విజయ్ దళపతి Vs శివ కార్తికేయన్, బాక్సాఫీస్​ పోరుకి సై అంటున్న స్టార్ హీరోలు

Published : Mar 23, 2025, 06:16 PM IST

అమరన్ సినిమాతో శివకార్తికేయన్ దశ మారిపోయింది. స్టార్ హీరో స్టేటస్ తో పాటు.. వారితో బాక్సాఫీస్ పోరుకు కూడా  సై అంటున్నాడు యంగ్ స్టార్.  శివకార్తికేయన్ తన నెక్ట్స్ సినిమాను విజయ్ దళపతి మూవీకి పోటీగా బాక్సాఫీస్ బరిలో దించబోతున్నాడు.   

PREV
14
విజయ్ దళపతి Vs శివ కార్తికేయన్,  బాక్సాఫీస్​ పోరుకి సై అంటున్న స్టార్ హీరోలు

శివ కార్తికేయన్ వర్సెస్ విజయ్: శివ కార్తికేయన్ తమిళ్​లో టాప్ యాక్టర్​. ఇప్పుడు మద్రాసి, పరాశక్తి సినిమాల్లో నటిస్తున్న ఈ హీరో.. త్వరలో ఈ రెండు సినిమాలతో రాబోతున్నాడు. మద్రాసి మూవీకి ఏ.ఆర్. మురుగదాస్ డైరెక్టర్​. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్​. అనిరుధ్ మ్యూజిక్​. ఈ సినిమా దీపావళికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Also Read: మోహన్ బాబు బదులు, ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో, యముడి పాత్ర మిస్ అయిన స్టార్ నటుడు ఎవరో తెలుసా?

 

24
పరాశక్తి

శివ కార్తికేయన్ చేస్తున్న మరో సినిమా పరాశక్తి. సుధా కొంగర డైరెక్టర్​. డాన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో శ్రీలీల, రవి మోహన్, అథర్వా, బేసిల్ జోసెఫ్ నటిస్తున్నారు. దీని షూటింగ్ కారైకుడి, చిదంబరంలో జరిగింది. ఇప్పుడు శ్రీలంకలో చేస్తున్నారు. ఇది నిజ జీవితం  ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా. 

Also Read: ప్రభాస్ కు అన్న గా స్టార్ హీరో, స్పిరిట్ మూవీ కోసం సందీప్ రెడ్డి ప్లాన్ మామూలుగా లేదుగా

34
విజయ్ వర్సెస్ శివ కార్తికేయన్

పరాశక్తి మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు​. ఇది ఆయనకు 100వ సినిమా. శివ కార్తికేయన్​కు 25వ సినిమా. ఆకాష్ భాస్కరన్ ఈ సినిమాను భారీ బడ్జెట్​తో తీస్తున్నారు. శివ కార్తికేయన్ లాస్ట్ మూవీ అమరన్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. ఇది బాక్సాఫీస్ దగ్గర రూ.350 కోట్లు కలెక్ట్ చేసింది.

Also Read: సుశాంత్ సింగ్ సూసైడ్ కేసులో కీలక మలుపు, సీబీఐ రిపోర్ట్ లో ఊహించని ట్విస్ట్!

44
జన నాయగన్

అమరన్ హిట్ తర్వాత శివ కార్తికేయన్​కు నెక్స్ట్ రేంజ్​లో  హైప్ ఇస్తున్నారు. ఇప్పుడు విజయ్​తో పోటీ పడటానికి శివకార్తికేయన్  రెడీ అవుతున్నాడని కోలీవుడ్​లో టాక్​. విజయ్ లాస్ట్ మూవీ జన నాయగన్ 2026 పొంగల్​కు రిలీజ్ అవుతోంది. శివ కార్తికేయన్ 25వ సినిమా పరాశక్తి కూడా పొంగల్​కు రిలీజ్ చేయడానికి టార్గెట్ చేస్తున్నట్లు ప్రొడ్యూసర్ ఆకాష్ భాస్కరన్ చెప్పారు.  మరి ఇదే నిజం అయితే.. ఈ రెండు సినిమాల్లో నిలిచి గెలిచేది ఎవరు అనేది చూడాలి. 

 

Read more Photos on
click me!

Recommended Stories