యష్మి మరోసారి ప్రేమలో పడిందా? అతని జాకెట్‌తో పబ్లిక్‌గా దొరికిపోయిన బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌

First Published | Dec 4, 2024, 3:46 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఫేమ్‌ యష్మి ఇప్పటికే లవ్‌ లో పడి బ్రేకప్‌ అయ్యింది. ఇప్పుడు మళ్లీ లవ్‌ లో పడింది. తాజాగా వైరల్‌ అవుతున్న ఫోటోనే అందుకు ఉదాహరణ. 
 

బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌లో ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్‌ యష్మి.. హౌజ్‌లో ఉన్నంత కాలం బాగా రచ్చ చేసింది. బాగా కంటెంట్‌ ఇచ్చింది. ఆమె చుట్టూతనే చాలా కంటెంట్‌ తిరిగిందంటే అతిశయోక్తి లేదు. రియాలిటీ, ఫేక్‌ అనే అంశాల్లో ఆమె దొరికిపోయింది, కానీ ఆటల్లో మాత్రం గట్టిగానే ఆడింది. ఏమాత్రం తగ్గకుండా రెచ్చిపోయింది. అయితే తాను గెలవడం కోసం కొన్ని సార్లు ఆమె తప్పులు చేసి దొరికిపోయింది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

అభిప్రాయాల విషయంలో జడ్జ్ మెంట్‌ మిస్‌ అయ్యింది. ఒక్కొక్కరితో ఒక్కోలా ప్రవర్తించి బ్లేమ్‌ అయిపోయింది. తనలోని ఫేక్‌ పర్సనాలిటీ బయటపడింది. వారాంతంలో హోస్ట్ నాగార్జున వచ్చి ప్రశ్నించినప్పుడు ఆమె బండారం మొత్తం బయటపడింది.

తాను దొరికిపోయిన అని తెలిసినప్పుడు కన్నీళ్లు పెట్టుకుని ఎమోషనల్‌ బ్లాక్‌ మెయిల్‌ చేసే ప్రయత్నం చేసింది. దీంతో నాగ్‌ సైతం సీరియస్‌ అయ్యారు. ఫ్లిప్‌ స్టార్‌ అంటూ ట్యాగ్‌ కూడా ఇచ్చారు. ఇలా రెండు మూడుసార్లు ఆమె దొరికిపోవడంతో మరింతగా బ్యాడ్‌ అయిపోయింది. 
 


మరోవైపు గౌతమ్‌ తన ఇంట్రెస్ట్ ని వ్యక్తం చేశాడు. ప్రేమని వ్యక్తం చేశాడు. కానీ ఆమె తిరస్కరించింది. దగ్గరికి కూడా రానివ్వలేదు. ప్రారంభంలో నాగ మణికంఠ హగ్ చేసుకున్నప్పుడు కూడా పెద్ద రచ్చ చేసింది. కానీ పృథ్వీరాజ్‌, నిఖిల్‌లను హగ్‌ చేసుకుంటూ కనిపించింది. వాళ్లతో ఫుడ్‌ని, కాఫీని కూడా షేర్‌ చేసుకుంది.

కానీ మిగిలిన వారితో అంత క్లోజ్‌ గా మూవ్‌ కాలేకపోయింది. దీంతో యష్మి రియాలిటీ లేదనే వాదన క్రమంగా బలపడుతూ వచ్చింది. అది చివరకు ఆమె ఎలిమినేషన్‌కి కారణమైంది. ఆటలో వెనకబడుతున్న తేజ, రోహిణి పృథ్వీల కంటే ముందే ఆమె హౌజ్‌ని వీడాల్సి వచ్చింది. 
 

ఇదిలా ఉంటే ఇప్పటికే యష్మి లవ్‌ లో ఫెయిల్‌ అయ్యింది. ఆమె బిగ్‌ బాస్‌ తెలుగు 8 హౌజ్‌లోకి అడుగుపెడుతున్నప్పుడే ఈ విషయాన్ని చెప్పింది. లవ్ లో ఫెయిల్యూర్ అయ్యానని, ఇకపై ప్రేమలో పడటం ఇష్టం లేదని, ప్రేమ, పెళ్లిని నమ్మడం లేదని తెలిపింది యష్మి. తాను కాలేజీ టైమ్ నుంచే ఒక వ్యక్తిని ప్రేమించిందట.

ఆమె ప్రియుడి అమ్మకి యష్మి సినిమాల్లో ఉండటం ఇష్టం లేదట. అది మానేయాలని తెలిపిందట. ఆ విషయాన్నే యష్మితో చెప్పాడు ప్రియుడు. యష్మి నో చెప్పింది. అతను దూరం పెట్టాడు. అలా ఇద్దరికి బ్రేకప్‌ అయ్యింది. 
 

ఇక బిగ్‌ బాస్‌ తెలుగు 8లో హంగామా చేసిన యష్మి.. నిఖిల్‌తో క్లోజ్‌గా మూవ్‌ అయ్యింది. ప్రారంభంలో సోనియా అటు పృథ్వీ, ఇటు నిఖిల్‌తో క్లోజ్‌గా ఉండి, ఎవ్వరినీ దగ్గరకు రానివ్వలేదు. యష్మికి ఛాన్స్ రాలేదు. ఆమె వెళ్లాక నిఖిల్‌కి దగ్గరయ్యింది. ఈ క్రమంలో ఆమె కోసం జాకెట్‌ కూడా ఇచ్చారు నిఖిల్‌.

దాన్ని తన వద్దనే దాచుకుంది. అంతేకాదు నిఖిల్‌పై ఫీలింగ్స్ ఉన్నాయని కూడా చెప్పింది. అంటే ఆయనతో లవ్‌లో పడిందని చెప్పొచ్చు యష్మి. అయితే అది షోకే పరిమితం అని అంతా భావించారు. కానీ నిజంగానే తనలో ఫీలింగ్స్ ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. 
 

అంతేకాదు ఇప్పుడు దాన్ని నిజం చేస్తుంది. బిగ్‌ బాస్‌ షో నుంచి బయటకు వచ్చాక నిఖిల్‌ ఇచ్చిన జాకెట్‌తో కనిపించింది యష్మి. ఓ అభిమానికి ఫోటో ఇచ్చింది. అందులో ఆమె నిఖిల్‌ ఇచ్చిన జాకెట్‌ పట్టుకుని కనిపించడం విశేషం. ఇప్పుడీ పిక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. నిఖిల్‌ మర్చిపోలేకపోతున్న యష్మి అని, వీరిది మంచి జోడీ అని, యష్మి లవ్‌ నిఖిల్‌ అంటూ కామెంట్లు పెడుతూ రచ్చ చేస్తున్నారు.

ఈ పిక్‌ని వైరల్‌ చేస్తున్నారు. మొత్తంగా యష్మి మళ్లీ ప్రేమలో పడినట్టు అర్థమవుతుంది. అయితే ఎలిమినేట్‌ కావడానికి ముందు ఓ ఆర్గ్యూమెంట్‌లో నన్ను ఛీట్‌ చేశావా? అంటూ ఆమె ఫైర్‌ అయ్యింది. ఆయన్నే నామినేట్‌ చేసింది. ఇప్పుడు ఆయన జాకెట్‌తోనే తిరుగుతుంది. మరి ఈ లవ్‌ ట్రాక్‌ ఎటువైపు వెళ్తుందనేది బిగ్‌ బాస్‌ 8వ సీజన్‌ అయిపోతేగానీ క్లారిటీ రాదు.  
 

ప్రస్తుతం బిగ్‌ బాస్‌ తెలుగు 8 హౌజ్‌లో ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. నిఖిల్, గౌతమ్‌, విష్ణు ప్రియా, ప్రేరణ, నబీల్‌, అవినాష్‌, రోహిణి ఉన్నారు. వీరిలో అవినాష్‌ ఇప్పటికే ఫైనలిస్ట్ అయ్యారు. మరి వీరిలో ఎవరు విన్నర్‌ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. నిఖిల్‌ కి ఛాన్స్ ఉందని కొందరు, గౌతమ్‌ అని మరికొందరు అంటున్నారు. నబీల్‌, ప్రేరణ, అవినాష్‌ టాప్‌లో ఉంటారని అంటున్నారు. విష్ణు ప్రియా, రోహిణి ఎలిమినేట్‌ అయ్యే అవకాశాలున్నాయి. 

read more:21 ఏళ్లకే మాతృత్వం.. స్టార్ హీరోయిన్ శ్రీలీల గురించి తెలియని నిజాలు

also read: శోభిత దూళిపాళని తీసేసి కుక్కని పెట్టుకున్నారు, నాగచైతన్య రెండో భార్యకి ముంబయిలో తీవ్ర అవమానం
 

Latest Videos

click me!