Mahesh Babu: తమ్ముడి కవల పిల్లల బర్త్ డే వేడుకలో మహేష్‌ బాబు నమ్రత సందడి.. నయా లుక్‌లో అదరగొడుతున్న ప్రిన్స్

Published : Mar 17, 2026, 05:36 PM IST

Mahesh Babu: మహేష్‌ బాబు చాలా రోజుల తర్వాత బయట కనిపించారు. ఆయన తాజాగా తన తమ్ముడి పిల్లల పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్నారు. ఇందులో ఆయన లుక్‌ అదిరిపోయింది. 

PREV
16
తమ్ముడి కవల పిల్లల పుట్టిన రోజు వేడుకలో మహేష్‌ బాబు నమ్రత

మహేష్‌ బాబు తాజాగా పబ్లిక్‌లో మెరిశారు. తన ఫ్యామిలీతో గడిపారు. మహేష్‌ బాబు, ఆయన భార్య నమ్రత కలిసి తన తమ్ముడి పిల్లల పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్నారు.

26
తమ్ముడి కవల పిల్లల పుట్టిన రోజు వేడుకలో మహేష్‌ బాబు నమ్రత

మహేష్‌ బాబు ఆది శేషగిరి రావు కొడుకు సాయి రాఘవ(బాబీ). ఆయనకు ట్విన్స్ జన్మించారు. ఈ పిల్లల పుట్టిన రోజు లేటెస్ట్ గా జరిగింది.

36
తమ్ముడి కవల పిల్లల పుట్టిన రోజు వేడుకలో మహేష్‌ బాబు నమ్రత

ఈ పుట్టిన రోజు వేడుకలో మహేష్‌ బాబుతోపాటు నమ్రత కూడా పాల్గొన్నారు. పిల్లలను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సాయి రాఘవ భార్య ప్రియాంక ఘట్టమనేని ఈ పిక్స్ ని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది.

46
మహేష్‌ బాబు నయా లుక్‌ అదిరిపోయింది

ఇందులో మహేష్‌ బాబు లుక్‌ అదిరిపోయింది. వైట్‌ షర్ట్ ధరించి ఉన్నాడు మహేష్‌. గెడ్డంతో కనిపిస్తున్నాడు. తెల్లటి క్యాప్‌ ధరించాడు. బర్త్ డే ఈవెంట్‌ లుక్‌ గ్రాండ్‌గా ఉంది, కానీ మహేష్‌ బాబు సింపుల్‌గా రెడీ కావడం విశేషం. దీంతో ఈ నయా లుక్‌ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

56
వారణాసితో బిజీగా ఉన్న మహేష్‌ బాబు

మహేష్‌ బాబు ప్రస్తుతం `వారణాసి` చిత్రంలో నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.

66
మైథాలజీ, టైమ్‌ ట్రావెల్‌ కథతో `వారణాసి`

సైన్స్ ఫిక్షన్‌, మైథాలజీ, టైమ్‌ ట్రావెల్‌ కథాంశాలతో రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న విడుదల కానుంది. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories