వీసా స్కామ్ లో నిండా మునిగిపోయారు యూట్యూబర్ రామనందన ఆమె భర్త మధుకర్. ఫేక్ కంపెనీ ద్వారా ఎంతో మందిని మోసం చేసినట్టు ఆరోపణలు రావడంతో అసలు బండారం బయటపడింది. దోషులుగా తేలితే నందు అండ్ కో బ్యాచ్ కి ఏ శిక్షపడుతుంది?
నందూస్ వరల్డ్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా లక్షల్లో అభిమానులను సంపాదించుకుంది నందు అలియాస్ రామ నందన. యూకే నుంచి తమ ఛానెల్ రన్ చేస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యారు నందు ఆమె భర్త మధుకర్. ఎన్నో కష్టాలు అనుభవించి.. ఫారెన్ లో నిలబడిన ఈ జంట.. ఎందరికో ఆదర్శం అని అంతా అనుకున్నారు. కానీ గత కొంత కాలంగా వీరిపై వస్తున్న ఆరోపణలు, ఒక్కొక్కరుగా వస్తున్న బాధితులను చూస్తుంటే.. ఈ జంట చేసిన మోసాలు బయటపడుతున్నాయి. అయితే ఈ విషయంలో నందుతో పాటు ఆమె భార్య, తండ్రిపై కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు అబద్దం అని వాదించడమే కానీ.. సాక్ష్యాలను నందు టీమ్ చూపించలేకపోతోంది.
25
యూకేలో సొంత ఇల్లు, వ్యాపారం, సెటిల్ అయిన నందు కుటుంబం..
యూకేలో సొంత ఇల్లు కట్టుకుని అక్కడే జీవిస్తోన్న నందు, మధుకర్.. ఓ సంస్థను నడిపిస్తున్నారు. వీసాలు రెన్యూవల్ చేయించడంతో పాటు యూకేలో ఉద్యోగాలు కూడా ఇప్పిస్తామని చెప్పి.. చాలామంది దగ్గర లక్షల్లో డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. డబ్బు వెనక్కి ఇవ్వమని అడిగితే బెదిరిస్తున్నారంటూ కొంత మంది బాధితులు కేసులు ఫైల్ చేశారు. హైదరాబాద్, గుంటూరు తో పాటు లండన్ లో కూడా ఆఫీసులు తెరిచి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. దాంతో నందుతో పాటు ఆమె భర్య మధుకర్, ఆమె తండ్రి మోహన్ రావ్ ల పై కూడా కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం వారు అందుబాటులో లేరని తెలుస్తోంది.
35
నందుకి ఏ శిక్షపడే అవకాశం ఉంది..?
అయితే యూకేలో కూడా వీరిపై కేసులు నమోదు అయ్యాయని తెలుస్తోంది. అక్కడ ఉన్న కొంత మంది అభిప్రాయం ప్రకారం యూకేలో నందు, మధుకర్ లపై వచ్చిన ఆరోపణలు రుజువైతే పరిస్థితి చాలా సీరియస్ గా ఉంటుందని సమాచారం. అక్కడి ఇటువంటివి చాలా పెద్ద క్రైమ గా పరిగణిస్తారు. అంతే కాదు వీసా స్కామ్ తో పాటు ఫోర్జరీ ఆరోపణలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో వీరి నేరం రుజువైతే 8 నుంచి 10 ఏళ్లు జైలు శిక్షపడే అవకాశం ఉన్నట్టు చెపుతున్నారు. అంతే కాదు భారీగా జరిమాన కూడా విధిస్తారని సమాచారం.
ఇక ఇప్పటికే యూకే సిటిజన్స్ గా ఉన్న నందు ఫ్యామిలీని.. నేరం రుజువైతే యూకే తో పాటు భారత చట్టాల ప్రకారం జాగర్లమూడి రమానందన, మధుకర్‌కు పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది. జైలు శిక్ష తర్వాత పాస్ పోర్ట్ రద్దు చేసి ఇండియాకి డిపోర్ట్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం. 10 ఏళ్లు జైలు శిక్ష తరువాత వారిని ఇండియాలో పోలీసులకు అప్పగిస్తారని కొంత మంది విశ్లేషిస్తున్నారు. ఇక్కడ కూడా కేసులు నమోదై ఉండటంతో.. వారిపై ఇక్కడ కోర్టుల్లో కూడా విచారణ జరిగే అవకాశం ఉందని సమాచారం. నేరం ఇక్కడ కూడా రుజువైతే.. ఇండియాలో కూడా వారు శిక్షను అనుభవించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
55
నందూస్ వరల్డ్ పరిస్థితి ఏంటి?
ఇక యూట్యూబ్ ద్వారా చాలా పాపులర్ అయ్యింది నందు అలియాస్ నందన. తన ఫ్యామిలీతో కలిసి ఆమె నందూస్ వరల్డ్ లో చేసే వీడియోలకు విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఆమె వీడియోలు ఇలా పెట్టగానే అలా లక్షల్లో యూస్ వస్తుంటాయి. నందూస్ వరల్డ్ యూట్యూబ్ ఛానెల్ కు దాదాపు 22 లక్షలకు పైగా సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఇక స్కామ్ లో ఇరుక్కున్న నందు నేరం రుజువైతే.. ఆమె ఛానెల్ పై కూడా ఆ ప్రభావం పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. యూట్యూబ్ ఛానెల్ ను కూడా సస్పెండ్ చేసే అవకాశం ఉం. మొత్తానికి నందు అలియాస్ రామ నందన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. వీరి ఇష్యూ ఎంత దూరం వెళ్తుందో చూడాలి.