అందరూ వద్దన్నా.. Vijay Devarakonda చేసిన పనికి అల్లు అరవింద్‌కు రూ. 40 కోట్లు వచ్చాయ్

Published : Mar 17, 2026, 06:25 PM IST

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ మేనమామ, నిర్మాత యష్ రంగినేని ఓ ఇంటర్వ్యూలో విజయ్ పట్ల సోషల్ మీడియాలో జరుగుతున్న నెగటివ్ ప్రచారంపై ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 'ఫ్యామిలీ స్టార్' విడుదల సమయంలో విజయ్‌ని కావాలనే టార్గెట్ చేశారని.. 

PREV
15
విజయ్ దేవరకొండ పోరాటం

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఎదుగుదల వెనుక ఎంతో కష్టం, పోరాటం ఉంది. అతని ప్రయాణంలో ఎదురైన అడ్డంకుల గురించి మేనమామ యష్ రంగినేని తాజా ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు.

25
నెగటివిటీపై గళం

విజయ్ సినిమాలకు వ్యతిరేకంగా కొందరు వాంటెడ్ గా నెగటివ్ ప్రచారం చేస్తున్నారని యష్ రంగినేని ఆవేదన వ్యక్తం చేశారు. "సినిమా బాగున్నా లేకున్నా అది ప్రేక్షకులు నిర్ణయించాలి. కానీ సినిమా విడుదల కాకముందే నెగటివ్ రివ్యూలతో ప్రేక్షకులను థియేటర్లకు రాకుండా చేయడం ఎంతవరకు సమంజసం?" అని ఆయన ప్రశ్నించారు. విజయ్‌కి ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేదని, కేవలం సొంత టాలెంట్‌తోనే ఈ స్థాయికి వచ్చాడని ఆయన గుర్తు చేశారు.

35
లీక్ సమయంలో విజయ్ కన్నీళ్లు

'టాక్సీవాలా' సినిమా కథ మొత్తం ఆన్‌లైన్‌లో లీక్ అయినప్పుడు విజయ్ చాలా కుంగిపోయాడని, ఆ సమయంలో అతను ఏడ్చాడని యష్ వెల్లడించారు.

45
రూ. 40 కోట్ల కలెక్షన్లతో..

కానీ అపజయానికి తలవొంచకుండా, నిర్మాత అల్లు అరవింద్‌ని ఒప్పించి రిస్క్ తీసుకుని సినిమాను విడుదల చేయించాడని, చివరికి ఆ చిత్రం రూ. 40 కోట్ల కలెక్షన్లతో భారీ విజయాన్ని నమోదు చేసిందని తెలిపారు. ఇది విజయ్ దృఢ సంకల్పానికి నిదర్శనమని ఆయన కొనియాడారు.

55
తండ్రి కల నెరవేర్చిన కొడుకు

విజయ్ తండ్రి గోవర్ధన్ రావు కూడా సినిమా రంగంలో రాణించడానికి ఎంతో ప్రయత్నించారు. ఆయన సాధించలేనిది విజయ్ సాధించి చూపాడు. తన కొడుకు ఒక స్టార్ హీరోగా ఎదగడం చూసి ఆ తండ్రి పడే గర్వం వెలకట్టలేనిదని యష్ పేర్కొన్నారు. విజయ్ తన సొంత నిర్ణయాలకు కట్టుబడి ఉంటాడని, తన దారిని తనే వెతుక్కుంటాడని మనం అర్ధం చేసుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories