మీరేమీ కంగారు పడకండి నేను చూసుకుంటాను అనడంతో ఆనందంగా ఫోన్ పెట్టేస్తుంది అంజలి. ఆర్య ప్లాన్ చేంజ్ చేస్తాడా, లేక మా బ్రో మైండ్ సెట్ చేంజ్ చేస్తాడా వీళ్లిద్దరి మధ్య మధ్య నేను నలిగిపోతున్నాను ఇద్దరూ టఫ్ గైస్ అనుకుంటుంది అంజలి. మరోవైపు అంజలికి బర్త్ డే గిఫ్ట్ గా నెక్లెస్ ఇస్తాడు మదన్. అంజలికి హెల్ప్ నెక్లెస్ పెట్టడంలో హెల్ప్ చేయు అంటూ అనుని కావాలనే తాకి ఆమె చేతిలో నెక్లెస్ పెడతాడు. ఇబ్బందిగానే నక్లెస్ తీసుకొని అంజలికి పెడుతుంది అను. నెక్లెస్ లో నువ్వు చాలా బాగున్నావు నీ బర్త్ డే అని ఏమో అప్పు కూడా చాలా బాగుంది అంటూ కాస్త మరోలా మాట్లాడుతాడు మదన్.