అలాంటి ఫోటో షేర్ చేసి నేనే తోపంటున్న నిధి... అందాలు చూసుకునేనా ఇస్మార్ట్ బ్యూటీకి అంత కాన్ఫిడెన్స్!

Published : Dec 20, 2022, 01:26 PM ISTUpdated : Dec 20, 2022, 01:31 PM IST

ఇస్మార్ట్ బ్యూటీ నాకు నేనే తోపు... వేరువరూ లేరంటుంది. నిధి కాన్ఫిడెన్స్ చూసి జనాలు వావ్ అంటున్నారు. మరి అంతగా తనపై నమ్మకం కలగడానికి సాలిడ్ అందాలే కావచ్చు.   

PREV
16
అలాంటి ఫోటో షేర్ చేసి నేనే తోపంటున్న నిధి... అందాలు చూసుకునేనా ఇస్మార్ట్ బ్యూటీకి అంత కాన్ఫిడెన్స్!
Nidhhi Agarwal

ఒక మేకప్ లెస్ ఫోటో షేర్ చేసిన నిధి ఆసక్తికర కామెంట్ చేశారు. నీలానే నువ్వు ఉండి. ఒకరిని అనుకరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకంటే గొప్పోళ్ళు లేరు, అని పోస్ట్ పెట్టారు. మనల్ని మనం నమ్మాలి, ప్రేమించాలి అప్పుడే విజయం సాధ్యమని నిధి ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారు.

26

ఇక నిధి(Nidhhi Agarwal) కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. వరుస ప్లాప్స్ ఆమె సతమతమవుతున్నారు. ఈ ఏడాది 'హీరో' మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన హీరో పర్వాలేదు అనిపించుకుంది. మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా ఈ మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. కమర్షియల్ గా సక్సెస్ కాకపోవడంతో మరో ప్లాప్ ఆమె ఖాతాలో చేరింది. 
 

36


ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కావాల్సి ఉంది. 

46
Nidhhi Agerwal


కొన్నాళ్ళు హరి హర వీరమల్లు షూట్ కి బ్రేక్ పడింది. పవన్-క్రిష్ మధ్య అవగాహన కుదరడంతో మళ్ళీ షూట్ స్టార్ట్ అయ్యింది. పాన్ ఇండియా చిత్రంగా హరి హర వీరమల్లు విడుదల చేయనున్నారు. హరి హర వీరమల్లు హిట్ టాక్ తెచ్చుకుంటే నిధి కెరీర్ కి చాలా ప్లస్ అవుతుంది. ఈ మూవీలో మరో హీరోయిన్ గా నోరా ఫతేహి నటిస్తున్నారు. 

56

హరి హర వీరమల్లుతో పాటు ఓ తమిళ చిత్రంలో నిధి నటిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇక 2021లో నిధి ఈశ్వరన్, భూమి అనే రెండు తమిళ చిత్రాలు చేశారు. ఆ రెండు ఆమెకు బ్రేక్ ఇవ్వలేదు.

66


నిధి కెరీర్ లో ఇస్మార్ట్ శంకర్ క్లీన్ హిట్ మూవీగా ఉంది. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఆ మూవీలో రామ్ హీరోగా నటించారు. నిధి అగర్వాల్ తో పాటు నభా నటేష్ హీరోయిన్ గా నటించారు. ఈ మూవీ రూ. 75 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ తో వసూళ్లు దుమ్మురేపింది. ఆ రేంజ్ హిట్ మరలా ఆమెకు దక్కలేదు.

Read more Photos on
click me!

Recommended Stories