చెన్నైలో జరిగిన వైఎస్ బంధువుల పెళ్లి వేడుకలో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తళపతి విజయ్ కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. వీరి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెన్నైలో సందడి చేశారు. ఆయన సినిమా హీరోలను కలవడం విశేషం. చెన్నైలో తమ ఫ్యామిలీకి సంబంధించిన మ్యారేజ్ ఈవెంట్‌లో జగన్ సందడి చేశారు. ఇందులో కోలీవుడ్ స్టార్స్ పాల్గొని హల్ చల్ చేశారు. హీరోలను జగన్ కలవడం, ఈ క్రమంలో దిగిన ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
27
జగన్‌ని కలిసి సూర్య, కార్తీ
చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో వైఎస్ జగన్ పెదనాన్న వైఎస్ జార్జిరెడ్డి కొడుకు సునీల్‌రెడ్డి కుమారుడు సాహిల్ రెడ్డి వివాహం జరిగింది. వేది క తో ఆయన పెళ్లి ఆదివారం చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందులో వైఎస్ ఫ్యామిలీ, లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదే వేడుకలో కోలీవుడ్ హీరోలు సందడి చేయడం విశేషం. దళపతి విజయ్, సూర్య, కార్తీలు పాల్గొని సందడి చేశారు.
37
విజయ్‌కి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికిన జగన్
విజయ్‌ని జగన్మోహన్ రెడ్డి కలిశారు. ఆయన్ని పెళ్లి వేడుకకు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అంతేకాదు దగ్గరుండి విజయ్‌ని తీసుకొచ్చి ఇద్దరు ఒకేచోట కూర్చున్నారు. జగన్, విజయ్‌ల మధ్య సంభాషణ ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది. రాజకీయంగా చర్చనీయాంశంగానూ మారుతుంది. ఎప్పుడూ కలవని వీరిద్దరు ఇలా పెళ్లి వేడుకల కలవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
విజయ్ తమిళనాడులో రాజకీయంగా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఆయన తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఈ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ప్రచారంలో బిజీగా ఉన్నారు.
57
జగన్, విజయ్ కలయిక చర్చనీయాంశం
మరోవైపు ఆయన హీరోగా నటించిన `జన నాయకుడు` మూవీ విడుదలకు రెడీ అవుతుంది. ఈ క్రమంలో ఆయన ఈ పెళ్లి వేడుకకి హాజరు కావడం, జగన్‌తో ప్రత్యేకంగా మాట్లాడుకోవడం వైరల్‌గా మారింది.
67
వైఎస్ ఫ్యామిలీ పెళ్లి వేడుకలో స్టార్స్ హల్‌చల్
ఇక ఈ సాహిల్ రెడ్డి, వేది క ల వివాహ వేడుకలో విజయ్‌తోపాటు సూర్య, కార్తీలు కూడా పాల్గొన్నారు. వారితోపాటు మోహన్ బాబు, తమిళనాడు సీఎం స్టాలిన్, రాజకీయ ప్రముఖలు కూడా పాల్గొన్నారట. అలాగే జగన్ తల్లి విజయమ్మ, ఆయన భార్య భారతి, సజ్జల కూడా ఈ మ్యారేజ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
77
హాట్ టాపిక్ జగన్, విజయ్ సంభాషణలు
ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయ్‌లు రాజకీయంగా బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఇద్దరూ ఈ వేడుకలో కలవడం, ప్రత్యేకంగా మాట్లాడుకోవడం ఇప్పుడు రజకీయంగా, సినిమా ఇండస్ట్రీలోనూ చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు.