Butterfly Pea Flower: ముసలితనం రాకుండా చేసే పువ్వు.. ఈ మొక్కకు అంత పవర్ ఉందా? అసలు నిజం ఇదే

Published : Sep 28, 2026, 02:13 PM IST

Butterfly Pea Flower: సోషల్ మీడియాలో ఇటీవల శంఖు పువ్వు టీ తాగితే లేదా దాని రసాన్ని రాసుకుంటే చర్మం ఎప్పటికీ తన రంగును కోల్పోదనీ, వృద్ధాప్యం రాదని అనేక క్లెయిమ్స్ వైరల్ అవుతున్నాయి. అయితే దీని వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
శంఖు పువ్వుతో చావును ఆపవచ్చా? సోషల్ మీడియా వైరల్ న్యూస్

ఇన్‌స్టాగ్రామ్, రీల్స్, ఫేస్‌బుక్‌లలో ఎక్కడ చూసినా ఒకటే హడావుడి.. "ఈ నీలి రంగు పువ్వు వాడితే చావును ఆపేయవచ్చు", "ఇది వృద్ధాప్యానికి చెక్ పెడుతుంది" అంటూ రకరకాల ప్రచారాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ శంఖు పువ్వు (బటర్‌ఫ్లై పీ) వెనుక ఉన్న అసలు శాస్త్రీయ నిజాలు గమనిస్తే..

శంఖు పువ్వుల నుంచి తీసే ఈ నాచురల్ ఎక్స్‌ట్రాక్ట్‌లో యాంథోసైనిన్లు, ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ సమ్మేళనాలు అనే శక్తివంతమైన వృక్ష రసాయనాలు ఉంటాయి. ఇవి మొక్కకు సహజమైన గాఢమైన నీలి రంగును ఇవ్వడమే కాకుండా, మన శరీరానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్ గుణాలను కూడా అందిస్తాయి.

25
శంఖు పువ్వుతో స్కిన్ కేర్ ప్రయోజనాలు

ఈ ఎక్స్‌ట్రాక్ట్‌ను బ్యూటీ ప్రొడక్ట్స్, సీరమ్‌లు, మోయిశ్చరైజర్లలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. చర్మానికి ఇది అందించే ముఖ్యమైన ప్రయోజనాలు ఇవే..

• ఫ్రీ రాడికల్స్ నుండి రక్షణ: వాతావరణ కాలుష్యం, ఎండలోని యూవీ కిరణాల వల్ల చర్మ కణాలు దెబ్బతింటాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు ఆ ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

• చర్మం కూల్ గా మారడం: ముఖంపై ఎరుపుదనం, చిన్నచిన్న మంట లేదా దురద ఉన్నప్పుడు ఈ రసం చర్మాన్ని కూల్ చేస్తుంది.

• హైడ్రేషన్, గ్లో: చర్మానికి తగినంత తేమను ఇచ్చి, డల్ నెస్ తగ్గించి సహజమైన కాంతిని ఇస్తుంది.

• యాంటీ- పొల్యూషన్ కేర్: కాలుష్య కణాల వల్ల చర్మంపై పడే ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి కొన్ని యాంటీ-పొల్యూషన్ క్రీమ్స్ లో దీనిని వాడుతున్నారు.

• సహజ నీలి రంగు: కృత్రిమ కెమికల్ రంగులు వాడకుండా, కాస్మోటిక్స్ కు సహజ సిద్ధమైన నీలి లేదా ఊదా రంగు ఇవ్వడానికి ఈ పువ్వు వర్ణద్రవ్యం బాగా ఉపయోగపడుతుంది.

35
చావును ఆపేస్తుందా?.. అసలు శాస్త్రీయ నిజాలు ఇవే

సోషల్ మీడియాలో వచ్చే హెడ్‌లైన్స్ చూసి ఇది ఏదో అమృతం అనుకోకండి. ఈ పువ్వుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు చర్మ కణాల క్షీణతను కొంతవరకు ఆలస్యం చేస్తాయనేది వాస్తవం. కానీ మనుషుల మరణాన్ని ఆపడం లేదా వృద్ధాప్యాన్ని శాశ్వతంగా నిరోధించడం వంటివి శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. చావును ఆపుతుంది అనేది కేవలం ప్రచారానికి ఉపయోగించే ఒక పదం మాత్రమే. దీనిని ఒక మంచి నాచురల్ బొటానికల్ ఇన్గ్రీడియంట్ గా మాత్రమే చూడాలని నిపుణులు చెబుతున్నారు.

అలాగే ఈ సారం చర్మాన్ని తెల్లగా చేస్తుందనే దానికి కూడా బలమైన మెడికల్ ఆధారాలు లేవు. ఇది చర్మం డల్ నెస్ తగ్గించి హెల్తీగా కనిపించేలా చేస్తుంది.

45
బ్లూ టీ, హెయిర్ కేర్ ఉపయోగాలు

కేవలం చర్మానికే కాకుండా ఇతర రంగాల్లో కూడా దీని వాడకం ఎక్కువే..

బ్లూ టీ: ఎండబెట్టిన శంఖు పువ్వులను నీటిలో మరిగించి బ్లూ టీ తయారు చేస్తారు. ఇది ఒత్తిడిని తగ్గించడానికి, మైండ్ రిలాక్స్ అవ్వడానికి, జ్ఞాపకశక్తికి మంచిదని భావిస్తారు. ఈ టీలో కొన్ని చుక్కల నిమ్మరసం పిండితే రంగు నీలం నుండి ఊదా రంగులోకి మారడం విశేషం.

జుట్టు సంరక్షణ: కొన్ని షాంపూలు, స్కాల్ప్ సీరమ్స్ లో దీనిని ఉపయోగిస్తారు. ఇది తలమాడును ప్రశాంతంగా ఉంచడానికి, డాండ్రఫ్ నివారణకు సహాయపడుతుంది. అయితే జుట్టు రాలడం పూర్తిగా ఆపుతుందని చెప్పడానికి ఆధారాలు తక్కువ.

55
దుష్ప్రభావాలు.. ఇంట్లో వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఏదైనా సహజ సిద్ధమైన పదార్థమే అయినా అందరి చర్మానికి ఒకేలా పడాలని లేదు.

దుష్ప్రభావాలు: కొందరిలో చర్మం ఎర్రబడటం, దద్దుర్లు, కళ్ళ చుట్టూ మంట లేదా అలర్జీ రావచ్చు.

ప్యాచ్ టెస్ట్: ఈ ఎక్స్‌ట్రాక్ట్ ఉన్న కొత్త ప్రొడక్ట్ వాడే ముందు చేతిపైన లేదా చెవి వెనుక చిన్న ప్యాచ్ టెస్ట్ చేసి 24 గంటలు గమనించడం మంచిది.

ఇంట్లో తయారుచేసే పద్ధతులు: ఇంట్లోనే పువ్వులను నీటిలో నానబెట్టి ముఖానికి రాసుకోవడం అంత సురక్షితం కాదు. ఇందులో బాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది, అలాగే సరైన మోతాదు ఉండదు. అందుకే ల్యాబ్ టెస్ట్ చేసిన ప్రొడక్ట్స్ ఎంచుకోవడమే శ్రేయస్కరం.

Read more Photos on
click me!

Recommended Stories