Temples Village: ఒకే గ్రామంలో వందకు పైగా దేవాలయాలు.. ఎక్కడో కాదు మన రాష్ట్రంలోనే!

Published : Nov 23, 2026, 02:17 PM IST

Temples Village: మన దేశంలో ఎన్నో అద్భుతమైన దేవాలయాలు, చారిత్రక కట్టడాలు ఉన్నాయి. కానీ మన రాష్ట్రంలోని ఒక గ్రామంలో ఏకంగా 100కు పైగా దేవాలయాలు ఉన్నాయంటే మీరు నమ్మగలరా? మరి ఆ ఊరు ఎక్కడుంది? ఎందుకు అక్కడ అన్ని దేవాలయాలు నిర్మించారో తెలుసుకుందాం.

PREV
15
ఒకే గ్రామంలో వందకు పైగా దేవాలయాలు

మన దేశంలో ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు ఒక్కో ప్రత్యేక ఆలయంతో గుర్తింపు పొందితే, మరికొన్ని ప్రాంతాలు అనేక పురాతన దేవాలయాలకు నిలయంగా ప్రసిద్ధి చెందాయి. అలాంటి అరుదైన ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని చేబ్రోలు గ్రామం ఒకటి. ఈ గ్రామంలో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా వందకు పైగా దేవాలయాలు ఉన్నాయి. ఇంతటి ప్రత్యేకత కలిగిన ఈ గ్రామం ఎక్కడుంది? ఇక్కడ ఉన్న ప్రసిద్ధ దేవాలయాలు ఏంటి? ఈ ప్రాంతానికి దక్షిణ కాశీ అనే పేరు ఎందుకు వచ్చింది? వంటి విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

25
గుంటూరు జిల్లాలోని చారిత్రక గ్రామం

గుంటూరు నగరానికి సమీపంలో ఉన్న ఈ ప్రాంతానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. సాధారణంగా ఒక గ్రామంలో ఒకటి లేదా రెండు ప్రముఖ దేవాలయాలు ఉండటం చూస్తుంటాం. కానీ చేబ్రోలు ప్రత్యేకత మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ఈ గ్రామంలో ఒకప్పుడు 101 దేవాలయాలు ఉండేవట. అంతేకాదు, 101 బావులు కూడా ఉండేవని చరిత్ర చెబుతోంది. అందువల్లే చేబ్రోలును దక్షిణ కాశీగా పిలిచేవారట.

35
వందకు పైగా దేవాలయాల వెనుక ఉన్న చరిత్ర

చేబ్రోలు ప్రాంతం అనేక రాజవంశాల పాలనలో అభివృద్ధి చెందినట్లు తెలుస్తోంది. తూర్పు చాళుక్యులు, వెలనాటి చోళులు, కాకతీయుల కాలంలో ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉండేదట. అప్పటి రాజులు, సైన్యాధికారులు దేవాలయాల నిర్మాణానికి, వాటి అభివృద్ధికి ప్రోత్సాహం అందించారట. దేవాలయాలకు భూములు, ఆస్తులు దానం చేయడంతో పాటు నిత్య పూజలు, దీపారాధనల కోసం ఏర్పాట్లు చేసినట్లు చరిత్ర చెబుతోంది.

45
చతుర్ముఖ బ్రహ్మ ఆలయం

చేబ్రోలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం. ఈ గుడి నిర్మాణ శైలి, ప్రత్యేకత భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఒక పెద్ద కోనేరు మధ్యలో ఈ ఆలయం ఉండటం ఇక్కడి ప్రత్యేకత. నీటి మధ్యలో ఉన్న ఆలయానికి వంతెన ద్వారా చేరుకోవచ్చు. ఇక్కడి శివలింగానికి నాలుగు వైపులా బ్రహ్మదేవుడి ముఖాల రూపాలు కనిపించడం విశేషం. అందుకే ఈ ఆలయానికి చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర ఆలయం అనే పేరు వచ్చింది.

55
ఇతర ప్రసిద్ధ దేవాలయాలు

చేబ్రోలులో చతుర్ముఖ బ్రహ్మ ఆలయంతో పాటు అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. వాటిలో నాగేశ్వర స్వామి ఆలయం, భీమేశ్వర స్వామి ఆలయం, ఆదికేశవ ఆలయం, వీరభద్ర స్వామి ఆలయం ముఖ్యమైనవి. ఈ దేవాలయాల్లో కనిపించే పురాతన శిల్పాలు, నిర్మాణ శైలి అప్పటి కళాకారుల నైపుణ్యాన్ని తెలియజేస్తాయి. ముఖ్యంగా భీమేశ్వర స్వామి ఆలయం నిర్మాణం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ప్రాంతంలోని కొన్ని ఆలయాలు చాళుక్యుల కాలానికి చెందినవిగా చరిత్ర చెబుతోంది. చరిత్రపై ఆసక్తి ఉన్నవారు, పురాతన దేవాలయాలను సందర్శించాలనుకునేవారు తప్పక చూడదగిన ప్రాంతాల్లో చేబ్రోలు ఒకటి.

Read more Photos on
click me!

Recommended Stories