Whistling Snake: బాబోయ్.. ఈల వేసే పాములు.. భారత్‌లోనూ తిరుగుతున్న ఆ భయంకరమైన పాము ఏదో తెలుసా?

Published : Nov 02, 2026, 12:40 PM IST

Whistling Snake: ఈల వేసే పాముల గురించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. అసలు ఈల వేసే పాములు నిజంగా ఉంటాయా, అవి ఎలాంటి శబ్దాలు చేస్తాయి, ఎంత ప్రమాదకరమో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
Whistling Snakes: ఈల వేసే పామును ఎప్పుడైనా చూశారా?

ప్రపంచంలో ఈల వేసే పాములు ఉన్నాయా అనే సందేహం చాలామందికి ఉంటుంది. సైంటిఫిక్‌గా చూస్తే "విజిలింగ్ స్నేక్" అనే పేరుతో ఒకే ఒక ప్రత్యేకమైన పాము జాతి ఏమీ లేదు. అయితే కొన్ని రకాల పాములు బెదిరింపునకు గురైనప్పుడు లేదా భయపడినప్పుడు ఈల లాంటి శబ్దాన్ని చేస్తాయి.

ఇవి మనుషుల్లా పెదవులు లేదా వాయిస్ కార్డ్స్ ఉపయోగించి సౌండ్ చేయవు. పాములు తమ తోక దగ్గర ఉండే క్లోయెకా అనే ద్వారం ద్వారా వేగంగా గాలిని బయటకు వదలడం వల్ల 'క్లోయెకల్ పాప్' అనే ఈల లాంటి చిన్న శబ్దం వస్తుంది. మరికొన్ని పాములు తమ ముక్కురంధ్రాల ద్వారా గాలిని బలంగా బయటకు పంపడం ద్వారా విజిలింగ్ సౌండ్ చేస్తాయి.

25
ఎక్కడ కనిపిస్తాయి? ఐర్లాండ్ కథ నిజమేనా?

ఈల వేసే పాములకు అంటూ ప్రత్యేకమైన ఒకే ప్రాంతం ఉండదు. పెట్‌గా పెంచుకునే కార్న్ స్నేక్స్, బాల్ పైథాన్స్ తో పాటు కొన్ని రకాల వైపర్ పాములు ఈ తరహా సౌండ్స్ చేస్తాయి. మన ఆసియా ఖండంలో భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ దేశాల్లో కనిపించే రస్సెల్స్ వైపర్ (రక్తపింజర) ఈల లాంటి బుసలు కొడుతుంది.

అలాగే ఐర్లాండ్‌లోని క్లేర్ ఐలాండ్‌లో ఒక "విజిలింగ్ సెర్పెంట్" ఉందంటూ గతంలో ఒక వార్త వైరల్ అయ్యింది. అయితే అది కేవలం ఒక కల్పిత కథ మాత్రమేనని, ఐర్లాండ్‌లో అటువంటి పాములు ఏవీ లేవని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

35
పాముల విచిత్ర లక్షణాలు

పాముల్లో ఉండే కొన్ని ప్రత్యేక లక్షణాలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. సాధారణంగా ఇవి తమకు ప్రమాదం పొంచి ఉందని అనిపించినప్పుడు అవతలి వారిని భయపెట్టడానికి ఈల లాంటి శబ్దాన్ని రక్షణ కవచంగా వాడతాయి. పెంపుడు పాములు శ్వాస తీసుకునేటప్పుడు విజిలింగ్ సౌండ్ వస్తే వాటి ముక్కు వద్ద చర్మం సరిగ్గా ఊడకపోవడం లేదా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ ఉండటమే కారణం కావచ్చు.

మన దేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా అనేక ప్రాంతాల్లో కనిపించే కామన్ క్రైట్ కూడా కొన్నిసార్లు ఈల లాంటి శబ్దాన్ని చేస్తుంది. ఇది నలుపు, స్టీల్ బ్లూ రంగులో శరీరంపై సన్నటి తెల్లటి చారలతో ఉంటుంది. దాదాపు 3 నుంచి 4 అడుగుల పొడవు పెరిగే ఈ పాము రాత్రివేళల్లో మాత్రమే ఎక్కువగా తిరుగుతుంది. ఇళ్లలోకి, చీకటి మూలల్లోకి, కట్టెల పొయ్యిలు లేదా రాళ్ల మధ్యలోకి ప్రవేశించే స్వభావం దీనికి ఉంది.

45
ఇవి ఎంత ప్రమాదకరం? ప్రాణాలకు ముప్పు ఉందా?

ఈల వేసే పాము ఎంత ప్రమాదకరం అనేది దాని జాతిపై ఆధారపడి ఉంటుంది. పెంపుడు పాములైన కార్న్ స్నేక్స్, బాల్ పైథాన్స్ విషపూరితమైనవి కావు. కాబట్టి వాటి వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ మనదేశంలో కనిపించే కటువు పాము, రస్సెల్స్ వైపర్ అత్యంత ప్రమాదకరమైనవి.

కటువు పాము నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే న్యూరోటాక్సిన్ విషాన్ని కలిగి ఉంటుంది. దీని కాటు వల్ల కండరాల బలహీనత, మింగడంలో ఇబ్బంది, శ్వాస తిరోగమనం ఏర్పడి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. దీని కాటు వల్ల నొప్పి లేదా వాపు ఎక్కువగా ఉండకపోవడం వల్ల నిద్రలోనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.

ఇక రస్సెల్స్ వైపర్ భారత్‌లో ఎక్కువ పాముకాటు మరణాలకు కారణమయ్యే బిగ్ ఫోర్ పాములలో ఒకటి. ఇది తనకు ప్రమాదం పొంచివుందనే పరిస్థితుల్లో చాలా బిగ్గరగా ఈల లాంటి శబ్దంతో బుసలు కొడుతుంది.

55
పాము శబ్దం వింటే ఏం చేయాలి? జాగ్రత్తలు ఇవే

మీ పరిసరాల్లో పాము ఈల వేస్తున్నట్లు లేదా గట్టిగా బుస కొడుతున్నట్లు శబ్దం వినిపిస్తే దాని దగ్గరకు అస్సలు వెళ్లకూడదు. ఆ శబ్దం అది మిమ్మల్ని దూరంగా జరగమని ఇస్తున్న హెచ్చరిక సంకేతం.

• శబ్దం వినగానే నెమ్మదిగా వెనక్కి తగ్గి, పాము అక్కడి నుంచి వెళ్లిపోవడానికి దారి ఇవ్వాలి.

• శబ్దాన్ని బట్టి అది ఏ పామో గుర్తుపట్టడానికి ప్రయత్నించవద్దు. పామును పట్టుకోవడానికి లేదా చంపడానికి ప్రయత్నించడం చాలా ప్రమాదకరం.

• ఒకవేళ పాము కాటు వేస్తే బాధితుడిని అటూ ఇటూ కదల్చకుండా ప్రశాంతంగా ఉంచాలి.

• కాటు వేసిన చోట కోయడం, విషాన్ని నోటితో పీల్చడం, గట్టిగా కట్టు కట్టడం వంటి పనులు చేయకూడదు. వెంటనే అత్యవసర వైద్య సహాయం కోసం ఆసుపత్రికి తరలించాలి.

Read more Photos on
click me!

Recommended Stories