న మొదలై అక్టోబర్ 18, 2030తో ముగుస్తుంది. మరోవైపు యాక్సిస్ బ్యాంక్ జూలై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల కోసం ఇన్వెస్టర్లు గూగుల్లో తెగ వెతుకుతున్నారు.
కొత్త సీఈఓ నియామకంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వార్తల్లో నిలిచింది. అక్టోబర్ 27, 2026 నుంచి బ్యాంక్ ఎండీ, సీఈఓగా అనూప్ బాగ్చీ బాధ్యతలు తీసుకోనున్నారు. ఆయన ప్రస్తుతం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈఓగా ఉన్నారు.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బాగ్చీకి ఏడాదికి ₹35.9 కోట్ల వేతన ప్యాకేజీని ఆఫర్ చేసింది. ఇందులో ₹89.7 మిలియన్ల ఫిక్స్డ్ పే, ₹269.2 మిలియన్ల వేరియబుల్ పే ఉన్నాయి. ఈ ప్యాకేజీకి వాటాదారుల ఆమోదం కావాలి. నాయకత్వ మార్పుతో బ్యాంక్ భవిష్యత్తు వ్యూహాలను ఇన్వెస్టర్లు ఆసక్తిగా గమనిస్తున్నారు.
55
ఐడీబీఐ బ్యాంక్ వాటాల విక్రయానికి గ్రీన్ సిగ్నల్
ఐడీబీఐ బ్యాంక్ వాటాల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం కీలక పరిణామం. కెనడాకు చెందిన ఫెయిర్ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్కు 60.72% వాటాను అమ్మేందుకు అక్టోబర్ 14న క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ డీల్ విలువ సుమారు ₹52,878 కోట్లు. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 30.48% వాటా, ఎల్ఐసీకి చెందిన 30.24% వాటా ఉన్నాయి.