గత కొన్నేళ్లుగా మార్కెట్లో టైల్స్ వెరైటీలు అమాంతం పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు గ్లాసీ, మ్యాట్, 3D ప్రింటెడ్, వుడెన్ ఫినిష్, స్టోన్ ఫినిష్ లాంటి ఎన్నో డిజైన్లలో టైల్స్ దొరుకుతున్నాయి. వీటిలో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. ఇంటి అవసరాన్ని బట్టి ఒక్కో గదికి ఒక్కో డిజైన్ ఎంచుకోవచ్చు. ఉదాహరణకు… హాల్‌లో గ్లాసీ టైల్స్ వేస్తే ఇల్లు చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది. అదే బెడ్‌రూమ్‌లో అయితే వుడెన్ లేదా మ్యాట్ ఫినిష్ టైల్స్ వేసుకుంటే చాలా క్లాస్‌గా ఉంటుంది.
మంచి క్వాలిటీ ఉన్న టైల్స్ ధర సాధారణంగా చదరపు అడుగుకు రూ.50 నుంచి రూ.70 వరకు ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. అయితే డిజైన్, సైజు, బ్రాండ్‌ను బట్టి ఈ ధరలు ఇంకా పెరగొచ్చు. మార్బుల్‌తో పోలిస్తే టైల్స్ వేయడం చాలా సులువు. దీనికి లేబర్ ఖర్చు కూడా తక్కువే అవుతుంది. అయితే టైల్స్ ధరలు ఒక్కో నగరంలో ఒక్కోలా ఉంటాయి. కాబట్టి కచ్చితమైన ధరల కోసం మీ దగ్గర్లోని మార్కెట్లో ఎంక్వైరీ చేయడం మంచిది.
ఇప్పుడు మార్కెట్లో పెద్ద సైజులో ఉండే 'నానో', స్లాబ్-స్టైల్ టైల్స్ కూడా దొరుకుతున్నాయి. ఇవి పెద్దగా ఉండటం వల్ల ఫ్లోరింగ్ మీద జాయింట్లు ఎక్కువగా కనిపించవు. దీంతో ఇల్లు చాలా నీట్‌గా, రిచ్‌గా కనిపిస్తుంది. ముఖ్యంగా పెద్ద హాళ్లు, ఓపెన్ స్పేస్‌లలో ఈ టైల్స్ వేస్తే లుక్ అదిరిపోతుంది. అయితే ఈ పెద్ద సైజు టైల్స్ వేయడానికి కచ్చితంగా అనుభవం ఉన్న పనివాళ్లు మాత్రమే కావాలి.