మీరే కావాలని మా పెళ్ళికి చెడగొట్టారు అంటూ ఆదిత్య ని తీసుకొని కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మాళవిక. ఆ తర్వాత వసంత్, చిత్రల పెళ్లి ఘనంగా జరుగుతుంది. మరోవైపు అభిని బయట మీద బయటకు తీసుకురావడానికి లాయర్లని మాట్లాడుతుంది మాళవిక. కేసు చాలా స్ట్రాంగ్ గా ఉంది అతన్ని బెయిల్ మీద తీసుకురావటం మా వల్ల కాదు అంటూ లాయర్లు చేతులెత్తేస్తారు.బ్రమరాంబిక గారికి ఫోన్ చేస్తాను ఆవిడైతేనే ఏదో ఒకటి చేస్తారు అంటూ బ్రమరాంబిక కి ఫోన్ చేసి విషయం చెప్తుంది మాళవిక.