విజయ్ సీఎం అయిన తరువాత కూడా జన నాయగన్' విడుదల ఎందుకు ఆలస్యమవుతోంది. హీరో విజయ్ సలహా మేరకే నిర్మాణ సంస్థ ఓ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఇంతకీ ఏంటా నిర్ణయం.
తమిళనాడు సీఎం (సినిమాలో పాత్ర)గా జోసెఫ్ విజయ్ నటిస్తున్న 'జన నాయగన్' విడుదల ఆలస్యమవుతోంది. సెన్సార్ సమస్యలు ఇంకా తీరనట్టుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో, డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చిన అడ్వాన్స్ డబ్బును తిరిగి ఇవ్వాలని KVN ప్రొడక్షన్స్ నిర్ణయించింది.
24
విజయ్ సలహా మేరకే..
హీరో విజయ్ సలహా మేరకే నిర్మాణ సంస్థ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. సినిమా విడుదలకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాక, KVN ప్రొడక్షన్స్ సంస్థే సొంతంగా సినిమాను విడుదల చేస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
34
KVN సంస్థ ప్రకటనలో ఏముందంటే?
'మేం అనుకున్న సమయం కంటే సినిమా విడుదల ఆలస్యమైంది. డిస్ట్రిబ్యూటర్లను ఇంతకాలం గందరగోళంలో ఉంచడం సరికాదు. అందుకే వారు ఇచ్చిన అడ్వాన్స్ డబ్బును తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించాం. ఆ ప్రక్రియ చర్చల దశలో ఉంది. మేం కూడా సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాం' అని KVN సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.
అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే 'జన నాయగన్' సినిమా జనవరి 9న విడుదల కావాల్సింది. కానీ సెన్సార్ సర్టిఫికేట్ సమస్య వల్ల సినిమా విడుదల ఐదు నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. దీంతో అడ్వాన్స్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్లకు చాలా ఇబ్బంది ఎదురైంది.