యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ యమదొంగ ఆయన కోసం రాసిన కథ కాదా? ఈ సినిమా ముందుగా ఏ హీరో కోసం అనుకున్నారు. యమదొంగ మిస్ అయిన సీనియర్ హీరో ఎవరు? రాజమౌళి తారక్ కోసం ఏం చేశాడంటే?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కెరీర్‌లో గుర్తుండిపోయే విజయవంతమైన చిత్రాల్లో యమదొంగ ఒకటి. యముడు, మనిషి, యమలోకానికి వెళ్లి తిరిగి భూమికి చేరుకునే అంశాలతో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకుంది.
గతంలో యమలోకంలో హీరోల కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఏ సినిమా ప్రత్యేకత దానిదే. యమదొంగ కథ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ కూడా ఉంది.
24
యమదొంగ ఎన్టీఆర్ కోసం రాసిన కథ కాదా?
యమదొంగ సినిమా కథ నిజానికి తారక్ కోసం రాసింది కాదు.ఈ విషయాన్నిరీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. యమదొంగ కథను మొదటగా జూనియర్ ఎన్టీఆర్ కోసం రాయలేదని, ఆ కథ అసలు నటుడు మోహన్ బాబు కోసం రాసుకున్నదని చెప్పారు. విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ''పురాణాల ప్రకారం నరకంలో ఏది తక్కువగా ఉంటే ముందు అదే అనుభవించేలా చేస్తారు. ఒక వ్యక్తికి పుణ్యం తక్కువగా ఉంటే ముందుగా స్వర్గానికి పంపిస్తారు.. ఆతరువాత నరకానికి పంపుతారు. పాపం తక్కువగా ఉంటే ముందుగా నరకానికి పంపిస్తారు.. ఆతరువాత స్వర్గానికి పంపిస్తారు. అయితే పుణ్యం, పాపం రెండూ సమానంగా ఉన్న వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి కథ పుట్టింది'' అని ఆయన తెలిపారు.
34
మోహన్ బాబు మిస్ అయ్యి.. తారక్ తో
విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. పాపం పుణ్యం సమానంగా చేసిన వ్యక్తినే కథలో హీరో పాత్రగా రూపొందించాము. యముడు అలాంటి వ్యక్తిని మరిన్ని తప్పులు చేయమంటూ తిరిగి భూమికి పంపిస్తాడనే కథాంశంతో ఈ కథను డెవలప్ చేశాము. చాలా సంవత్సరాల క్రితమే ఈ కథను రాసుకున్నాము. ఆ కథ గురించి ముందుగానే రాజమౌళి కి తెలుసు. ఒక రోజు రాజమౌళి వచ్చి అదే కథతో సినిమా చేద్దామని అడిగాడు. అయితే నేను ఈ కథను ఎన్టీఆర్ కోసం రాయలేదు.. మోహన్ బాబు కోసం రాసుకున్నానని చెప్పాను. కానీ చివరకు కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి జూనియర్ ఎన్టీఆర్ తో యమదొంగ పేరుతో చేయాల్సి వచ్చిందని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.
దాదాపు 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా భారీ రెస్పాన్స్ ను సాధించింది. అప్పటి వరకూ చాలా లావుగా కనిపించిన ఎన్టీఆర్.. ఈసినిమాలో స్లిమ్ లుక్ లో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఏ మోహన్ బాబు కోసమైతే రాజమౌళి తండ్రి ఈ కథను రాసుకున్నాడో.. ఆసినిమాలోనే యముడి పాత్రను మోహన్ బాబుచేత వేయించారు. ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో ముచ్చటగా వచ్చిన మూడో బ్లాక్ బస్టర్ మూవీ యమదొంగ.. బాక్సాఫీస్ దగ్గర కూడా భారీగా కలెక్షన్స్ ను రాబట్టింది.