Best Beer in India: ఇండియాలో బెస్ట్ బీర్ ఏది? బీర్ లవర్స్ టాప్ 5 ఫేవరెట్స్ ఇవే !

Published : Jul 08, 2026, 09:11 AM IST

Best Beer in India: ఇండియాలో లభించే బీర్లు చాలానే ఉన్నాయి. అయితే, దేశంలో బెస్ట్ బీర్ ఏదో మీకు తెలుసా? బీరా 91 నుంచి కింగ్‌ఫిషర్ వరకు టాప్ 5 బీర్లు, వాటి ధరలు సహా పూర్తి వివరాలు మీకోసం.

PREV
16
కింగ్‌ఫిషర్ టు బీరా.. ఏ బీర్ తాగితే కిక్ బాగుంటుంది? టాప్ 5 బీర్ల రేట్లు, ఫ్లేవర్స్ పూర్తి వివరాలు ఇవే

ఇండియాలో దొరికే బెస్ట్ బీర్ ఇదే అని చెప్పడం అంత ఈజీ కాదు.. ఎందుకంటే మన దేశంలో ఇప్పుడు బీర్ మార్కెట్ అస్సలు మామూలుగా లేదు. సరికొత్త బ్రాండ్లు, అదిరిపోయే ఫ్లేవర్లతో రోజురోజుకీ క్రేజ్ పెరిగిపోతోంది. పర్ఫెక్ట్ టేస్ట్ కోసం గత కొన్నేళ్లుగా దేశంలోని దాదాపు అన్ని లోకల్, టాప్ బ్రాండ్లను టేస్ట్ చేసిన వారిని అడగ్గా.. వారు కొన్ని బీర్ బ్రాండ్లకు మంచి రేటింగ్స్ ఇచ్చారు. వాటన్నింటిలో చాలా మంది మనసు దోచుకుని, ఎప్పుడు తాగినా సూపర్బ్ గా ఉంటాయని చెప్పిన టాప్ 5 బీర్ల లిస్ట్ మీ కోసం..

26
1. బీరా 91 వైట్

ఇండియాలో లభించే బెస్ట్ బీర్ బీరా 91 వైట్ (Bira 91 White). ఈ బీర్ ఎందుకు ఇంత ఫేమస్ అంటే.. ఇండియాలో చాలా మందికి నచ్చే యూనివర్సల్ టేస్ట్ దీని సొంతం. ఇది ఒక వీట్ బీర్. ఫ్రూటీ ఫ్లేవర్‌తో, క్లౌడీగా ఉంటూ తాగడానికి చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇందులో ఆల్కహాల్ శాతం 4.7 శాతంగా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది కానీ నోటికి మరీ హెవీగా అనిపించదు. మీరు రెగ్యులర్‌గా బీర్ తాగేవాళ్లైనా లేదా ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్న వారైనా సరే, దీనితో హ్యాపీగా స్టార్ట్ చేయొచ్చని బీర్ లవర్స్ చెబుతున్నారు.

36
2. కింగ్‌ఫిషర్ అల్ట్రా

రెండో ప్లేస్ లో కింగ్‌ఫిషర్ అల్ట్రా బీర్ ఉంది. ఇది చాలా క్రిస్ప్, స్మూత్ అండ్ రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఇందులో గ్రెయిన్, గ్రాస్, సిట్రస్ నోట్స్ చాలా లైట్‌గా తెలుస్తాయి. ఎక్కువ హడావుడి లేకుండా సింపుల్‌గా సాగిపోయే టేస్ట్ ఇది. మరీ హెవీగా కాకుండా, నోటికి లైట్‌గా ఉండే బీర్ కావాలనుకున్నప్పుడు బీర్ లవర్స్ కు ఇది మొదటి ఛాయిస్. ఇది తాగితే మరుసటి రోజు ఉదయం ఎలాంటి తలనొప్పి లేదా రిగ్రెట్ ఫీలింగ్ అస్సలు ఉండదనీ, నమ్మకమైన, కాంప్లికేషన్స్ లేని పర్ఫెక్ట్ ఆప్షన్ ఇదేనని బీర్ లవర్స్ చెబుతున్నారు.

46
3. కాల్డెరా

కోల్‌కతాలో తయారయ్యే కాల్డెరా బీర్‌కు వెస్ట్ బెంగాల్‌లో సైలెంట్‌గా ఒక రేంజ్‌లో అభిమానుల బేస్ క్రియేట్ అయింది. మాల్టెడ్ వీట్‌తో తయారు చేయడం వల్ల ఇది చాలా స్మూత్, క్రీమీగా ఉంటుంది. ఇందులో చేదు చాలా తక్కువ. అందువల్ల ఎవరైనా దీన్ని ఈజీగా తాగేయొచ్చు. లాంగ్ ఆఫ్టర్ నూన్ సెషన్స్‌కు ఇది పర్ఫెక్ట్. టేస్ట్ బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని బీర్ లవర్స్ చెబుతున్నారు.

56
4. గోవా బ్రూయింగ్ కో. ఎయిట్ ఫింగర్ ఎడ్డీ

ఈ లిస్ట్ లో 4వ స్థానంలో ఎయిట్ ఫింగర్ ఎడ్డీ ((Goa Brewing Co. Eight Finger Eddie) నిలిచింది. ఇదొక డబుల్ డ్రై హాప్డ్ ఓట్ క్రీమ్ ఏల్. ఇందులో ట్రాపికల్ ఫ్రూట్ సువాసనలు, సాఫ్ట్ టెక్స్చర్ ఉంటాయి. బీర్ బ్యాలెన్స్‌డ్‌గా ఉండటానికి కావలసినంత చేదు మాత్రమే ఇందులో ఉంటుంది. ఈ లిస్ట్‌లో ఉన్న మిగతా వాటికంటే ఇది కొంచెం థిక్‌గా అనిపించినా, తాగడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. గోవా క్రాఫ్ట్ బీర్ మార్కెట్ ఎంతలా ఎదుగుతుందో చెప్పడానికి ఈ బీరే పెద్ద ఎగ్జాంపుల్.

66
5. కింగ్‌ఫిషర్ ప్రీమియం

కింగ్‌ఫిషర్ అల్ట్రా, ప్రీమియం రెండూ పూర్తిగా వేర్వేరు ప్రయోజనాలు అందిస్తాయి. అల్ట్రా అనేది చాలా లైట్‌గా ఉంటే.. కింగ్‌ఫిషర్ ప్రీమియం మాత్రం పక్కా క్లాసిక్ లాకర్ ప్రొఫైల్‌ను కలిగి ఉంటుంది. ఈ పిల్స్నర్ స్టైల్ బీర్‌లో ఫ్లోరల్ హాప్ సువాసనలతో పాటు బిస్కెట్ మాల్ట్ నోట్స్ ఉంటాయి. చివర్లో లైట్ చేదు తగులుతుంది. చాలా మందికి బాగా తెలిసిన, నమ్మకమైన టేస్ట్ ఇది. మెనూ చూసి ఏది ఆర్డర్ చేయాలో అర్థం కానప్పుడు సేఫ్ ఆప్షన్‌గా దీనిని ఎంచుకోవచ్చని బీర్ లవర్స్ చెబుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories