సమంతనా మజాకా.. `యశోద` ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లో దుమ్మురేపిందిగా.. ఎన్ని కోట్లకో తెలిస్తే మతిపోవాల్సిందే?

First Published Nov 9, 2022, 8:02 PM IST

స్టార్‌ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం `యశోద` విడుదలకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమాకి సంబందించిన ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ వివరాలు షాకిస్తున్నాయి. 
 

సమంత(Samantha) చాలా రోజులు తర్వాత తెలుగుతెరపై సందడి చేయడానికి `యశోద`(Yashoda) సినిమాతో రాబోతుంది. ఆమె నాగచైతన్యతో డైవర్స్ తీసుకున్నాక ఆమె నుంచి వస్తోన్న తెలుగు చిత్రమిది. అలాగే తన అనారోగ్యంతో బాధ పడుతున్న సమయంలో వస్తోన్న సినిమా ఇది. దీనికి తోడు ప్రస్తుతం సమాజంలో సరోగసి మ్యాటర్‌ చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో అలాంటి కథతోనే వస్తోన్న సినిమా `యశోద` కావడం విశేషం. అలాగే ఫస్ట్ తెలుగు పాన్‌ ఇండియా లేడీ ఓరియెంటెడ్‌ మూవీ కావడం విశేషం. ఇవన్నీ ప్రత్యేకతలతో వస్తోన్న సినిమా కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
 

తాజాగా ఈ సినిమా బడ్జెట్‌, బిజినెస్‌ చర్చనీయాంశం అవుతుంది. మొదట ఈ సినిమాని మూడు,నాలుగు కోట్లతో తెరకెక్కించాలని దర్శకులు అనుకున్నారు. కానీ నిర్మాత శివలెంక  కృష్ణ ప్రసాద్ దీన్ని లార్జ్ స్కేల్‌లో, పాన్‌ ఇండియా రేంజ్‌లో తీయాలనుకున్నప్పుడు కథని లావిష్‌గా డిజైన్‌ చేశారు దర్శకులు. అలా దాదాపు నలభై కోట్ల బడ్జెట్‌ అయినట్టు తెలుస్తుంది. ఇటీవల నిర్మాత కృష్ణప్రసాద్‌ కూడా ఈ విషయాన్నే వెల్లడించారు. ప్రస్తుతం తాము బిజినెస్‌ పరంగా సేఫ్‌లో ఉన్నామని సినిమాపై కాన్ఫిడెంట్‌ని వెల్లడించారు. 
 

అయితే మరి ఈ సినిమా ఎంత బిజినెస్‌ (Yashoda Business) చేసిందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఆసక్తికర డిటెయిల్స్ బయటకు వచ్చాయి. సినిమా బిజినెస్‌ బడ్జెట్‌ కంటే ఎక్కువే కావడం విశేషం. డిజిటల్‌ రైట్స్ తోనే సినిమా నిర్మాతలు సగం సేఫ్‌లోకి వచ్చారు. ఇక థియేట్రికల్‌, శాటిలైట్‌ రైట్స్, ఇలా అన్ని కలుపుకుని అవి బడ్జెట్‌ని దాటి లాభాల్లోకి వెళ్లడం ఓ విశేషమైతే, అది సమంత రేంజ్‌ని చాటి చెప్పడం మరో విశేషం. మరి ఈ సినిమా దేనికి ఎంత బిజినెస్‌ జరిగిందనేదిచూస్తే. 
 

`యశోద` సినిమా డిటిజల్‌ రైట్స్ ఏకంగా రూ. 24కోట్లకు ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకుందని సమాచారం. రూ.13కోట్లు శాటిలైట్‌ హక్కులు అమ్ముడు పోయాయట. ప్రముఖ టీవీ ఛానెల్‌ దక్కించుకుందని అంటున్నారు. మరోవైపు హిందీ రైట్స్ కూడా గట్టిగానే వచ్చింది. అక్కడ ఇది రూ.3.5కోట్లకు అమ్ముడు పోవడం విశేషం. ఇతర థియేట్రికల్‌ రైట్స్ సుమారు 12 కోట్లు వచ్చాయని టాక్. ఓవర్సీస్‌ రూపంలో మరో రూ. 2.5కోట్లు వచ్చాయి. ఈ రకంగా మొత్తం 55కోట్లకుపైగా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగిందని చెప్పొచ్చు. 
 

దీంతో థియేటర్లలో ఈ సినిమా ఇరవై కోట్లు వసూలు చేస్తే చాలు. నిర్మాత సేఫ్‌లోకి వెళ్తారు. బయ్యర్లు సేఫ్‌లోనే ఉంటారు. అయితే ఇదంతా సమంత రేంజ్‌ని, ఆమె మార్కెట్‌ని తెలియజేస్తుంది. అనేక ఒడిదుడుకులతో కెరీర్‌ ఉన్నా, ఆమె పై ఈ రేంజ్‌లో బిజినెస్‌ జరగడం పట్ల ట్రేడ్‌ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. దీనికి ఆమె నటించిన పాన్‌ ఇండియా వెబ్‌ సిరీస్‌ `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2` బాగా కలిసొచ్చిందని అంటున్నారు. పైగా ఆమె త్వరలో చేయబోతున్న పాన్‌ ఇండియా సినిమాలు కూడా `యశోద` మార్కెట్‌కి హెల్ప్ అయ్యాయని టాక్‌. మరి రెండు రోజుల్లో(నవంబర్‌ 11న) విడుదల కానున్న `యశోద` థియేటర్లలో ఏం స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి. 

సమంత ప్రధాన పాత్రలో హరి-హరీష్‌ దర్శక ద్వయం రూపొందించిన `యశోద` చిత్రాన్ని శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. సరోగసి నేపథ్యంలో, దాని వెనకాలు జరిగే బిజినెస్‌, క్రైమ్‌, మెడికల్‌ మాఫియా అంశాల ప్రధానంగా ఈ చిత్రం తెరకెక్కిందని తెలుస్తుంది. ఇందులో సమంత యాక్షన్‌ చేయడం విశేషం. బీజీఎం, సమంత యాక్షన్‌, పులగం చిన్నారాయణ, చల్లా భాగ్యలక్ష్మి డైలాగులు సినిమాకి మెయిన్‌ అసెట్స్ గా నిలవబోతున్నాయి. 

click me!