Dhruv Rathee’s Cars: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ రాయల్ లైఫ్‌స్టైల్.. గ్యారేజ్‌లో ఉన్న టాప్ లగ్జరీ కార్లు ఇవే

Published : Oct 12, 2026, 08:55 AM IST

Dhruv Rathee’s Cars: తన విశ్లేషణాత్మక వీడియోలతో కోట్లాది మంది సబ్‌స్క్రైబర్లను సంపాదించుకున్న ప్రముఖ భారతీయ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ డిజిటల్ ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విజయవంతమైన కెరీర్‌తో అత్యంత విలాసవంతమైన లైఫ్‌స్టైల్‌ను సాగిస్తున్నారు.

PREV
15
డిజిటల్ క్రియేటర్ నుంచి లగ్జరీ ఐకాన్ వరకు ధ్రువ్ రాఠీ జర్నీ

దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన డిజిటల్ క్రియేటర్లలో ధ్రువ్ రాఠీ ఒకరు. రాజకీయం, ఆర్థిక వ్యవస్థ, పాలసీలు, గ్లోబల్ విషయాలు.. ఇలాంటి క్లిష్టమైన టాపిక్స్‌ను చాలా సింపుల్‌గా ప్రజలకు వివరిస్తూ మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. ఇండిపెండెంట్ మీడియా వాయిస్‌గా ఆయన క్రేజ్ రోజురోజుకీ పెరుగుతోంది. దాంతో పాటూ ఆయన పర్సనల్ లైఫ్, రీసెర్చ్ స్టైల్, ఆయన లైఫ్‌స్టైల్ మీద నెటిజన్లలో విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది.

కెమెరా ముందు వచ్చి మాట్లాడే విషయాలే కాకుండా, కెమెరా ఆఫ్ అయ్యాక డిజిటల్ క్రియేటర్ల లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఆడియన్స్ చాలా ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఇటీవల ఢిల్లీ పోలీస్, గుర్గావ్ పోలీస్ పరిధిలో తన తల్లిదండ్రుల నివాసం నుంచి రాఠీ కస్టడీకి సంబంధించిన వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఆయనకు చెందిన లగ్జరీ కార్ల గ్యారేజ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాలు గమనిస్తే..

25
టెస్లా మోడల్ 3: ఎలక్ట్రిక్ సెడాన్ ప్రపంచంలో ఒక ఐకాన్

ధ్రువ్ రాఠీ కార్ల గ్యారేజ్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది 'టెస్లా మోడల్ 3' ఎలక్ట్రిక్ సెడాన్ గురించి. గ్లోబల్‌గా 2017లో తొలిసారి లాంచ్ అయిన ఈ మోడల్, ఇటీవల భారత్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. సింగిల్ మోటార్ లేదా డ్యూయల్ మోటార్ ఆల్-ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌పై దీనిని డిజైన్ చేశారు.

ఈ కారు ఇంటీరియర్ చాలా సింపుల్‌గా, మినిమలిస్టిక్ లుక్‌తో ఒకే ఒక్క టచ్‌స్క్రీన్ చుట్టూ డిజైన్ చేసి ఉంటుంది. డ్రైవర్ అసిస్టెన్స్ కోసం ఆటోపైలట్ ఫీచర్, బెస్ట్ రియల్ వరల్డ్ రేంజ్ దీని సొంతం. వేరియంట్‌ను బట్టి చూస్తే, ఇది కేవలం 4 నుంచి 6 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. హైయర్ ట్రిమ్స్‌లో డబ్ల్యూఎల్టీపీ (WLTP) రేంజ్ ప్రకారం ఒకే ఛార్జ్‌పై దాదాపు 500 నుంచి 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

35
రేంజ్ రోవర్ P400e: పవర్ఫుల్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్ యూవీ

ధ్రువ్ రాఠీ గ్యారేజ్‌లోని మరో పవర్ఫుల్ మోడల్ 'రేంజ్ రోవర్ P400e'. ఇది రేంజ్ రోవర్ క్లాసిక్ లైన్-అప్‌లో వచ్చిన ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్. ఇందులో 3.0 లీటర్ ఇన్‌లైన్-సిక్స్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. ఇవి రెండూ కలిపి దాదాపు 440 bhpల భారీ పవర్‌ను జనరేట్ చేస్తాయి.

