Samantha Decision: సమంత సంచలన నిర్ణయం.. ఏకంగా ఒకేసారి పది వ్యాపారాలు స్టార్ట్ చేసిన స్టార్‌ హీరోయిన్‌

Published : Jun 16, 2026, 08:10 AM IST

సమంత తన జీవితంలో చోటు చేసుకున్న బాధాకర సంఘటనల తర్వాత సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకేసారి పది వ్యాపారాలు స్టార్ట్ చేసింది. కెరీర్‌ పరంగా డేర్‌కి రెడీ అయ్యింది.  

PREV
15
ఆటుపోట్లని ఎదుర్కొని నిలబడ్డ సమంత

సమంత లైఫ్‌ ఒక సక్సెస్‌ స్టోరీ. ఆమె ఎంతో మందికి ఆదర్శమని చెప్పొచ్చు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఫేస్‌ చేసింది. వ్యక్తిగత జీవితంలో చాలా కోల్పోయింది. పెళ్లి పెటాకులయ్యింది. ఆ తర్వాత అనారోగ్యంతో పోరాడింది. వీటి నుంచి బయటపడే లోపే తండ్రి మరణించాడు. ఇలా సమంతకి ఒకేసారి దెబ్బ మీద దెబ్బ పడ్డాయని చెప్పొచ్చు. అయినా స్ట్రాంగ్‌గా ఉంది. స్ట్రాంగ్‌గా నిలబడింది. ఇప్పుడు మళ్లీ నటిగా బిజీ అవుతుంది.

25
మా ఇంటి బంగారంతో రాబోతున్న సమంత

ఈ క్రమంలో తాజాగా `మా ఇంటి బంగారం` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది సమంత. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి తన భర్త రాజ్‌ నిడిమోరు నిర్మించడం, కథ, స్క్రీన్‌ ప్లే అందించడం విశేషం. లేడీ ఓరియెంటెడ్‌ కథాంశంతో సాగే ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. విడుదలైన ట్రైలర్‌ ఆకట్టుకుంది. ఇందులో సమంత చేసే యాక్షన్‌ అదిరిపోయింది. ప్రస్తుతం సమంత చిత్ర ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఈ క్రమంలో అనేక విషయాలను పంచుకుంది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు దక్కుతున్న ఆదరణ, మహిళలపై చిన్న చూపు, హీరోయిన్ల పారితోషికాలు వంటి అంశాల గురించి మాట్లాడింది.

35
సమంత సంచలన నిర్ణయం

ఇదిలా ఉంటే ఈ సందర్భంగా ఒక షాకింగ్‌ విషయాన్ని వెల్లడించింది. తాను తీసుకున్న సంచలన నిర్ణయాన్ని బయటపెట్టింది. సాధారణంగా సినీ సెలబ్రిటీలు ఒక స్టేటస్‌ వచ్చాక.. సినిమాలతోపాటు యాడ్స్ చేస్తుంటారు. కమర్షియల్‌ యాడ్స్ ద్వారా బాగా సంపాదిస్తుంటారు. సినిమాల కంటే ఇలా సైడ్‌ బిజినెస్‌ల ద్వారానే ఎక్కువగా సంపాదిస్తుండటం విశేషం. సమంత కూడా చాలా కమర్షియల్‌ యాడ్స్ చేసింది. కోట్ల పారితోషికాలు తీసుకుంది. కానీ తన జీవితంలో జరిగిన సంఘటనల తర్వాత సంచలన నిర్ణయం తీసుకుంది.

45
అలాంటి కమర్షియల్‌ యాడ్స్ కి దూరంగా సమంత

ఇకపై కమర్షియల్‌ యాడ్స్ చేయకూడదని నిర్ణయించుకుందట. అయితే తాను నమ్మని ఏ ప్రొడక్ట్ ని ప్రమోట్‌ చేయోద్దని నిర్ణయించుకుందట. తాను వాడని, వాటిపై నమ్మకం లేని బ్రాండ్స్ కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండకూడదని నిర్ణయం తీసుకుందట. ఏదైతే తనకు నమ్మకం కలుగుతుందో, ఏదైతే తాను వాడగలుగుతుందో వాటినే ప్రమోట్‌ చేయాలని అనుకుంటుందట. ఈ విషయంలో రాజీపడేది లేదని తెలిపింది సమంత. దీంతో చాలా కమర్షియల్‌ యాడ్స్ నుంచి ఆమె తప్పుకున్నట్టు సమాచారం. ఇక ప్రస్తుతం సమంత.. హెల్త్ రిలేటెడ్‌ బ్రాండ్‌లను, జ్యూవెల్లరీ యాడ్స్ ని ప్రమోట్‌ చేస్తుంది. మెయిన్‌గా హెల్త్ కి ఉపయోగపడే వాటినే ప్రమోట్‌ చేస్తుంది. ప్రస్తుతం ఆమె సోషల్‌ మీడియాలో అవే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

55
పది వ్యాపారాల్లో సమంత పెట్టుబడులు

ఇదిలా ఉంటే సమంత కమ్‌ బ్యాక్‌ ఇచ్చే క్రమంలో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యాపారాల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తోందట. దీనిపై సమంత మాట్లాడుతూ, `ప్రతి పని స్క్రాచ్‌ నుంచి నేర్చుకోవాలి. బిజినెస్‌ గురించి నాకేం తెలియదు, కానీ నెమ్మదిగా వాటి గురించి తెలుసుకుంటున్నాను. నేను కమ్‌ బ్యాక్‌ అయ్యాక దాదాపు పది వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాను. అదే సమయంలో నేను నమ్మలేని ఎండార్స్ మెంట్స్ ని బ్రాండింగ్‌ చేయడం ఆపేస్తున్నాను. మరోవైపు లేడీ డ్రైవన్‌ స్క్రిప్ట్ లకు ప్రయారిటీ ఇస్తున్నాను. అవసరమైతే వాటికి ఫండింగ్‌ కూడా చేస్తున్నాను` అని తెలిపింది సమంత. ఇటీవల ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఈ విషయాలను పంచుకుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories