అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరి పేర్లు ఒకరు చెప్పుకొని సిగ్గుపడుతూ లోపలికి కుడికాలు పెట్టి వెళ్తారు. ఆ తర్వాత యష్ వేద అందరూ సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రాజా రాణి ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ అది చూసి యష్,వేద నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు యష్ తన మాటలతో రాజారాణి ని తన బుట్టలో వేసుకోవడంతో వేద ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత వేద, యష్ ని బెడ్రూంలోకి పిలుచుకొని వెళ్లి ఆ బెడ్ రూమ్ కి చరిత్ర గురించి చెబుతూ ఉంటాడు రాజా. ఆ తర్వాత వాళ్ళు బయటికి వెళ్లిపోవడంతో వేద ఇద్దరు ఫన్నీగా వాదించుకుంటూ ఉంటారు.