Pakistan: భారత్‌లో పాకిస్థాన్ వస్తువులు అమ్ముతున్నారా? మనదేశంలోకి పాక్ ఉత్పత్తులు ఎలా వస్తున్నాయి?

Published : Nov 18, 2026, 10:29 AM IST

Pakistan: పాకిస్తాన్ కు చెందిన ఫేస్ క్రీములపై మన దేశం నిషేధం విధించింది. అయితే ఇప్పుడు ఎంతో మందికి ఇతర దేశాల్లాగే పాకిస్థాన్ కు చెందిన ఉత్పత్తులు భారత్ లోకి అమ్మకానికి వస్తున్నాయా? అనే సందేహం వస్తుంది.

PREV
13
భారత్ లో పాకిస్థాన్ వస్తువులు?

పాకిస్థాన్‌కు చెందిన వస్తువులు భారత్‌లో అమ్ముకోవచ్చా? అక్కడ తయారైన బ్యూటీ క్రీములు మన దేశంలోకి ఎలా వస్తున్నాయి? వాటిని కొనుగోలు చేయడం చట్టబద్ధమేనా? అనే సందేహాలు చాలామందికి వస్తుంటాయి. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన రెండు బ్యూటీ క్రీముల విషయం ఈ చర్చకు కారణమయ్యాయి. గోరి బ్యూటీ క్రీమ్, చాందినీ వైటనింగ్ క్రీమ్‌లలో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నట్లు భారత ఔషధ నియంత్రణ సంస్థ గుర్తించింది. ఈ క్రీముల్లో పాదరసం (మెర్క్యురీ), ఆర్సెనిక్ వంటి విషపూరిత పదార్థాలు అనుమతించిన పరిమితికి మించి ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. ఇవి చర్మానికి మాత్రమే కాకుండా శరీరంలోని ఇతర అవయవాలకు కూడా హాని కలిగించే ప్రమాదం ఉంది.

23
పాక్ వస్తువులపై నిషేధం

పాకిస్థాన్‌కు చెందిన వస్తువులపై భారత్‌లో ఇప్పటికే నిషేధం ఉంది. 2025 మే 2న కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌లో తయారైన లేదా అక్కడి నుంచి ఎగుమతి చేసే అన్ని రకాల వస్తువుల దిగుమతిని నిషేధిస్తూ విదేశీ వాణిజ్య విధానంలో మార్పులు చేసింది. ఈ నిషేధం నేరుగా వచ్చే వస్తువులతో పాటు ఇతర దేశాల మీదుగా వచ్చే సరుకులకు కూడా వర్తిస్తుంది. జాతీయ భద్రత, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ముందస్తు అనుమతి ఇస్తే మాత్రమే ప్రత్యేక మినహాయింపులు ఉంటాయి. అలాంటి వస్తువులు మాత్రమే మనదేశ మార్కెట్లోకి వస్తాయి.

33
పాక్ వస్తువులు భారత్‌లోకి వస్తే..

విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, సరిహద్దుల్లో కస్టమ్స్ అధికారులు సరుకులను తనిఖీ చేస్తారు. అనుమానం వచ్చిన వస్తువుల నమూనాలను ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రయోగశాలలకు పంపిస్తారు. బ్యూటీ క్రీములు, ఇతర సౌందర్య సాధనాల్లో పాదరసం, సీసం, ఆర్సెనిక్ వంటి హానికర పదార్థాలు ఉన్నాయా అని పరీక్షిస్తారు. సాధారణంగా విదేశీ కాస్మెటిక్స్ దిగుమతికి కూడా CDSCO నమోదు, నాణ్యత ప్రమాణాలు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘించి సరుకులు తీసుకొస్తే వాటిని అధికారులు స్వాధీనం చేసుకోవచ్చు. అక్రమ దిగుమతులకు పాల్పడిన వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అందుకే పాకిస్థాన్ ఉత్పత్తుల పేరుతో ఆన్‌లైన్‌లో లేదా దుకాణాల్లో కనిపించే వస్తువులను కొనుగోలు చేసే ముందు వాటి వివరాలు, భద్రత గురించి జాగ్రత్తగా తెలుసుకోవాలి.

Read more Photos on
click me!

Recommended Stories