చిన్న చిన్న సిటీ ప్రయాణాల కోసం కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌పైనే 65 నుంచి 70 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు. రేంజ్ రోవర్‌కు ఉండే ఫుల్ ఆఫ్‌రోడ్ కేపబిలిటీస్, ఎయిర్ సస్పెన్షన్, లగ్జరీ క్యాబిన్ ఫీచర్లను ఇందులో ఏమాత్రం తగ్గించలేదు. పర్యావరణ స్పృహతో కూడిన ఇంజనీరింగ్, మైండ్ బ్లోయింగ్ లగ్జరీ లుక్స్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఈ ఎస్ యూవీ నిలుస్తుంది.

45
బీఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్: డ్రైవింగ్ డైనమిక్స్ అండ్ క్లాస్

దశాబ్దాల చరిత్ర కలిగిన 'బీఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్' ఎగ్జిక్యూటివ్ సెడాన్ కూడా ధ్రువ్ రాఠీ కార్ల లిస్ట్‌లో ఉంది. పర్‌ఫెక్ట్ డ్రైవింగ్ డైనమిక్స్, అలాగే సూపర్ కంఫర్ట్‌ను బ్యాలెన్స్ చేయడంలో ఈ మోడల్‌కు మంచి పేరుంది. ప్రస్తుతం సరికొత్త జనరేషన్ (G60) మోడల్ ఇండియాలో పెట్రోల్, డీజిల్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (530Le) పవర్‌ట్రెయిన్లలో లభిస్తోంది.

దీంతో పాటు ఫుల్లీ ఎలక్ట్రిక్ వేరియంట్ i5 కూడా అందుబాటులో ఉంది. మెర్సిడెస్ ఈ-క్లాస్ వంటి మోడళ్లకు గట్టి పోటీగా నిలిచే ఈ కారు, డ్రైవింగ్‌ను బాగా ఎంజాయ్ చేసే వారి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇందులో బీఎమ్‌డబ్ల్యూ సిగ్నేచర్ రియర్-వీల్ డ్రైవ్ లేదా సెలెక్టెడ్ వేరియంట్లలో ఎక్స్ డ్రైవ్ ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్లు ఉంటాయి.

55
మెర్సిడెస్-బెంచ్ జీఎల్సీ క్లాస్: లగ్జరీ కాంపాక్ట్ ఎస్ యూవీ

జర్మన్ బ్రాండ్ మెర్సిడెస్-బెంచ్ నుంచి వచ్చిన 'జీఎల్సీ క్లాస్' కాంపాక్ట్ లగ్జరీ ఎస్ యూవీ కూడా ధ్రువ్ రాఠీ గ్యారేజ్ లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. బ్రాండ్ ఎస్ యూవీ లైన్ అప్‌లో ఇది జీఎల్ఈ మోడల్ కంటే దిగువన ఉంటుంది. మోడర్న్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన ఈ కరెంట్ జనరేషన్ మోడల్‌లో మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి.

అలాగే మునుపటి మోడళ్ల కంటే మెరుగైన ఈవీ-ఓన్లీ రేంజ్‌ను ఇచ్చే ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వేరియంట్ కూడా ఉంది. స్మూత్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్, మెర్సిడెస్ ప్రసిద్ధ MBUX ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఈ కారు సొంతం. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ లగ్జరీ ఎస్ యూవీలలో ఇదొకటిగా రికార్డు సృష్టించింది.

Read more Photos on
click me!

Recommended Stories