Actor Nagarjuna
సెలబ్రిటీల ఇంట్లో ఏం జరిగినా సరే అంది పెద్ద వార్తే. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే రకరకాల వార్తలతో కోడై కూస్తుంటుంది. మరీ ముఖ్యంగా పెళ్లిళ్ల విషయంలో బోలేడు విషయాలు అటు ఇటు ఎనలైజ్ చేస్తూ.. రకరకాలుగా న్యూస్ వైరల్ చేస్తుంటారు. ప్రస్తుతం అలాంటి పనే జరుగుతుంది సోషల్ మీడియాలో. అక్కినేని వారింటి పెళ్ళి గురించి నెట్టింట వైరల్ న్యూస్ కుప్పలు తెప్పలు గా వచ్చి పడుతుంది.
నాగచైతన్య రెండో పెళ్లి అది కూడా శోభిత ధూళిపాళతో జరుగుతున్న క్రమంలో.. అఖిల్ పెళ్లి విషయం అనౌన్స్ చేయడంతో అక్కినేని ప్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇచ్చినట్టు అయ్యింది. దాంతో వీరి పెళ్ళిళ్ళ గురించి ఆరాతీయ్యడం స్టార్ట్ చేవారు నెటిజన్లు. ఇప్పటికే అక్కినేని వారి పెళ్ళిళ్ళ గురించి అందరికి తెలిసిందే. దాంతో ఇప్పుడు అక్కినేని వారసులు పెళ్లిళ్లపై వార్తలు వండి వడ్డిస్తున్నారు.
Naga Chaitanya
నాగచైతన్య సమంత ప్రేమ పెళ్ళి విడాకులు.. ఇప్పుడు శోభితను పెళ్లాడటం తో పాటు.. అఖిల్ ప్రేమ.. గతంలో ఆయన ఎంగేజ్ మెంట్ కూడా జరిగి పెళ్ళి ఆగిపోవడం.. తరువాత ఇప్పుడు జైనాబ్ తో పెళ్ళి కుదరడం.. ఎవరికీ చెప్పకుండా ఎంగేజ్మెంట్ చేయడం. నాగార్జున బిజినెస్ బంధం, అఖిల్ కంటే పెళ్ళికూతురు పదేళ్లు పెద్దదంటూ మరో వార్త. జగన్ బిజినెస్ పార్ట్నర్ తో అఖిల్ పెళ్ళి అంటూ.. రకరకాల వార్తలు ఇప్పటికే సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి.
అఖిల్ పెళ్ళి ఎప్పుడు అన్న విషయాన్ని కూడా వదలడంలేదు నెటిజన్లు. అఖిల్ పెళ్ళిపై రకరకాల పుకార్లు బయటకు వస్తున్నాయి. 39 ఏళ్ళ జైనాబ్ తో 30 ఏళ్ళ అఖిల్ పెళ్లి ప్రేమ పెళ్ళా.. లేక పెద్దలు కుదిర్చిన పెళ్ళా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియా జనాలు. ఇక మరో పుకారు ఏంటంటే.. నాగచైతన్య తో పాటు అఖిల్ పెళ్లి కూడా కలిపి చేయబోతున్నారంటో మరోవార్త నెట్టింట వైరల్ అవుతోంది.
అందుకే హడావిడిగా ఎంగేజ్మెంట్ ను కానిచ్చారని కూడా అంటున్నారు. అయితే ఇందులో నిజం లేదని... అదంతా రూమర్ మాత్రమే అని నాగార్జున సన్నిహితులతో అన్నట్టు తెలుస్తోంది. నాచైతన్య పెళ్లి.. అఖిల్ పెళ్లి ఒకేసారి జరగడంలేదు అని క్లారిటీ ఇచ్చారట. నాగచైతన్య పెళ్లి తరువాత చాలా గ్యాప్ ఇచ్చి.. వచ్చే ఏడాది సంక్రాంతి తరువాత అఖిల్ పెళ్ళి చేయాలని నిర్ణయించారట నాగ్. ఈ విషయంలో వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని అంటున్నారు.
Actor Nagarjuna
అంతే కాదు అఖిల్ పెళ్ళి ఇక్కడ కాదు.. అబ్రడ్స్ లో జరగబోతోందని మరో సమాచారం. విదేశాల్లో వ్యాపారాలు చేసే జైనాబ్ తండ్రి.. అక్కడే తన కూతురు పెళ్ళి చేయబోతున్నాడని సామాచారం. అంతే కాదు హైదరాబాద్ లో రిసెప్షన్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పెళ్ళికి జగన్ కూడా ప్రత్యేక అతిధి కాబోతున్నాడన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. చూడాలి మరి అఖిల్ పెళ్ళి ఎప్పుడు జరగబోతోంది అనేది.