Ennenno Janmala Bandham: యష్ పై జీవితంలో ప్రేమ ఉండదంటున్న వేద.. కాబోయే భార్య గురించి అద్భుతంగా చెప్పిన యష్!

Navya G   | Asianet News
Published : Feb 03, 2022, 02:12 PM IST

Ennenno Janmala Bandham: బుల్లితెరపై కాస్త కొత్తదనంతో ప్రసారమవుతున్న సీరియల్ ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janmala Bandham). ఈ సీరియల్ అన్ని సీరియల్స్ కథల కంటే కాస్త భిన్నంగా ఉండటంతో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ ను కూడా అందిస్తుంది. అందుకే ఈ సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు ఈ సీరియల్ లో జరిగిన ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.

PREV
15
Ennenno Janmala Bandham: యష్ పై జీవితంలో ప్రేమ ఉండదంటున్న వేద..  కాబోయే భార్య గురించి అద్భుతంగా చెప్పిన యష్!

వేద, యష్ (Yash) వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ల పెళ్లికి ఒప్పుకోవడంతో మొత్తానికి రెండు కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. దీంతో పెళ్లికి కావలసిన చీరలను చూస్తూ ఉంటారు చిత్ర వాళ్ళు. అందులో ఏ చీర నచ్చిందో వేదను (Vedha) అడుగుతారు. కానీ వేద మాత్రం నిర్ణయం వాళ్ళ పైనే వదిలేస్తుంది. మీకు ఏది నచ్చితే అది ఓకే అని అంటుంది.
 

25

మధ్యలో యష్ (Yash) గురించి టాపిక్ రావటంతో.. యశోదర్ ను లవ్ చేస్తున్నావా అని తన అక్క చెల్లెల్లు అడుగుతారు. వెంటనే వేద (Vedha) అతడినా.. అన్నట్లు మాట్లాడుతుంది. అసలు ప్రేమించనే ప్రేమించను అంటూ.. జీవితంలో అలా జరగదని చెబుతోంది. దీంతో వాళ్లు కాస్త బాధపడినట్లు కనిపిస్తారు.
 

35

మరోవైపు యష్, వసంత్ (Vasanth) బార్ లో మందు తాగుతూ ఉంటారు. ఇద్దరు తూలుతూ సరదాగా మాట్లాడుకుంటారు. పెళ్లి గురించి యష్ వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు. ఈ పెళ్లి ఖుషి (Khushi) గురించి చేసుకుంటున్నాను అని అంటూ ఖుషి ని తలచుకుంటూ ఉంటాడు. వెంటనే ఖుషి ఫోన్ చేస్తుంది.
 

45

మీరు పిలిచినట్లు గా అనిపించింది నాన్న.. అందుకే ఫోన్ చేశాను అని అంటుంది. ఆ మాటకు యష్ (Yash) ఎమోషనల్ గా ఫీల్ అవుతాడు. ఇక ఖుషి నిన్ను చూడాలనిపిస్తుంది నాన్న అని అనటంతో వెంటనే యష్ ఖుషి దగ్గరికి వెళ్తున్నానని వసంత్ (Vasanth) తో చెప్పి బయలుదేరుతాడు.
 

55

మొత్తానికి యష్ మాళవిక (Malavika) వాళ్ళ ఇంటికి వెళ్లి ఖుషి ని పిలవమని అంటాడు. దానికి మాళవిక యష్ పై అరుస్తుంది. పక్కనే అభిమన్యు యష్ మాటలు వింటూ ఉంటాడు. అంతేకాకుండా రెండో పెళ్లి చేసుకుంటున్నావట.. ఎవరు దురదృష్టవంతురాలు అని అడగటంతో.. అవును పెళ్లి చేసుకుంటున్నాను..  ఆ అమ్మాయి చాలా మంచిది అంటూ వేద (Vedha) గురించి, తన ప్రేమ గురించి అద్భుతంగా చెబుతాడు.

click me!

Recommended Stories