Green chilli Price: అమెరికాలో కిలో పచ్చిమిర్చి ఎంతో తెలుసా? భారతీయ మహిళ వీడియో వైరల్

Published : Jul 23, 2026, 09:45 AM IST

Greem chilli Price: కూరలు, బిర్యానీలు వండాలంటే పచ్చిమిర్చి తప్పనిసరిగా ఉండాలి. ఇక అమెరికాలో సెటిలైన భారతీయులకు కూడా పచ్చిమిరప అవసరం. కానీ అక్కడి ధరలు ఇండియన్స్ ను భయపెట్టేలా ఉన్నాయి.

PREV
13
పచ్చిమిర్చి గురించి వైరల్ వీడియో

భారతీయ వంటకాల్లో పచ్చిమిరిపకాయ తప్పకుండా ఉండాలల్సందే. పప్పు, కూర, పచ్చడి, బిర్యానీ ఏది వండినా కూడా అందులో పచ్చిమిరపకాయ ముక్కలు పడాల్సిందే. మన దేశంలో పచ్చిమిరపకాయ ధరలు తక్కువగానే ఉంటాయి. ఓ 20 రూపాయలవి కొని తెచ్చుకుంటే వారం రోజుల పాటూ సరిపోతాయి. అయితే అదే పచ్చిమిరపకాయలను అమెరికాలో కొనాలంటే మాత్రం జేబుకు చిల్లు పడాల్సిందే. తాజాగా సోషల్ మీడియాలో ఓ భారతీయ మహిళ అక్కడ పచ్చిమిర్చి ధరను చూపిస్తూ చేసిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. భారతదేశంతో పోలిస్తే అమెరికాలో పచ్చిమిర్చి ధర ఎంత ఎక్కువగా ఉన్నాయో చూసి భారతీయ వినియోగదారులు షాక్ అవుతున్నారు.

23
అమెరికాలో పచ్చిమిర్చి ధర ఎంత?

వైరల్ వీడియో చెబుతున్న ప్రకారం ఒక మహిళ అమెరికాలోని ఒక సూపర్ మార్కెట్‌లో 114 గ్రాముల బరువున్న పచ్చిమిర్చి ప్యాకెట్‌ను చూపించింది. ఆ ప్యాకెట్‌లో సుమారు 12 నుండి 13 మిరపకాయలు మాత్రమే ఉన్నాయి. కానీ దాని ధర మన భారతీయ రూపాయిల్లో చూస్తే దాదాపు రూ.400 గా ఉంది. ఈ లెక్కన ఒక కిలో పచ్చిమిరపకాయల ధర చూస్తే సుమారు రూ.3,500 వరకు ఉంటుంది. మన దేశంలో కేవలం రూ.20 నుండి రూ.30లకే పావుకిలో దొరికే పచ్చిమిర్చికి.. అమెరికాలో మాత్రం వందల రూపాయలు ఖర్చుపెట్టాలి భారతదేశంలో రూ.400 పెడితే సంచి నిండా రకరకాల కూరగాయలు వస్తాయని, అటువంటిది అమెరికాలో కేవలం గుప్పెడు మిరపకాయలకే అంత డబ్బు ఖర్చు పెట్టాలా అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.

33
ఎందుకంత ఖరీదు?

అమెరికాలో పచ్చిమిర్చి ఇంత ఖరీదు ఎందుకు? దీనికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మనం ఉపయోగించే భారతీయ పచ్చిమిర్చి రకాలు అక్కడ ప్రతిచోటా పండవు. వీటిని ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవడం, రవాణా, ప్యాకేజింగ్, కోల్డ్ స్టోరేజ్, అక్కడ ఇచ్చే అధిక లేబర్ ఛార్జీల వల్ల ఇవి ఖరీదైనవిగా మారుతాయి. అంతేకాకుండా అమెరికాలో సంపాదన, జీవన వ్యయం, కొనుగోలు శక్తి మన దేశంతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. డాలర్లను నేరుగా రూపాయిల్లోకి మార్చి చూసినప్పుడు ధరలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఏది ఏమైనప్పటికీ విదేశాల్లో ఉండే భారతీయులకు మాత్రం మన ఊరి మిరపకాయల విలువ ఇప్పుడు బాగా తెలుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories