మంచు మనోజ్ భారీ స్కెచ్ వేశాడు. ఆయన `డేవిడ్ రెడ్డి` చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఇందులో రామ్ చరణ్, శింబులు నటించబోతున్నారట. దీనిపై మంచు మనోజ్ స్పందించారు.
మంచు మనోజ్ అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడని చెప్పొచ్చు. చాలా గ్యాప్‌తో ఆయన నటించిన `భైరవం` మూవీ పెద్దగా ఆడకపోయినా, ఆయనకు మంచి పేరుని తీసుకొచ్చింది. ఈ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత `మిరాయ్` మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇందులో విలన్‌గా నటించినా, హీరో రేంజ్‌లో ఆయన పాత్ర ఉండటం విశేషం. దీంతో మనోజ్‌కి క్రేజ్ మరింత పెరిగింది. దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు మనోజ్. ఇప్పుడు హీరోగా వస్తున్నారు. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `డేవిడ్ రెడ్డి`. ఈ చిత్రం నుంచి గ్లింప్స్ ని విడుదల చేశారు.
25
`డేవిడ్ రేంజ్` గ్లింప్స్
ఈ గ్లింప్స్ ఎలా ఉందనేది చూస్తే, ఒక ఫ్యాక్టరీని చూపిస్తూ గ్లింప్స్ స్టార్ట్ అయ్యింది. ఏంటి నాన్న చాలా రోజులుగా మన ఫ్యాక్టరీ నుంచి పెద్ద పెద్ద సౌండ్స్ వస్తున్నాయని ఓ చిన్న పిల్లాడు, తన తండ్రిని అడుగుతున్నట్టుగా వాయిస్ ఓవర్ వినిపించింది. రాత్రి కూడా వర్క్ జరుగుతుంది. ఏం వర్క్ నాన్న అంటే, వేగాన్ని తయారు చేస్తున్నామని చెబుతాడు తండ్రి. వేగమా అంటే అని కొడుకు అడగ్గా, నీకు సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ తెలుసుకదా, నీకు ఇంకొక్కని గురించి చెప్పాలి. అతనిదే ఈ వేగం. అతను బ్రిటిషర్స్ కి శత్రువే, ఇండియన్స్ కి శత్రువే. నీకు మొదటి ప్రపంచ యుద్ధం గురించి చెప్పాను కదా, ఆ తర్వాత జరిగినదే జలియన్ వాలా బాగ్, భారతీయులు రక్తం తాగిన రోజు.
35
ఇది డేవిడ్ రెడ్డి ఇండియా
ఎదురించి పోరాడలేక, చాలా మంది సర్దుకుపోయారు. ఒక్కడు మాత్రం సిద్ధమయ్యాడు. కోట్ల మంది కోపం వాడి ఒక్కడి రక్తంలో నిండి ఉంది. మరిగే రక్తం నిప్పులు కక్కింది, గుండె కదిలే వేగానికి నేల కదిలింది. ఆ వేగాన్ని తోలే వేగాన్ని తన పంజాతో సృష్టించాడు. మనల్ని ఇండియన్ డాగ్స్ అనే బ్రిటిషర్స్ కి, అతను వార్ డాగ్ అయ్యాడు` అని చెబుతాడు తండ్రి. అనంతరం మంచు మనోజ్ ఎంట్రీ ఇస్తాడు. కొత్త గెటప్‌లో భారీ రాడ్డు తీసుకుని, చుట్ట కాలుస్తూ అదిరిపోయే లుక్‌లో మంచు మనోజ్ ఎంట్రీ ఇచ్చాడు. `ఏ బ్రిటీష్ ఇండియా నహీ హై, డేవిడ్ రెడ్డి ఇండియా` అని చెప్పడం అదిరిపోయింది.
ఇందులో మంచు మనోజ్ డేవిడ్ రెడ్డి పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన కోసం ఫ్యాక్టరీలో ఓ బైక్‌ని తయారు చేస్తారు. వార్ డాగ్ అనే పేరు పెడతారు. అది మొత్తం ఐరన్‌తో, పాత ఐరన్ మనిముట్లతో తయారు చేయడం విశేషం. అయితే హిస్టారికల్ నేపథ్యంలో జలియన్ వాలా బాగ్ కథ బ్యాక్ డ్రాప్‌లో ఈ మూవీ సాగుతుందని తెలుస్తోంది. అయితే ఇది నేటితరం మరో జలియన్ వాలా బాగ్‌గా కథని ఆవిష్కరించేలా ఉంది. గ్లింప్స్ మాత్రం అదిరిపోయింది. ముఖ్యంగా రవి బన్సూర్ బిజీఎం దుమ్ములేపేలా ఉంది. ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ సినిమాకి హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహించారు. వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. పాన్ ఇండియా మూవీగా దీన్ని రూపొందిస్తున్నారు.
55
డేవిడ్ రెడ్డిలో రామ్ చరణ్, శింబు
ఇదిలా ఉంటే దీన్ని భారీ స్కేల్‌లో రూపొందిస్తున్నారట. అంతేకాదు ఇందులో గెస్ట్ రోల్స్ ఉండబోతున్నాయట. రామ్ చరణ్ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. దీని గురించి ఇప్పటికే రామ్ చరణ్‌ని కలిశారట. బలమైన ఓ పాత్రకి స్కోప్ ఉందని, రామ్ చరణ్‌ని కలిసినట్టు తెలిపారు మంచు మనోజ్. ఆయన నటిస్తాడా? లేదా అనేది కన్ఫమ్ చేయలేదు. దాని గురించి మున్ముందు మాట్లాడతామని తెలిపారు మనోజ్. అంతేకాదు రామ్ చరణ్‌తోపాటు శింబు కూడా కనిపిస్తారని తెలుస్తోంది. ఇదే నిజమైతే `డేవిడ్ రెడ్డి` సినిమా రేంజ్ వేరే లెవల్ అని చెప్పొచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి.