స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna ) వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటు టాలీవుడ్ లోనే కాకుండా అటు బాలీవుడ్ లో సైతం అవకాశాలను అందుకుంటూ ఉత్తరాదిన సత్తా చాటేందుకు తెగ ప్రయత్నిస్తోంది. కోలీవుడ్ లో మాత్రం ఈఅమ్మడి ఆటలు సాగలేదు. అక్కడ కార్తి (Karthi) తో చేసిన సినిమా ప్లాప్ అవ్వడంతో అటు వైపు తిరిగి చూడలేదు రష్మిక.
రీసెంట్ గా పుష్ప (Pushpa) సినిమాతో తమిళ్ లో కూడా మంచి ఇమేజ్ వచ్చేసింది. ఇక ఇప్పుడు రష్మిక (Rashmika Mandanna ) టార్గెట్ అంతా.. బాలీవుడ్ పై పడింది. అందుకే అక్కడ ఎక్కువగా సినిమాలు చేసేలా ప్లాన్ చేసుకుంటుంది. టాలీవుడ్ లో ఆఫర్లు వదులుకుని కూడా బాలీవుడ్ లో సినిమాలు చేయాలనేది ఆమె ప్లాన్.
అందుకోసమే ఎక్కువగా ముంబాయిలో ఉండాలని చూస్తుంది రష్మిక (Rashmika Mandanna ). అక్కడ ఉండటానికి అద్దె ఇంటికంటే.. ఒక సొంత ఇల్లు ఉంటే బాగుండు అనుకుందట. అప్పట్లో ఈమె ఓ కాస్ట్లా ప్లాట్ ను కూడా ముంబయిలో కొనుగోలు చేసిందని వార్తలు వచ్చాయి. ఆ ఇంటి గృహప్రవేశం త్వరలో జరగబోతోందని తెలుస్తోంది.
ఈ విషయం రష్మక (Rashmika Mandanna ) పెట్టిన పోస్ట్ ద్వారా రివిల్ అయ్యింది. ఇక తాజాగా నిన్న ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో చేసిన కామెంట్ వైరల్ అవుతోంది. సామాన్లు ప్యాక్ చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నానని ఆమె తెలిపింది. దీంతో ఆమె కొత్త ఇల్లు కొనుక్కుందా? అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.
నిజానికి ఈ కన్నడ కస్తూరి 2021 ఫిబ్రవరిలోనే ముంబైలో ఒక ఇంటిని కొనుగోలు చేసింది. బాలీవుడ్ లో నటిస్తున్న నేపథ్యంలో ఆమె ముంబైలో సొంత ఇంటిని ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుతం రష్మిక(Rashmika Mandanna ) బాలీవుడ్ లో మిషన్ మజ్ను, గుడ్ బై సినిమాలో నటిస్తోంది.
Rashmika Mandanna
అక్కడే ఉంటూ బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసుకోవాలి అని పక్కా స్కెచ్ లో ఉంది రష్మిక(Rashmika Mandanna ). అంతకీ.. టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం వస్తే.. అప్పుడప్పుడూ హైదరాబాద్ వచ్చి పోవచ్చు అని అనుకుంటోంది. ఇక్కడ కూడా ఉండటానికి వీలుగా ఉండేట్టు.. హైదరాబాద్ లో కూడా ఓ ఇంటిని రష్మిక (Rashmika Mandanna ) ఎప్పుడో కొన్నట్టు సమాచారం.
ఇక ఈ మధ్య మరో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) ముంబయ్ లో ఇల్లు కొని గృహ ప్రవేశం కూడా చేసింది. ఇక ఇప్పుడు రష్మిక కూడా తన సొంత ఇంట్లోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ లో పోటా పోటీగా సినిమాలు చేసిన ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లు.. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా పోటీని కొనసాగించబోతున్నారు.
ఇక ఈ మధ్య మరో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) ముంబయ్ లో ఇల్లు కొని గృహ ప్రవేశం కూడా చేసింది. ఇక ఇప్పుడు రష్మిక కూడా తన సొంత ఇంట్లోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ లో పోటా పోటీగా సినిమాలు చేసిన ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లు.. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా పోటీని కొనసాగించబోతున్నారు.