Stray Dogs: వీధి కుక్కలకు ఫుడ్ పెడుతున్నారా? ముందుగా ఈ రూల్స్ తెలుసుకోండి, లేకపోతే ఇబ్బందులే

Published : Apr 19, 2026, 10:14 AM IST

Stray Dogs: మనదేశంలో జంతు ప్రేమికులు ఎక్కువ. ఎంతో మంది వీధి కుక్కలకు ఆహారం పెడుతుంటారు. అయితే అలా ఫుడ్ పెట్టేటప్పుడు కొన్ని రూల్స్ తప్పనిసరిగా పాటించాలి.  అవి పాటించకపోతే చిక్కుల్లో పడతారు. ఆ నియమాల గురించి ఇక్కడ ఇచ్చాము.

PREV
14
వీధి కుక్కలు ఆహారం... సుప్రీంకోర్టు ఏం చెప్పింది?

ఇంట్లో మిగిలిపోయిన ఆహారం వేస్ట్ చేయడం ఎందుకని ఎంతో వీధి కుక్కలకు ఆహారం పెడుతుంటారు. ఇది చాలా మంచి పని. కానీ అలా చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. వీధి కుక్కలకు ఆహారం పెట్టడంపై ఇప్పటికే ఎన్నో గొడవలు అయ్యాయి.  వాటికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు  సుప్రీం కోర్టు 2025లో కొన్ని ఆదేశాలు ఇచ్చింది. కుక్కలకు ఫుడ్ పెట్టడం చట్టబద్ధమే. మీరు వీధికుక్కలకు ఆహారం ఎప్పుడైనా పెట్టవచ్చు… కానీ పబ్లిక్ ప్లేసుల్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదని కోర్టు స్పష్టం చేసింది. జంతు సంక్షేమంతో పాటు, ప్రజల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ రూల్స్ తెచ్చారు.

24
ఎక్కడ ఆహారం పెట్టవచ్చు?

వీధి కుక్కలకు ఎవరైనా కూడా రోడ్లు, పార్కులు, భవనాలకు దగ్గరలో కుక్కలకు ఆహారం పెట్టకూడదు. ప్రతి ఏరియాలో స్థానిక సంస్థలు (మన దగ్గర మున్సిపాలిటీల్లాగా) కేటాయించిన ప్రత్యేక చోట్లలో మాత్రమే ఆహారం అందించాలి. 

హౌసింగ్ సొసైటీలు, ఫ్లాట్లలో కుక్కలకు ఆహారం పెట్టడాన్ని పూర్తిగా నిషేధించే అధికారం రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్‌లకు (RWA) లేదు. కానీ సొసైటీ లోపల కొన్ని ప్రత్యేక స్థలాలను గుర్తించి, అక్కడ పరిశుభ్రత పాటించేలా రూల్స్ పెట్టే అధికారం మాత్రం వాటికి ఉంటుంది.

34
ప్రజల భద్రత

జనం ఎక్కువగా ఉండే ప్రాంతాలు, పిల్లలు ఆడుకునే చోట్ల వీధి కుక్కలకు ఆహారం పెట్టకూడదు. ఇష్టమొచ్చినట్లు ఫుడ్ పెట్టడం వల్ల కుక్కలు దూకుడుగా మారుతున్నాయని, పరిశుభ్రత సమస్యలు వస్తున్నాయని, చుట్టుపక్కల ప్రజలపైకి కరిచేందుకు వెళుతున్నాయని ఫిర్యాదులు రావడంతోనే ఈ చర్యలు తీసుకున్నారు. నిబంధనలు మీరిన వారిపై స్థానిక చట్టాల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది.

44
ఇతరులకు ఇబ్బంది కలగకుండా

భారత చట్టం ప్రకారం వీధి కుక్కలకు ఆహారం పొందే హక్కు ఉంది, వాటిపై క్రూరంగా ప్రవర్తించకూడదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. 'యానిమల్ బర్త్ కంట్రోల్' పథకం కింద కుక్కలకు స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ చేసి, వాటిని ఎక్కడైతే పట్టుకున్నారో అక్కడే తిరిగి వదిలేయాలి. ఒక్కమాటలో చెప్పాలంటే, కుక్కలను ప్రేమించేవారికి, వాటికి ఆహారం పెట్టేవారికి ఆ హక్కు ఉంది. కానీ, అది ఇతరులకు ఇబ్బంది కలగకుండా, ప్రభుత్వం గుర్తించిన చోట్ల మాత్రమే చేయాలని చట్టం చెబుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories