పుష్ప 2: జాతర సీన్ లో ఊహించని ట్విస్ట్, తన అన్న కోసమే...

First Published | Dec 4, 2024, 3:01 PM IST

పుష్ప 2 లో గంగమ్మ జాతర సన్నివేశం సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ జాతర సీక్వెన్స్ లో అల్లు అర్జున్ అన్నయ్య అజయ్ కుటుంబం కీలక పాత్ర పోషిస్తుందని తెలుస్తోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియన్ మూవీ 'పుష్ప 2'  రేపు అంటే డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ  నేపధ్యంలో ఈ చిత్రం గురించిన విశేషాలు,కబుర్లే రాజ్యం ఏలుతున్నాయి. సినిమా విశేషాలు, హైలెట్స్ గురించి ఫ్యాన్స్ తో పాటు సినిమా అభిమానులు చర్చించుకుంటున్నారు.

మరో ప్రక్కన లాస్ట్ మినిట్ దాకా ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు టీమ్. ఇది ఇలా ఉంటే ఈ చిత్రం కథని సుకుమార్ ఏ రేంజిలో రెడీ చేసి ఉంటారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా సినిమాలో గంగమ్మ జాతర సన్నివేశం సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. అయితే జాతర ఫైట్ సీన్ ఎప్పుడు వస్తుంది. ఎలా ఉండబోతోందనే విషయాలు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్నాయి. అవేంటో చూద్దాం.

Allu Arjun, #Pushpa2, sukumar


ఈ సినిమాలో జాతర ఎపిసోడ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటినుంచి హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్ పై టీమ్ పూర్తి దృష్టి పెట్టిందని సమాచారం. అల్లు అర్జున్ కెరీర్ లోనే బెస్ట్ ఎపిసోడ్ గా ఉండబోతోందని అంటున్నారు. అల్లు అర్జున్ సైతం  ప్రాణం పెట్టి మరీ ఈ ఎపిసోడ్ చేసారట. ఈ నేపధ్యంలో ఈ జాతర సీక్వెన్స్ గురించి చిన్న లీక్ లాంటిటి బయిటకు వచ్చింది. అదేంటో చూద్దాం.  


Allu Arjun, #Pushpa2, Sukumar, #kALKI


అందుతున్న సమాచారం మేరకు అల్లు అర్జున్ అన్నయ్య అజయ్ ఫ్యామిలీ ఈ సినిమాలో జాతర ఎపిసోడ్ లో క్రూసియల్ పార్ట్ ప్లే చేయబోతున్నారు. అజయ్ ఫ్యామిలీ కోసం అల్లు అర్జున్ ఈ ఫైట్ చేస్తారు. అల్లు అర్జున్ మెయిన్ ఎమోషన్, ఎయిమ్ ఏమిటనేది ఈ ఎపిసోడ్ లో స్పష్టం చేస్తారు. అజయ్...అల్లు అర్జున్  సవతి తమ్ముడు అవటంతో  పట్టించుకోడు. పుష్ప ..సిండికేట్ లీడర్ అయినా అతన్ని తమ ఫ్యామిలీలోకి రానివ్వరు. ఇంటి పేరు ఇవ్వరు. 

Allu Arjun, #Pushpa2, sukumar, #kALKI


దాంతో సెకండాఫ్ లో వచ్చే జాతర ఎపిసోడ్ లో వీళ్ల కుటుంబ బంధం ఏమిటనేది క్లారిటీ ఇస్తారు. కుటుంబం కోసం తన సిండికేట్ ని, విలన్స్ ని సైతం ఎదిరించటం, తన అన్న, కుటుబం తనని యాక్సెప్ట్ చేయకపోయినా తన అన్నకూతురుని విలన్స్ నుంచి  సేవ్ చేయటం వంటివి పుష్ప చేస్తాడు.

దాంతో పుష్పని తమ ఫ్యామిలీలో స్దానం ఇవ్వటం జరుగుతుందని వినిపిస్తోంది. ఈ ఎమోషన్ సీన్ కనుక వర్కవట్ అయితే సినిమా నెక్ట్స్ లెవిల్ లో ఉంటుందని అంటున్నారు. మాస్ కోసం మిగతా సీన్స్ డిజైన్ చేసినా ఈ సీన్స్ మాత్రం ఫ్యామిలీల కోసం రాసారంటున్నారు. చూడాలి మరి తెరమీద. 

Allu Arjun, #Pushpa2, sukumar


  భారీ ఎక్సపెక్టేషన్స్  నడుమ డిసెంబరు 5న చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2) మన ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.  పుష్ప 2 ఈ రాత్రి షోలతో జాతర మొదలైపోతుంది.ప్రీమియర్స్ , స్పెషల్ షోలు ప్రక్కన పెడితే  రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది మరియు ఈ రోజు రాత్రి ప్రీమియర్ స్క్రీనింగ్ చేస్తున్నారు.  దాంతో  సీక్వెల్ లో కీలకమైన అంశాలు ఏమి చూడబోతున్నామనేది ఇండస్ట్రీలో,మీడియా వర్గాల్లో  హాట్ టాపిక్ గా మారింది. 


సినిమాలో  `ఫీలింగ్స్‌` పేరుతో సంగీత దర్శకుడు  దేవిశ్రీ కంపోజ్ చేసిన ఈ పాట‌.. మాస్‌కు బాగా ఎక్కుతుంద‌ని  తెలుస్తోంది. ఈ పాట‌లో బ‌న్నీ, ర‌ష్మిక వేసే స్టెప్పులు కూడా స్పెష‌ల్ గా ఉండ‌బోతున్నాయంటున్నారు ఈ విష‌యాన్ని కేర‌ళ ఈవెంట్ లో అల్లు అర్జున్ స్వ‌యంగా చెప్పాడు.

పుష్ప 1లో స్టెప్పులు వేసే అవ‌కాశం పెద్ద‌గా రాలేద‌ని, వింటేజ్ బ‌న్నీని మిస్ అవుతున్నాం అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నార‌ని, అందుకే ఫీలింగ్స్ పాట‌లో స్టెప్పులు వేసి ఆ కొర‌త తీర్చామ‌ని అంటున్నాడు బ‌న్నీ. ఈ పాట‌లో అల్లు అర్జున్ స్టెప్పులు కంటే…. ర‌ష్మిక వేసిన స్టెప్పులే సెంట్రాఫ్ అట్రాక్ష‌న్ గా  ఉండబోతున్నాయట.  
 

Latest Videos

click me!