నువ్వు నాకు ఒక గురుదక్షిణ ఇవ్వాలి, ఇస్తావు కదా అని అడుగుతుంది. నా ప్రాణాలు అయితే అడగరు కదా మేడం అయినా పర్వాలేదు ఆనందంగా ఇచ్చేస్తాను అంటుంది వసుధార. నీ ప్రాణాలు రిషివి అవి ఎలా అడుగుతాను అని చెప్పి విషయం చెప్పకుండా వసుధార దగ్గర మాట తీసుకుంటుంది జగతి. మరుసటి రోజు ఉదయాన్నే కాలేజీకి వెళ్ళటం కోసం రెడీ అయ్యి హాల్లోకి వస్తుంది జగతి.