Psychology: సాధారణంగా కొందరు వ్యక్తులు ఎవరినైనా ఇష్టపడితే నేరుగా చెప్పేస్తారు. మరికొందరు మాత్రం మనసులోనే దాచుకుంటారు. అయితే వాళ్లు చేసే కొన్ని పనుల ద్వారా వారికి మన మీద క్రష్ ఉందని తెలుసుకోవచ్చు అంటున్నారు సైకాలజీ నిపుణులు. ఎలాగో ఇక్కడ చూద్దాం.
మనల్ని ఎవరైనా ఇష్టపడుతున్నారా? లేదా మనమే అలా ఊహించుకుంటున్నామా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఎందుకంటే కొంతమంది తమ మనసులోని భావాలను నేరుగా చెప్పేస్తారు. మరికొందరు ఎంత ఇష్టపడినా బయటకు చెప్పడానికి సంకోచిస్తారు. అలాంటి టైంలో వారి ప్రవర్తనలో చిన్నచిన్న మార్పులు కనిపిస్తాయని చెబుతున్నారు సైకాలజీ నిపుణులు. అవేంటో వివరంగా తెలుసుకుందాం.
26
మాట్లాడేందుకు ట్రై చేయడం
మీపై క్రష్ ఉన్నవాళ్లు మీతో మాట్లాడేందుకు లేదా మీ దగ్గర ఉండేందుకు అవకాశాలు వెతుక్కుంటారు. అవసరం లేకపోయినా చిన్న చిన్న కారణాలతో మీతో మాట్లాడడం, మీరు ఉన్న చోటుకు రావడం లేదా ఏదైనా పని పేరుతో మాటలు మొదలుపెట్టడం చేస్తుంటారు. నిపుణుల ప్రకారం.. నచ్చిన వ్యక్తితో ఎక్కువ సమయం గడపాలనే కోరిక సహజంగా ఉంటుంది. కాబట్టి వారు ఉద్దేశపూర్వకంగా కాకపోయినా మీతో ఎక్కువగా కలిసే ప్రయత్నం చేయవచ్చు.
36
మీ మాటలు శ్రద్ధగా వినడం
సాధారణంగా ఇతరులు పట్టించుకోని చిన్న విషయాలను కూడా గుర్తుంచుకోవడం, మీరు చెప్పిన విషయాలను తర్వాత మళ్లీ ప్రస్తావించడం లేదా మీ అభిరుచుల గురించి ఆసక్తిగా అడగడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. సైకాలజీ నిపుణుల ప్రకారం, మనకు ఆసక్తి ఉన్న వ్యక్తి గురించి ఎక్కువ సమాచారం తెలుసుకోవాలనే సహజ తపన ఉంటుంది. అందుకే వారు మీ మాటలను శ్రద్ధగా వింటూ, చిన్న విషయాలను కూడా గుర్తుంచుకునే అవకాశం ఎక్కువ.
మీరు మాట్లాడుతున్నప్పుడు తరచూ కళ్లలోకి చూడడం, మీరు చూడగానే చిరునవ్వు నవ్వడం లేదా మీ వైపు చూస్తూ నిలబడటం వంటి సంకేతాలు మీపై ఆకర్షణను చూపిస్తాయి. అయితే కొందరు సిగ్గు వల్ల నేరుగా చూడకుండా వెంటనే చూపు తిప్పుకోవచ్చు. కాబట్టి చూపును మాత్రమే ఆధారంగా తీసుకుని నిర్ణయం తీసుకోవద్దు.
56
మీ సంతోషం కోరుకోవడం
మీరు సాధించిన విజయాలను మనస్ఫూర్తిగా అభినందించడం, మీరు బాధగా ఉంటే కారణం తెలుసుకోవడానికి ప్రయత్నించడం, అవసరమైనప్పుడు సహాయం చేయడం వంటివి కూడా మీపై క్రష్ ని సూచిస్తాయి. నిపుణుల ప్రకారం మనకు ఇష్టమైన వ్యక్తి సంతోషంగా ఉండాలని కోరుకోవడం సహజమైన ఎమోషన్. కాబట్టి వారు మీ భావాలను గౌరవిస్తూ మీకు మద్ధతు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు.
66
మాటల్లో తడబాటు
సాధారణంగా అందరితో చాలా ధైర్యంగా మాట్లాడే వ్యక్తి, మీతో మాట్లాడేటప్పుడు మాత్రం మాటలు తడబడటం, ఎక్కువగా నవ్వడం, చిన్న చిన్న పొరపాట్లు చేయడం లేదా కొంచెం నెర్వస్‌గా కనిపించడం జరగవచ్చు. సైకాలజీ నిపుణుల ప్రకారం, మనకు ప్రత్యేకమైన వ్యక్తికి మనపై మంచి అభిప్రాయం కలిగించాలని కోరుకోవడం వల్ల కొంతమందిలో ఈ విధమైన ప్రవర్తన కనిపిస్తుంది.
సైకాలజీ నిపుణుల ప్రకారం, కొందరు సహజంగానే అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు. మరికొందరు వృత్తి లేదా వ్యక్తిత్వం కారణంగా అందరి మాటలు శ్రద్ధగా వింటారు. కాబట్టి ఒకే సంకేతాన్ని కాకుండా, పదే పదే కనిపించే ప్రవర్తనను గమనించడం అవసరం. ముఖ్యంగా ఎదుటి వ్యక్తి మాటలు, చర్యలు, మీ పట్ల చూపే గౌరవం అన్నింటినీ కలిపి పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎవరైనా మీపై ఆసక్తి చూపుతున్నారని అనిపించినా, వారు స్పష్టంగా చెప్పే వరకు ఊహల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిదికాదు.