Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?

Published : Dec 17, 2025, 10:36 PM IST

ఒక సినిమాలో ఒక్క కమెడియన్‌ ఉంటేనే నవ్వులు తట్టుకోలేం. అలాంటిది ఇద్దరు ఉంటే, అది కూడా బ్రహ్మానందం, యోగిబాబు కలిసి నటిస్తే, రచ్చ వేరే లెవల్‌. అది `గుర్రం పాపి రెడ్డి` సినిమాతో జరగబోతుంది.   

PREV
15
యోగిబాబు, బ్రహ్మానందం కలిసి నటించిన సినిమా

యోగిబాబు ఇప్పుడు కోలీవుడ్‌లో టాప్‌ కమెడియన్‌. ఒకప్పుడు తెలుగులో బ్రహ్మానందం ఎలాగో, ఇప్పుడు ఆయన అలాగా. తమిళ ఆడియెన్స్ కి నవ్వులు పూయిస్తున్న ఆయన ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తున్నారు. అంతేకాదు హాస్యబ్రహ్మ బ్రహ్మానందంతో కలిసి నటిస్తున్నారు. ఒక్క కమెడియన్‌ ఉంటేనే ఆ నవ్వులు తట్టుకోవడం సాధ్యం కాదు, అలాంటిది ఇప్పుడు రెండు నవ్వులు తోడైతే నవ్వులు సునామీనే అని చెప్పొచ్చు. ఆ సునామీ త్వరలో రాబోతుంది.

25
`గుర్రం పాపిరెడ్డి`తో రాబోతున్న బ్రహ్మి, యోగిబాబు

బ్రహ్మానందం, యోగిబాబు కలిసి `గుర్రం పాపిరెడ్డి` చిత్రంలో నటిస్తున్నారు. నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో  వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఇటీవల ప్రీ రిలీజ్‌ ప్రెస్‌ మీట్‌ జరిగింది. ఇందులో బ్రహ్మానందం పాల్గొన్నారు. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

35
యోగిబాబు నవ్వులు స్పెషల్‌

కమెడియన్ బ్రహ్మానందం మాట్లాడుతూ, `గుర్రం పాపిరెడ్డి` సినిమాలో నేను ఇంపార్టెంట్ రోల్ చేశాను. కథను ప్రేక్షకులకు తెలియజేసే జడ్జి పాత్రలో నటించాను. ఇదొక డిఫరెంట్ స్టోరీ. ఈ చిత్రాన్ని ఇప్పటి ప్రేక్షకులకు నచ్చేలా కొత్త పద్ధతిలో దర్శకుడు మురళీ మనోహర్ తెరకెక్కించాడు. యోగి బాబు పాత్ర స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుంది. అతనితో నాకు కాంబినేషన్స్ సీన్స్ ఉండవు కానీ యోగిబాబు ఈ మూవీలో హిలేరియస్ కామెడీ చేశాడు. జీవన్ కుమార్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వశీధర్ కోసిగి తమ పాత్రల్లో బాగా నటించారు. దర్శకుడు వారితో అలా పర్ ఫార్మ్ చేయించారు. నేను సెట్ లో ఉన్నప్పుడు హీరో హీరోయిన్స్ ఓల్డ్ గెటప్ లో వచ్చి కలిశారు. ఎవరో బయటవారు షూటింగ్ చూసేందుకు వచ్చారని అనుకున్నా. ఇలా డిఫరెంట్ గెటప్స్ లో హీరో నరేష్, హీరోయిన్ ఫరియా ఆకట్టుకుంటారు. ప్రొడ్యూసర్స్ సినిమా బాగా వచ్చేలా రాజీ పడకుండా నిర్మించారు. ఈ నెల 19న `గుర్రం పాపిరెడ్డి` రిలీజ్ అవుతోంది. కొత్త వాళ్లు చేసిన ఇలాంటి చిత్రాలను ఆదరిస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. మరిన్ని మంచి చిత్రాలు వారు చేసే అవకాశం కలుగుతుంది` అని అన్నారు.

45
నాలుగు గెటప్‌లో కనిపిస్తా - నరేష్ అగస్త్య

హీరో నరేష్ అగస్త్య మాట్లాడుతూ, "గుర్రం పాపిరెడ్డి" చిత్రంలో లీడ్ రోల్ చేసే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. ఇందులో మూడు నాలుగు డిఫరెంట్ గెటప్స్ లో కూడా కనిపిస్తా. ఓల్డ్ ఏజ్ గెటప్ కోసం చాలా కష్టపడాల్సివచ్చింది. డైరెక్టర్ మురళీ, ప్రొడ్యూసర్ అమర్ మమ్మల్ని బాగా చూసుకున్నారు. ఎక్కడా ఒత్తిడి లేకుండా షూటింగ్ జరిగేలా చేశారు. వాళ్లకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. మా అమర్  మంచి యాక్టర్ కూడా. నెక్ట్స్ నటుడిగా ప్రయత్నించాలని కోరుతున్నా. రీసెంట్ గా మేము ప్రమోషనల్ టూర్స్ వెళ్లినప్పుడు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. వైజాగ్ ఆడియెన్స్ మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేశారు. కృష్ణ సౌరభ్ మ్యూజిక్ మా మూవీకి హైలైట్ అవుతుంది. ఆయన ఫరియాతో పాడించినట్లు నాతోనూ ఒక పాట పాడిస్తారని అనుకున్నా. నిరంజన్ రాసిన కామెడీ పంచ్ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. మా సినిమా చూసి మీ రెస్పాన్స్ తెలియజేస్తారని ఆశిస్తున్నా` అని అన్నారు.

55
డార్క్ కామెడీ చిత్రమిది- ఫరియా అబ్దుల్లా

హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ - ఈ సినిమాలో సౌధామిని క్యారెక్టర్ లో మీ ముందుకు వస్తున్నాను. ఒక డిఫరెంట్ డార్క్ కామెడీ చిత్రమిది. ఈ ఈవెంట్ లో మా డైరెక్టర్ మురళీ మనోహర్  ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. అలాంటి క్రియేటివ్ పర్సన్ భావోద్వానికి గురయ్యారంటే మూవీ కోసం ఎంత తపన పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. కృష్ణ సౌరభ్ పాటలతోనే కాదు తన బీజీఎంతో కూడా మూవీని మరో ఎత్తుకు తీసుకెళ్లారు. ఈ మూవీలో నేను ఒక సాంగ్ రాసి పాడి కొరియోగ్రాఫ్ చేశాను. మా ప్రొడ్యూసర్స్ ఒక ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ లా మారిపోయారు. వాళ్లతో టూర్ చేసినట్లు షూటింగ్ కంప్లీట్ చేశాం. ఎక్కడా మాకు స్ట్రెస్ ఇవ్వలేదు. మా మూవీని చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాం` అని చెప్పారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories