
2027 Holidays : సెలవులు... ఈ మాట వింటేచాలు విద్యార్థులే కాదు ఉద్యోగుల ముఖాల్లోనూ వెలుగు వస్తుంది. వారాంతంతో ప్రత్యేక సెలవులు కలిసివచ్చి వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారితే ఉద్యోగుల ఆనందానికి అవధులు ఉండవు. అయితే వచ్చే ఏడాది (2027) లో ఇలాంటి లాంగ్ వీకెండ్స్ ఏకంగా 12 వస్తున్నాయి... ఇది ఉద్యోగులు ఎగిరిగంతేసే మ్యాటర్. ఇంకా ఆసక్తికర విషయం ఏంటంటే ఓ తొమ్మిది లీవ్స్ తీసుకుని మేనేజ్ చేయగలిగితే ఏకంగా 46 రోజుల వరుస సెలవులు కలిసివస్తున్నాయి.
సాధారణంగా ఐటీ రంగంలో పనిచేసే సాప్ట్ వేర్ ఇంజనీర్స్, కార్పోరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు వీకెండ్ రెండ్రోజులు (శని, ఆదివారం) సెలవు ఉంటుంది. వీటికి పండగలు, పర్వదినాలు కలిసివస్తే వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారుతుంది. కొన్నిసార్లు ఒకటి రెండ్రోజులు లీవ్ తీసుకుంటే వరుస సెలవులు కలిసివస్తాయి. మరి 2027 సంవత్సరం ఏ నెలలో ఎన్ని లాంగ్ వీకెండ్స్ వస్తున్నాయి? ఏ రోజు లీవ్ పెడితే ఎన్ని సెలవులు కలిసివస్తాయి? అనేది ఇక్కడ తెలుసుకుందాం.
కొత్త సంవత్సరం ఆరంభమే లాంగ్ వీకెండ్ తో ప్రారంభం అవుతోంది.
మొదటి లాంగ్ వీకెండ్
జనవరి 1 (శుక్రవారం) - న్యూఇయర్ (ప్రత్యేక సెలవు)
జనవరి 2 (శనివారం) - వీకెండ్ హాలిడే
జనవరి 3 (ఆదివారం) - సాధారణ సెలవు
రెండో లాంగ్ వీకెండ్
జనవరి 14 (గురువారం) - మకర సంక్రాంతి (ప్రత్యేక సెలవు)
జనవరి 15 (శుక్రవారం) - లీవ్ తీసుకొండి.
జనవరి 16 (శనివారం) - వీకెండ్ హాలిడే
జనవరి 17 (ఆదివారం) - సాధారణ సెలవు
మూడో లాంగ్ వీకెండ్
జనవరి 23 (శనివారం) - వీకెండ్ సెలవు
జనవరి 24 (ఆదివారం) - సాధారణ సెలవు
జనవరి 25 (సోమవారం) - లీవ్ తీసుకొండి
జనవరి 26 (మంగళవారం) - గణతంత్ర దినోత్సవం (జాతీయ సెలవు)
నాలుగో లాంగ్ వీకెండ్
మార్చి 20 (శనివారం) - వీకెండ్ సెలవు
మార్చి 21 (ఆదివారం) - సాధారణ సెలవు
మార్చి 22 (సోమవారం) - హోలి (ప్రత్యేక సెలవు)
ఐదో లాంగ్ వీకెండ్
మార్చి 26 (శుక్రవారం) - గుడ్ ప్రైడే (ప్రత్యేక సెలవు)
మార్చి 27 (శనివారం) - వీకెండ్ సెలవు
మార్చి 28 (ఆదివారం) - సాధారణ సెలవు
కుదిరితే మార్చి 23, 24, 25 (మంగళ, బుధ, గురువారం) మూడ్రోజులు లీవ్ తీసుకుంటే వారంమొత్తం సెలవులే.
ఆరో లాంగ్ వీకెండ్
ఏప్రిల్ 3 (శనివారం) - వీకెండ్ సెలవు
ఏప్రిల్ 4 (ఆదివారం) - ఆదివారం సెలవు
ఏప్రిల్ 5 (సోమవారం) - లీవ్ తీసుకొండి
ఏప్రిల్ 6 (మంగళవారం) - లీవ్ తీసుకొండి
ఏప్రిల్ 7 (బుధవారం) - ఉగాది పండగ (ప్రత్యేక సెలవు)
ఏడో లాంగ్ వీకెండ్
ఏప్రిల్ 14 (బుధవారం) - అంబేద్కర్ జయంతి (ప్రత్యేక సెలవు)
ఏప్రిల్ 15 (గురువారం) - శ్రీరామ నవమి (ప్రత్యేక సెలవు)
ఏప్రిల్ 16 (శుక్రవారం) - లీవ్ తీసుకొండి.
ఏప్రిల్ 17 (శనివారం) - వీకెండ్ సెలవు
ఏప్రిల్ 18 (ఆదివారం) - సాధారణ సెలవు
ఎనిమిదో లాంగ్ వీకెండ్
మే 15 (శనివారం) - వీకెండ్ సెలవు
మే 16 (ఆదివారం) - సాధారణ సెలవు
మే 17 (సోమవారం) - బక్రీద్ పండగ (ప్రత్యేక సెలవు)
తొమ్మిదో లాంగ్ వీకెండ్
ఆగస్ట్ 14 (శనివారం) - వీకెండ్ సెలవు
ఆగస్ట్ 15 (ఆదివారం) - స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ సెలవు ఉంటుంది. అయితే ఆదివారం కాబట్టి సాధారణ సెలవు కూడా ఉంది.
ఆగస్ట్ 16 (సోమవారం) - లీవ్ తీసుకొండి
ఆగస్ట్ 17 (సోమవారం) - రక్షా బంధన్ (రాఖీ పౌర్ణమి) ప్రత్యేక సెలవు
పదో లాంగ్ వీకెండ్
అక్టోబర్ 8 (శుక్రవారం) - దసరా పండగ (ప్రత్యేక సెలవు)
అక్టోబర్ 9 (శనివారం) - వీకెండ్ సెలవు
అక్టోబర్ 10 (ఆదివారం) - సాధారణ సెలవు
పదకొండో లాంగ్ వీకెండ్
అక్టోబర్ 29 (శుక్రవారం) - దీపావళి పండగ (ప్రత్యేక సెలవు)
అక్టోబర్ 30 (శనివారం) - వీకెండ్ సెలవు
అక్టోబర్ 31 (ఆదివారం) - సాధారణ సెలవు
పన్నెండో లాంగ్ వీకెండ్
డిసెంబర్ 24 (శుక్రవారం) - క్రిస్మస్ ఈవ్ (ప్రత్యేక సెలవు)
డిసెంబర్ 25 (శనివారం) - క్రిస్మస్ పండగ (ప్రత్యేక సెలవు). వీకెండ్ సెలవు కూడా ఉంటుంది.
డిసెంబర్ 26 (ఆదివారం) - సాధారణ సెలవు