నీ మాటలతో నన్ను హర్ట్ చేయాలని చూస్తున్నావు కానీ నీ వల్ల కావడం లేదు నిజానికి పట్టవలసింది నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయి నువ్వు సుఖపడింది ఏముంది? పెళ్లి లేదు తాళిలేకుండా పరాయి మగవాడి పంచన చేరావు. నీ సొంత తమ్ముడు,నీ సొంత కూతురు కూడా నిన్ను చీకొడుతున్నారు అసలు ఏం బతుకు నీది నువ్వు ఒక పెద్ద సున్నా అంటూ మాళవిక తల తిరిగిపోయేలాగా సమాధానం చెప్పి వెళ్ళిపోతాడు యష్. మరోవైపు ఆలోచనలో పడ్డ మాళవిక ఏదో జరిగింది లేకపోతే వేద స్కూల్ కి కాకుండా ఉండదు యష్ అంత చిరాకుగా ఉండడు అనుకుంటుంది.