Delhi : డిల్లీ, న్యూడిల్లీ, డిల్లీ ఎన్సిటి, డిల్లీ ఎన్సిఆర్ మధ్య తేడా ఏంటి? ఒక్క నగరానికే ఇన్ని పేర్లు ఎందుకు?

Published : Nov 18, 2026, 11:30 AM IST

మన దేశ రాజధాని డిల్లీ అని అందరికీ తెలుసు. మరి దీనికి డిల్లీ, న్యూడిల్లీ, డిల్లీ NCT, డిల్లీ NCR అనే వివిధ రకాల పేర్లు ఎందుకు ఉన్నాయో తెలుసా? ఇక్కడ తెలుసుకుందాం.

PREV
14
ఒక్క డిల్లీకే ఇన్ని పేర్లు ఎందుకు?

Delhi : భారతదేశ రాజధాని ఏది అని అడిగితే చిన్నపిల్లలు సైతం టక్కున డిల్లీ అని చెబుతారు. డిల్లీ అంటే ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు... కానీ న్యూడిల్లీ, డిల్లీ NCT(నేషనల్ క్యాపిటల్ టెరిటరీ), డిల్లీ NCR(నేషనల్ క్యాపిటల్ రీజియన్) పేర్లు వినేసరికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇవన్నీ ఒక్కటేనా లేక వేరువేరా అన్న సందేహం కలుగుతుంది. మరి డిల్లీకి ఇన్నిపేర్లు ఎందుకు? ఏ పేరు అర్థం ఏంటి? అనేది ఇక్కడ తెలుసుకుందాం.

24
1. డిల్లీ (Delhi NCT)

డిల్లీ ప్రాచీన పేరు ఇంద్రప్రస్థ. ఈ నగరం అత్యంత ప్రాచీనమైనది... మహాభారత కాలంలో పాండవుల రాజధానిగా ఉండేదని చెబుతారు. అనంతరం డిల్లీ సుల్తానులు, మొఘలులు ఈ నగరాన్ని రాజధానిగా కొనసాగిస్తూ పాలన సాగించారు. ఇలా వేల సంవత్సరాలు భారత రాజధానిగా కొనసాగుతోన్న చారిత్రక నగరం డిల్లీ.

ప్రస్తుతం డిల్లీ ఓ కేంద్ర పాలిత ప్రాంతం... అంటే ఇక్కడ కీలక అధికారాలు కేంద్రం చేతిలోనే ఉంటాయి. అసెంబ్లీ ఉంటుంది... ముఖ్యమంత్రి, మంత్రిమండలి ఉంటుంది... కానీ ఇతర రాష్ట్రాల మాదిరిగా ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉండవన్నమాట. శాంతిభద్రతలతో పాటు ఇతర వ్యవవహారాలను కేంద్రమే చూసుకుంటుంది.

డిల్లీ అంటే ఓ నగరం, కేంద్ర పాలిత ప్రాంతం మాత్రమే కాదు 13 జిల్లాలతో కూడిన ఓ రాష్ట్రం. గతంలో 11 జిల్లాలు ఉండగా పాత డిల్లీ, సెంట్రల్ నార్త్ డిల్లీ, ఔటర్ నార్త్ డిల్లీ జిల్లాలు కొత్తగా ఏర్పడ్డాయి. ఇలా 13 జిల్లాలతో కూడిన ప్రాంతాన్ని డిల్లీ అంటారు. దీనినే అధికారికంగా డిల్లీ ఎన్సిటి (నేషనల్ క్యాపిటల్ టెరిటరీ) అంటారు.

34
2. న్యూడిల్లీ (New Delhi)

డిల్లీలోని 13 జిల్లాల్లో న్యూడిల్లీ ఒకటి... అంటే ఇది నగరంలో ఓ భాగం మాత్రమే. బ్రిటీష్ పాలన సమయంలో ఈ న్యూడిల్లీ ప్రాంతం ఏర్పడింది. ఇక్కడ పెద్దపెద్ద భవంతును నిర్మించుకుని బ్రిటీష్ వారు దేశాన్ని పాలించారు. అందుకే రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్, పార్లమెంట్ వంటివి న్యూడిల్లీలోనే ఉంటాయి. ఇంకా చెప్పాలంటే పాత డిల్లీతో సంబంధం లేకుండా బ్రిటీషర్లు నిర్మించిన కొత్త పాలనా నగరమే న్యూడిల్లీ.

44
3. డిల్లీ ఎన్సిఆర్ (Delhi NCR)

దేశ రాజధాని మాత్రమే కాదు పారిశ్రామికంగా కూడా బాగా డెవలప్ అయిన ప్రాంతం డిల్లీ. అందుకే ఇక్కడ జనాభా రోజురోజుకు పెరుగుతోంది... నగరం వేగంగా విస్తరిస్తోంది. అందుకే డిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుకుని డిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ ను ఏర్పాటుచేసింది ప్రభుత్వం.

డిల్లీలోని 13 జిల్లాలతో పాటు ఉత్తర ప్రదేశ్ లోని 8 జిల్లాలు, రాజస్థాన్ లోని 2 జిల్లాలు, హర్యానాలోని 14 జిల్లాలను కలిపి 37 జిల్లాలతో ఈ డిల్లీ NCR ఏర్పాటుచేశారు. డిల్లీతో పాటే చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి కోసమే ఈ డిల్లీ ఎన్సిఆర్ ఏర్పాటయ్యింది.

Read more Photos on
click me!

Recommended Stories