‘బలగం’ అవార్డుల పంట.. ఉత్తమ దర్శకుడిగా వేణుకు ఇంటర్నేషనల్ అవార్డు..

First Published | Apr 7, 2023, 11:01 AM IST

‘బలగం’తో  దర్శకుడు వేణు యెల్దండి సెన్సేషన్ క్రియేట్  చేశారు. దీంతో టీమ్ శ్రమకు అంతర్జాతీయంగా గుర్తింపు దక్కుతోంది. తాజాగా ఉత్తమ డైరెక్టర్ గా  ఇంటర్నేషనల్ అవార్డును గెలుచుకున్నారు. 

ఫ్యామిలీ డ్రామాగా తెలంగాణ నేపథ్యంలో వచ్చిన చిత్రం ‘బలగం’ Balagam. కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న  వేణు యెల్దండి (Venu Yeldandi) ఈ చిత్రంతో దర్శకునిగా మారారు. తొలిచిత్రంతోనే పాస్ అయ్యాడు. అంతేకాదు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. 
 

మరోవైపు చిత్రానికి అంతర్జాతీయంగానూ గుర్తింపు తెచ్చుకుంటోంది. అవార్డుల పంట  పండిస్తోంది. మార్చి 3న విడుదలై ఈ చిత్రం ఇప్పటి వరకు 9 అవార్డులను సొంతం చేసుకుంది. ఉగాది సందర్భంగా తెలుగు సినిమా వేదిక నుంచి నంది అవార్డు, లాస్‌ ఏంజెల్స్ సినిమాటోగ్రఫీ నుంచి బెస్ట్ ఫీచర్‌ ఫిల్మ్, బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. 
 


ఐదు రోజుల కింద ఉక్రెయిన్ లోని ఒనికో ఫిల్మ్ అవార్డ్స్ నుంచి బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అవార్డును గెలుచుకున్నారు. అలాగే బెస్ట్ సౌండ్ డిజైన్ విభాగంలో ఏథెన్స్ ఇంటర్నేషనల్ మంత్లీ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు దక్కింది. DC ఇంటర్నేషనల్ సినిమా ఫెస్టివల్ లో ఏకంగా నాలుగు అవార్డులను గెలుచుకున్నారు. 

బెస్ట్ ఫీచర్ డైరెక్టర్, ఉత్తమ నటుడు,  ఉత్తమ నటి, ఉత్తమ కథనం విభాగంలో డీసీ ఇంటర్నేషనల సినిమా అవార్డులను ప్రకటించారు..  ఇక తాజాగా దర్శకుడు వేణు యెల్దండికి ఉత్తమ దర్శకుడిగా అంతర్జాతీయ అవార్డు దక్కింది. ఆమ్‌స్టర్‌డామ్‌ ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో ఉత్తమ దర్శకుడు అవార్డును గెలుచుకున్నారు. 
 

కుటుంబ అనుబంధాలు, పల్లె వాతావరణం, తెలంగాణ కల్చర్ ను చూపించారు. అందుకు తగట్టుగా నటీనటుల పెర్ఫామెన్స్, సంగీతం ఉండటంతో సినిమా ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది. ఊరూర ఈ చిత్రానికి ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. మరోవైపు ఇలా అంతర్జాతీయంగా గుర్తింపు దక్కించుకుంటడం సంచలనంగా మారింది.
 

నటుడు ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించారు. మరుళీధర్ గౌడ్, రచ్చ రవి కీలక పాత్రల్లో నటించారు. దిల్ రాజ్ తన సొంత బ్యానర్ లో నిర్మించారు. ఆచార్య వేణు సినిమాటోగ్రఫీ అందించగా.. మధు ఎడిటర్ గా వర్క్  చేశారు. భీమ్స్ సిసిరోలియో అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మార్చి 3న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. 
 

Latest Videos

click me!