India’s Floating Post Office: నీటిపై తేలియాడే ఏకైక పోస్ట్ ఆఫీస్.. ఎక్కడుందో తెలుసా?

Published : Sep 25, 2026, 04:23 PM IST

India’s Floating Post Office: నీటిపై ఉండే పోస్టాఫీస్ గురించి ఎప్పుడైనా విన్నారా? అసలు సాధ్యమవుతుందా? సాధారణంగా పోస్టాఫీస్ అంటే ఓ భవనంలా ఉంటుంది. కానీ ఇండియాలో నీటిపై తేలియాడే పోస్టాఫీస్ ఉందంట..ఇంతకీ అదెక్కడో తెలుసా? దాని ప్రత్యేకతలేంటో ఇక్కడ చూద్దాం.

PREV
14
నీటిపై తేలియాడే ఏకైక పోస్ట్ ఆఫీస్

ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందిన కాశ్మీర్ లోని శ్రీ నగర్ లో ఈ ప్రత్యేకమైన పోస్టాఫీస్ సందర్శకులను ఆకట్టుకుంటోంది. దాల్ లేక్ పై ఈ ఫ్లోటింగ్ పోస్టాఫీస్ ఉంది. దాల్ లేక్.. కశ్మీర్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. సరస్సులో హౌస్ బూట్లు, తేలియాడే తోటలు, పడవలతో పాటు ఈ తేలియాడే పోస్టాఫీస్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది.

ఇది కేవలం పోస్టల్ సేవలకు మాత్రమే పరిమితం కాదు. ఈ ఫ్లోటింగ్ పోస్టాఫీస్ లో ఫిలాటెలీ మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు.అంటే పోస్టల్ స్టాంపులు, వాటికి సంబంధించిన విశేషాలను తెలుసుకునే అవకాశం కూడా సందర్శకులకు ఉంటుంది.

24
ఎప్పటి నుంచి ఉంది?

దాల్ లేక్ పై ఉన్న ఈ ప్రత్యేకమైన పోస్టాఫీస్ 2011లో ప్రారంభమైంది. నీటిపై ఏర్పాటు చేసిన పోస్టాఫీస్ కావడంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. భారత తపాలా శాఖ తన వార్షిక రిపోర్టులో కూడా 'Floting Post Office on Srinagar's Dal Lake'గా దీనిని ప్రస్తావించింది.

34
ఇక్కడి నుంచి పోస్టు పంపొచ్చా?

దాల్ లేక్ సందర్శించే పర్యాటకులు ఈ ఫ్లోటింగ్ పోస్టాఫీస్ నుంచి పోస్టు కార్డులను పంపించే అనుభూతిని కూడా పొందవచ్చు. అధికారిక పర్యాటక సమాచారం ప్రకారం ఘాట్ నంబర్ 1 వద్ద పోస్టు కార్డు తీసుకుని ఈ ఫ్లోటింగ్ పోస్టాఫీస్ లో పోస్టల్ స్టాంప్ వేయించుకోవచ్చు. అందుకే కాశ్మీర్ వెళ్లిన పర్యాటకులు ఈ ఫ్లోటింగ్ పోస్టాఫీస్ చూసి మురిసిపోతున్నారు. పోస్టు కార్డు పంపుతూ అనుభూతి పొందుతున్నారు.

44
పోస్టాఫీస్ మాత్రమే కాదు

దాల్ లేక్ ప్రత్యేకత ఇదే కాదు.. ఈ సరస్సు సుమారు 18 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. హౌస్ బూట్లు, తేలియాడే తోటలు, నీటిపై జరిగే కార్యకలాపాలు దీనికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. అందుకే శ్రీనగర్ వెళ్లినప్పుడు దాల్ లేక్ లో షికారా ప్రయాణం చేయడం ఎంత ప్రత్యేకమో అక్కడి ఫ్లోటింగ్ పోస్టాఫీస్ చూడటం కూడా అంతే ఆసక్తికరమైన అనుభూతిగా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories