టాక్సిక్ కోసం ముంబై నుంచి లండన్‌కు యశ్, ఏంటి ఈ గ్లోబల్ పార్టనర్‌షిప్?

Published : Sep 20, 2025, 03:35 PM IST

ఇప్పటికే టాక్సిక్ సినిమా అమెరికాలో హాలీవుడ్‌తో వ్యాపార ఒప్పందం చేసుకుని ఇంగ్లీష్‌లో కూడా   రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో యశ్ లండన్‌కు వెళ్లారు. కారణం ఏంటో తెలుసా?

PREV
16
టాక్సిక్ షూటింగ్ పూర్తి

యశ్ నటన, నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'టాక్సిక్' ముంబై షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. ఇక్కడ దాదాపు 45 రోజుల పాటు షూటింగ్ జరిగింది. భారీ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకున్నారు స్టార్ హీరో. 

26
హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్

హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ జేజే పెర్రీ 45 రోజుల పాటు ముంబైలో ఉండి సినిమాలోని హై వోల్టేజ్ యాక్షన్ సీన్ల చిత్రీకరణను పూర్తి చేశారు. ముంబయ్ లో జరిగిన సీన్స్ సినిమాకు కీలకం కాబోతున్నాయి. 

36
నెక్ట్స్ షెడ్యూల్ ఎక్కడ?

తదుపరి షెడ్యూల్ షూటింగ్ బెంగళూరులో జరగనుంది. ఇక్కడ చివరి దశ చిత్రీకరణ జరిపి, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెడతారు. కానీ ఈలోపు కొన్ని విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 

46
లండన్‌కు ప్రయాణం

ముంబయ్ తరువాత యశ్ బెంగళూరు షెడ్యూల్ స్టార్ట్ చేయాల్సి ఉంద. ఈ నేపథ్యంలో యశ్ సడెన్ గా లండన్‌కు వెళ్లారు. సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు గ్లోబల్ పార్టనర్‌షిప్‌పై ఇక్కడ ప్రముఖ కంపెనీలతో చర్చలు జరపనున్నారని సమాచారం.

56
మార్చి 19, 2026న విడుదల

ఇప్పటికే టాక్సిక్ సినిమా అమెరికాలో హాలీవుడ్‌తో వ్యాపార ఒప్పందం చేసుకుని ఇంగ్లీష్‌లో కూడా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా మార్చి 19, 2026 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున  విడుదల కానుంది.

66
గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం

'టాక్సిక్' సినిమాకు మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాని నిర్మిస్తోంది. ఇందులో యశ్ కూడా భాగస్వామిగా ఉన్నారు. ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది.

Read more Photos on
click me!

Recommended Stories