Spirit: ప్రభాస్ `స్పిరిట్` మూవీకి మరో షాక్‌.. మొన్న దీపికా, ఇప్పుడు ప్రకాష్‌ రాజ్‌ ఔట్‌.. కారణం ఇదే?

Published : Feb 08, 2026, 11:09 PM IST

Spirit: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాబోతున్న 'స్పిరిట్' సినిమా నుంచి మరో పెద్ద స్టార్ తప్పుకున్నారు. హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ యాక్షన్ డ్రామా, భారీ బడ్జెట్, స్టార్ పవర్ కాకుండా ఇతర కారణాలతో కూడా వార్తల్లో నిలుస్తోంది. 

PREV
17
చిత్రీకరణ దశలో `స్పిరిట్‌`

ప్రభాస్‌ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో `స్పిరిట్‌` మూవీ రూపొందుతుంది. డిమ్రీ తృప్తి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.  ఇందులో ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన జైలర్‌గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ మధ్య విడుదల చేసిన ఆడియో టీజర్‌లో ఈ విషయం అర్థమయ్యింది. కానీ ఈ మూవీకి సంబంధించి తాజాగా ఒక షాకింగ్‌ విషయం బయటకు వచ్చింది.  

27
`స్పిరిట్‌` నుంచి ప్రకాష్‌రాజ్‌ ఔట్‌

`స్పిరిట్‌` మూవీకి మరో షాక్‌ తగిలింది. ఈ సినిమా నుంచి ప్రకాష్‌ రాజ్‌ తప్పుకున్నారనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో దుమారం రేపుతుంది. ఓటీటీ ప్లే వెల్లడించిన సమాచారం ప్రకారం `స్పిరిట్‌` నుంచి ప్రకాష్‌ రాజ్‌ బయటకు వచ్చారట.  

37
ప్రకాష్‌ రాజ్‌, సందీప్‌ రెడ్డి వంగాకి మధ్య గొడవ

 `స్పిరిట్‌` సెట్‌లో ఊహించని మలుపు చోటుచేసుకున్నట్టు తాజా వార్తలు సూచిస్తున్నాయి. స్క్రిప్ట్, ఒక ప్రత్యేక సన్నివేశం చిత్రీకరణ విషయంలో ప్రకాశ్ రాజ్, వంగా మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందట. ఈ విషయం ఇద్దరి మధ్య ఉద్రిక్తతకు దారితీసిందని సమాచారం.

47
ప్రకాష్‌ రాజ్‌ని పక్కన పెట్టాలనుకున్నారా?

మీడియా కథనాల ప్రకారం, షూటింగ్ సమయంలో నటుడి ప్రవర్తన సమస్యలు ప్రొడక్షన్ టీమ్‌కు నచ్చలేదు. అందుకే ఈ సీనియర్ నటుడిని పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే, దీనిపై ప్రకాశ్ రాజ్ గానీ, చిత్రబృందం గానీ అధికారికంగా స్పందించలేదు.

57
ప్రకాష్‌ రాజ్‌ వ్యవహారమే తేడా కొట్టిందా?

ప్రకాశ్ రాజ్ గురించి సోషల్ మీడియాలో చాలా విషయాలు వైరల్ అవుతున్నాయి. ఆయన సెట్‌కు టైమ్‌కి రారని, ఉదయం షిఫ్ట్‌కు సాయంత్రం వస్తారని అంటారు. సినిమా నిర్మాణంలో కూడా పూర్తిగా జోక్యం చేసుకుంటారని టాక్. ఈ అలవాట్లతో విసిగిపోయి మేకర్స్ అతన్ని తొలగించారా అనే ప్రశ్న తలెత్తుతోంది.

67
`స్పిరిట్‌` నుంచి తప్పుకున్న దీపికా

 గతంలో `స్పిరిట్‌` మూవీ నుంచి  బాలీవుడ్ నటి దీపికా పదుకొణె ఎనిమిది గంటల పనివేళలు డిమాండ్ చేయడంతో వచ్చిన విభేదాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నారని వార్తలొచ్చాయి. సినిమా కథలోని కొన్ని అంశాలపై దీపికకు అభ్యంతరాలు ఉన్నాయని కూడా అంటున్నారు. 

77
`స్పిరిట్‌` కథ ఇదేనా

దీపికా పదుకొణెను 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్ నుంచి కూడా తొలగించారు. ఇక స్పిరిట్‌లో దీపిక స్థానంలో తృప్తి డిమ్రిని తీసుకున్నారు. ఈ సినిమా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. ఇందుల ప్రభాస్‌ ఐపీఎస్‌గా కనిపిస్తారని, స్టిక్ట్, అండ్‌ బోల్డ్, యారోగెంట్‌ పోలీస్‌గా కనిపిస్తారని, ఆయన ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చిందనేది ఆసక్తికరం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories