శంఖం గురించి తెలియని వారు ఉండదరు. చాలామంది పూజల్లో వాడుతుంటారు. జంగమలు శంఖం ఊదుతూ ఊళ్లో తిరుగుతుంటారు. గతంలో యుద్దాలప్పుడు శంఖానాధం చేయడం గురించి కూడా విన్నం. మరి ఆ శంఖం ఎలా తయారవుతుంది? అంత గట్టి వస్తువుని మనిషి తయారుచేయలేదని మికు తెలుసా?
మనం పూజల్లో ఉపయోగించే శంఖాన్ని చూస్తే, ఎవరో ఎంతో ఓపికగా చెక్కి తీర్చిదిద్దిన కళాఖండంలా కనిపిస్తుంది. కానీ ఆ శంఖాన్ని ఏ మనిషీ తయారు చేయలేదని తెలుసా? సముద్రంలో నివసించే ఒక చిన్న జీవి తన శరీరం నుంచే ఈ గట్టి, అందమైన కవచాన్ని నిర్మించుకుంటుంది . అంతేకాదు, ఆ జీవి పెరుగుతున్న కొద్దీ దాని ఇల్లు అయిన శంఖం కూడా క్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఇంతకీ “శంఖం ఎలా తయారవుతుంది? శంఖం వెనుక ఉన్న అద్భుత రహస్యం ఏంటి?
23
శంఖాన్ని నిర్మించే జీవి, ‘మాంటిల్’ వ్యవస్థ
ఎముకలు కూడా లేని మృదువైన జీవి ఇంత దృఢమైన శంఖాన్ని ఎలా రూపొందించుకోగలదు అనే ఆసక్తి కలగడం సహజం. పూజల్లో వాడే సాంప్రదాయ శంఖం వెనుక ఉన్న జీవి పేరు ‘టర్బినెల్లా పైరం’ (Turbinella pyrum). ఇది సముద్రంలో జీవించే ఒక రకమైన నత్త జాతి జీవి. దీని శరీరం ఎంతో మృదువుగా ఉంటుంది కాబట్టి, సముద్రంలోని ఇతర జీవుల నుంచి రక్షణ పొందేందుకు గట్టి బాహ్య కవచం అవసరం.
ఈ కవచాన్ని నిర్మించడానికి ఆ జీవికి ఇటుకలు గానీ, సిమెంట్ గానీ అవసరం లేదు. దాని శరీరంలోనే ఒక ప్రత్యేక నిర్మాణ వ్యవస్థ ఉంది. దాని పేరే ‘మాంటిల్’ (Mantle). శరీరంలోని ఈ ప్రత్యేక కణజాలమే శంఖ నిర్మాణానికి ప్రధాన ఆధారం. మాంటిల్ కణజాలం నుంచి కాల్షియం కార్బోనేట్ (Calcium Carbonate) అనే ఖనిజ పదార్థంతో పాటు కొన్ని సేంద్రియ పదార్థాలు విడుదలవుతాయి. ఇవి ఒక క్రమంలో పేరుకుపోయి గట్టి పొరలుగా మారుతాయి.
33
పెరుగుదల క్రమం, స్పైరల్ మెలికల వెనుక కారణం
ఈ జీవి తన ఇంటిని ఒకేసారి నిర్మించుకోదు.. తన శరీరం పెరిగే కొద్దీ శంఖం తెరిచి ఉండే అంచు దగ్గర కొత్త పదార్థాలను కలుపుతూ పోతుంది. కొత్త పొరలు ఏర్పడతాయి, పాత పొరలు మరింత బలపడతాయి. కాలక్రమేణా ఆ చిన్న కవచం పెద్ద గట్టి శంఖంగా రూపుదిద్దుకుంటుంది.
శంఖం చుట్టూ కనిపించే మెలికలు కేవలం అలంకరణ కోసం ఏర్పడేవి కావు. జీవి పెరుగుతున్నప్పుడు శంఖం అంచు విస్తరిస్తూ ఒక కేంద్ర అక్షం చుట్టూ తిరుగుతూ పెరగడం వల్లే ఈ స్పైరల్ ఆకారం ఏర్పడుతుంది. ఒక్కో జీవి జాతికి ఒక్కో పెరుగుదల విధానం ఉండటం వల్లే కొన్ని శంఖాలు పొడవుగా, మరికొన్ని గుండ్రంగా, ఇంకొన్ని విభిన్న మెలికలతో కనిపిస్తాయి.