Viral Video: ఎవ‌రీ అమ్మాయిలు.? ఏంటీ మాటలు..? అస‌లేం జ‌రుగుతోంది.?

Published : Jul 21, 2025, 12:52 PM IST

ఏఐ ప్ర‌పంచాన్ని మార్చేస్తోంది. అసాధ్యాల‌ను సుసాధ్యం చేస్తోంది. ప‌నిని సుల‌భ‌త‌రం చేస్తోంది. కానీ ఇదంతా నాణేనికి ఒక‌వైపు మాత్ర‌మే మ‌రోవైపు చాలా ప్ర‌మాదం పొంచి ఉంది. తాజాగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న వీడియోలే దీనికి సాక్ష్యం. 

PREV
15
స్టాండ‌ప్ కామెడీ పేరుతో అరాచ‌కం

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్ ఎక్క‌డ చూసినా కొంద‌రు అమ్మాయిలు హ‌డావిడి చేస్తున్నారు. స్టాండ‌ప్ కామెడీ కార్య‌క్ర‌మంలో మ‌హిళ‌లు మాట్లాడుతున్న వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి. అయితే కామెడీకి బ‌దులుగా అశ్లీలంగా మాట్లాడడం ఇప్పుడు చ‌ర్చ‌కు దారి తీసింది. నిజానికి ఈ వీడియోల్లో క‌నిపిస్తోంది నిజ‌మైన అమ్మాయిలు కాదు. అది కూడా ఈ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ పుణ్య‌మే.

AI టూల్స్‌తో రూపొందించిన ఈ వీడియోలను తెగ వైర‌ల్ చేస్తున్నారు. స్టాండప్ కామెడీ పేరుతో, మహిళలు అశ్లీలంగా మాట్లాడుతున్నట్లు చూపిస్తూ డబుల్ మీనింగ్ డైలాగ్‌లు కలిగిన వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తాయి. ముఖాలు, బాడీ లాంగ్వేజ్, వాయిస్ వ‌ర‌కూ అన్నీ నిజ‌మైన మ‌నిషిని పోలిన‌ట్లు ఉండ‌డంతో అంతా వీటిని నిజ‌మైన వీడియోలుగా భ్ర‌మ‌ప‌డుతున్నారు.

25
మ‌హిళ‌ల‌పై దుష్ప్ర‌భావం

ప్ర‌స్తుతం ఈ వీడియోలు అత్యంత ప్రమాదకరమైన సామాజిక దుష్ప్రభావాలను కలిగిస్తున్నాయి. ఈ వీడియోలు చూసిన వారు వీటిని చూసి.. మహిళలు అశ్లీలంగా మాట్లాడుతున్నారని భావించి, మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది మహిళల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దారుణ‌మైన కామెంట్స్ మ‌హిళ‌ల ఆత్మ‌గౌర‌వాన్ని దెబ్బ‌తీసేలా ఉంటున్నాయి.

35
సాంఘిక సంబంధాల పతనం

ఏఐతో రూపొందించిన ఈ వీడియోలు మ‌నుషుల మ‌ధ్య బంధాల‌ను కూడా దెబ్బ తీస్తాయ‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. వీటిలో ప్ర‌స్తావించే అంశాలు స‌మాజంలో ఎన్నో ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తుతున్నాయి. వ్య‌క్తుల మ‌ధ్య న‌మ్మ‌కాల‌ను దెబ్బతీసేలా ఉంటున్నాయి. వ్యక్తిగత గౌరవం, పరస్పర నమ్మకం అనే అంశాలు ఇలాంటి ఫేక్ వీడియోల కార‌ణంగా బ‌ల‌య్యే ప్రమాదం ఉంద‌ని అంటున్నారు.

45
టెక్నాల‌జీ దుర్వినియోగం

టెక్నాల‌జీ అనేది రెండు వైపుల ప‌దును ఉన్న క‌త్తిలాంటిద‌ని చెబుతుంటారు. అందుకే దీనిని స‌రిగ్గా ఉప‌యోగించాల‌ని అంటుంటారు. కానీ కొంద‌రు అత్యంత ప్రతిభ ఉన్నవారు వారి నాలెడ్జ్‌ను ఇలా దుర్వినియోగం చేస్తున్నారు. స్లాండ‌ప్ కామెడీ అనే ముసుగు వేసుకొని వ్యూస్ కోసం ఎంత‌కైనా దిగ‌జారుతున్నారు. అచ్చా ఎఫ్ఎమ్ అనే ఛాన‌ల్ అయితే ఏకంగా లోగోతో స‌హా ఈ వీడియోల‌ను అప్‌లోడ్ చేస్తున్నారు.

55
ఈ వీడియోల‌ను ఎలా గుర్తించాలి.? ఏం చేయాలి.?

ప్రభుత్వాలు, సోషల్ మీడియా సంస్థలు, టెక్ కంపెనీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. డీప్‌ఫేక్ ను గుర్తించడానికి ప్రత్యేక సాంకేతిక పరికరాలు అభివృద్ధి చేయాలి. ఇలాంటి వీడియోలు సామాజిక మాధ్యమాల్లోకి రాకుండా చేసే టెక్నాల‌జీని అభివృద్ధి చేయాలి.

అలాగే ప్రజల్లో సైబర్ అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టాలి. AI వీడియోలు రియల్ కాదని గుర్తించడానికీ FaceOnLive, Microsoft Authenticator, FakeCatcher వంటి టూల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా క్రాస్ చెక్ చేసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఇలాంటి అస‌భ్య‌క‌ర‌మైన కంటెంట్‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో ఇత‌రుల‌కు ఫార్డ‌ర్డ్ కానీ లైక్ కానీ చేయ‌కూడ‌దు. అలాగే స‌ద‌రు అకౌంట్‌పై రిపోర్ట్ కొట్టాలి. ఇలా ఎక్కువ మంది రిపోర్ట్ చేయ‌డం వ‌ల్ల అకౌంట్ మూత ప‌డుతుంది. మొత్తం మీద ఒక‌ప్పుడు వినేదంతా నిజం కాదు అని అనుకునే వాళ్లం, కానీ ప్ర‌స్తుతం చూసేదంత నిజం కాద‌ని చెప్పాల్సి వ‌స్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories